Akshay Kumar Vimal Elaichi Ad: సారీ చెప్పిన అక్షయ్ కుమార్, యాడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటానని ప్రామిస్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రేక్షకులకు సారీ చెప్పారు. జనాభిప్రాయానికి తలొగ్గి ఇంకెప్పుడూ అటువంటి యాడ్స్ చేయనని ప్రామిస్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), అజయ్ దేవగణ్ (Ajay Devgan) కలిసి ఓ యాడ్‌లో కనిపిస్తారు. గుర్తుందా? విమల్ ఇలాచీ (Vimal Elaichi Ad) ని ప్రమోట్ చేసే ఆ యాడ్ పాపులర్ కూడా! రీసెంట్‌గా షారుఖ్, అజయ్‌కి తోడుగా అక్షయ్ కుమార్ (Akshay Kumar) కూడా యాడ్ అయ్యారు. ముగ్గురు స్టార్ హీరోలను చేసిన యాడ్ యూట్యూబ్‌లో విడుదల చేశారు. అక్షయ్ ఈ యాడ్ చేయడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. దీనికి కారణం విమల్ ఇలాచీ బ్రాండ్ పొగాకు ఉత్పత్తులను కూడా అమ్ముతుంది. టొబాకోను ప్రమోట్ చేస్తారా? అంటూ అక్షయ్ మీద విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఆరోగ్య భారత్ కోసం ఆల్కహాల్, సిగరెట్ తదితర యాడ్స్ చేయమని చాలా ఆఫర్స్ వచ్చినా చేయలేదని గతంలో అక్షయ్ కుమార్ చెప్పారు. ఈ వీడియో బయటకు తీసుకొచ్చి ట్రెండ్ చేశారు. ప్రేక్షకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో విమల్ ఇలాచీ ప్రచార కర్త (బ్రాండ్ అంబాసిడర్)గా తాను తప్పుకొంటున్నట్టు అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతే కాదు... అభిమానులకు, శ్రేయోభిలాషులకు, సన్నిహితులకు సారీ చెప్పారు.
"నేను టొబాకోను ఆమోదించలేదు, ఆమోదించను కూడా! విమల్ ఇలాచీతో నేను అసోసియేట్ అవ్వడంపై మీ అభిప్రాయాలను వెల్లడించారు. వాటిని నేను గౌరవిస్తాను. నేను చేసిన యాడ్ మీద వచ్చిన మీ రియాక్షన్ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. అందుకని, వినయపూర్వకంగా నేను వెనక్కి తగ్గుతున్నాను. ఆ యాడ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బును మంచి పనికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. చట్టప్రకారం... కాంట్రాక్ట్ ఉన్నన్ని రోజులూ ఆ సంస్థ యాడ్ టెలికాస్ట్ చేస్తుంది. భవిష్యత్తులో ఏదైనా ఎంపిక చేసుకునే ముందు జాగ్రత్తగా ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. ప్రతిఫలంగా మీ ప్రేమను ఆశిస్తున్నాను" అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.
Also Read: డెలివరీ తర్వాత గ్లామరస్‌గా ఉండదు. కానీ, అందంగా ఉంటుంది - కాజల్ భావోద్వేగభరిత లేఖ
Also Read: 'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.