Kajal Aggarwal Baby Name: డెలివరీ తర్వాత గ్లామరస్‌గా ఉండదు. కానీ, అందంగా ఉంటుంది - కాజల్ భావోద్వేగభరిత లేఖ
బాబుకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ అగర్వాల్ తొలిసారి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అందులో ఆమె ఏమన్నారంటే?
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), గౌతమ్ కిచ్లూ (Gautam Kitchlu) దంపతులకు ఏప్రిల్ 19న అబ్బాయి జన్మించిన సంగతి తెలిసిందే. ఆ బాబుకు నీల్ (Kajal Aggarwal Baby Boy - Neil) అని పేరు పెట్టారు. కాజల్ భర్త బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కుమారుడిని స్వాగతిస్తూ... కాజల్ అగర్వాల్ ఒక భావోద్వేగభరిత లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Kajal Aggarwal heartwarming letter post delivery: ''నా చిన్నారి నీల్‌ను ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మనసంతా ఆనందంతో ఉప్పొంగుతోంది. మా జననం (తల్లిగా కాజల్, చిన్నారిగా నీల్) సంతోషకరమైనది, సుదీర్ఘమైనది. ఇదొక సంతృప్తికరమైన అనుభవం. నీల్ పుట్టిన కొన్ని క్షణాల్లో అతడిని నా చేతులతో పట్టుకోవడం, గుండెలపైకి తీసుకోవడం ఒక అద్వితీయమైన అనుభూతి. ఆ క్షణం ప్రేమలోని లోతు ఎంతో అర్థమైంది. నా బాధ్యత తెలిసింది" అని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు.
Kajal Aggarwal On Postpartum: డెలివరీకి ముందు మూడు నిద్రలేని రాత్రులు గడిపానని, ఆందోళన నెలకొందని, డెలివరీ ఏమీ అంత సులభం కాలేదని కాజల్ తెలిపారు. అయితే... తల్లి అయిన తర్వాత మధురమైన క్షణాలు కూడా ఉంటాయని ఆమె చెప్పారు.
Also Read: కాజల్ కొడుకు పేరేంటో? ఆ పేరుకు అర్థం ఏమిటో తెలుసా?
"ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకోవడం... తెల్లవారు జామున మధురమైన కౌగిలింతలు... ముద్దుగా ముద్దులు పెట్టుకోవడం... ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటూ మేమిద్దరం ఎదుగుతాం. ఇదొక అద్భుత ప్రయాణం. డెలివరీ తర్వాత గ్లామరస్‌గా ఉండదు. కానీ, అందంగా ఉంటుంది" అని కాజల్ తెలిపారు.
Also Read: 'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram