Akshay Kumar: పాపం.. అక్షయ్ కుమార్, అనంత్ ప్రి-వెడ్డింగ్‌లో తెల్లవారుజాము 3 గంటలకు ఆటపాట!
Anant Ambani Pre Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌కు బాలీవుడ్ స్టార్లు తరలివచ్చారు. అందులో అక్షయ్ కుమార్ ఒకరు. అక్షయ్ అర్థరాత్రి 3 గంటలకు పాట పాడుతూ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.
Akshay Kumar at Anant Ambani Pre Wedding: అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ముగింపు లేనట్టు అనిపిస్తోంది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లికి ఇంకా సమయం ఉన్నా.. ప్రీ వెడ్డింగ్ వేడుకలు మాత్రం ఇప్పటినుండే బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్నాయి. ఇప్పటికే మార్చి 1 నుండి 3 వరకు జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా జరిగాయి. అది సరిపోదు అన్నట్టు మళ్లీ మార్చి 6న మళ్లీ ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది. ఈ వేడుకల కోసం బాలీవుడ్ సెలబ్రిటీలు మళ్లీ మళ్లీ జామ్‌నగర్‌కు చేరుకున్నారు. ఇప్పటికే ఇందులో సందడి చేసిన షారుఖ్, సల్మాన్, అమీర్‌ల డ్యాన్స్ వీడియోలు బయటికొచ్చాయి. కానీ తాజాగా అక్షయ్ కుమార్.. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసిన పర్ఫార్మెన్స్ వీడియో వైరల్ అవుతోంది.
ఖాన్స్ డ్యాన్స్ హైలెట్..
అంబానీ కుటుంబానికి, బాలీవుడ్ స్టార్లకు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే తమ బిజీ షెడ్యూల్స్‌ను పక్కన పెట్టి మరీ.. మూడు రోజుల పాటు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు వెళ్లడానికి స్టార్లు సిద్ధమయ్యారు. కొందరు అయితే ఏకంగా స్టేజ్‌పై పర్ఫార్మెన్స్‌లు కూడా ఇచ్చారు. అందులో ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు పాటకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కలిసి స్టెప్పులేయడం అయితే ఇంటర్నెట్‌ను ఊపు ఊపింది. వారితో పాటు ఇంకా ఎందరో స్టార్ హీరోలు కూడా ఈ వేడుకల్లో పర్ఫార్మ్ చేసినా.. ఖాన్స్ డ్యాన్స్ మాత్రమే హైలెట్‌గా నిలిచింది. తాజాగా అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అక్షయ్ కుమార్ చేసిన పర్ఫార్మెన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Look at the khiladi energy 💥🔥..
— AKSHAYKUMARNEWS 🇮🇳 (@Akkian_Gauravv) March 3, 2024
Forever young.@akshaykumar sir performing at #anantradhikaprewedding #AkshayKumar #AkshayKumar𓃵 pic.twitter.com/UeqrtVoVlK
పాట పాడిన అక్షయ్..
అందరి హీరోల్లాగా కాకుండా అక్షయ్ కుమార్ స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏమీ ఇవ్వలేదు. ‘గుర్ నాల్ ఇష్క్ మిఠా’ అనే పాటను పాడి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేశాడు. అర్థరాత్రి 3 గంటలకు పడుకోకుండా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేట్ చేసుకున్నామని అక్షయ్ కుమార్ స్వయంగా బయటపెట్టాడు. ఇందుకు తాను రాత్రి 9 గంటలకు నిద్రపోయి, 3 గంటలకు మేల్కొన్నానని చెప్పాడు. అంతే కాకుండా అంబానీ ఫ్యామిలీ.. ఆ సెలబ్రేషన్స్‌ను నిర్వహించిన తీరును ప్రశంసించాడు. ‘‘అది చాలా గ్రాండ్‌గా జరిగింది. అంతే కాకుండా అంబానీ ఫ్యామిలీ చాలా కేరింగ్‌గా చూసుకున్నారు. అందరినీ కలుపుకుపోయారు’’ అని చెప్పాడు. ఆ దేవుడి ఆశీస్సులు వారిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటునున్నాని అన్నాడు. సోషల్ మీడియాలో అక్షయ్ పర్ఫార్మెన్స్ చూసినవారంతా తనలో మంచి సింగర్ కూడా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రమోషన్స్‌లో బిజీ..
ప్రస్తుతం అక్షయ్ కుమార్.. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. తను హీరోగా నటించిన ‘బడే మియా చోటే మియా’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో అక్షయ్‌తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా లీడ్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నా కూడా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరు అవ్వడంతో పాటు అక్కడ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు అక్షయ్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ‘బడేమియా ఛోటేమియా’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, హీరోయిన్‌లుగా నటిస్తుండగా.. సోనాక్షి సిన్హా, అలయ ఎఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాషు భగ్నాని పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి AAZ ఫిల్మ్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి.
Also Read: హీరోయిన్ సాయి పల్లవిపై ఆర్బీఐ కేసు - ఇదీ అసలు విషయం!