Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవిపై ఆర్బీఐ కేసు - ఇదీ అసలు విషయం!
రీసెంట్ ఇంటర్వ్యూలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై ఆర్బీఐ దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసుతో ఆమె కెరీర్ కు పుల్ స్టాఫ్ పడే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.
RBI Case Against Heroine Sai Pallavi?: సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సహజ నటనతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. మనసుకు నచ్చిన సినిమాలను మాత్రమే చేస్తుంది. రెమ్యునరేషన్ ఎంత ఇస్తామని చెప్పినా, కథ నచ్చకపోతే ఇట్టే నో చెప్పేస్తుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనా ప్రాధాన్యత ఉన్న చిత్రాలను మాత్రమే చేస్తుంది. ‘ప్రేమమ్’ సినిమాతో నటిగా కెరీర్ ను మొదలు పెట్టిన సాయి పల్లవి.. ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత పలు టాలీవుడ్ సినిమాట్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగుతో పాటు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమాలో సీతగా కనిపించబోతోంది.
సాయి పల్లవిపై ఆర్బీఐ కేసు- ఇదీ అసలు వాస్తవం!
తాజాగా సాయి పల్లవికి చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పై ఆర్బీఐ ఫోకస్ పెట్టిందని, ఇప్పటికే కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిందని ఆ వార్తల సారాంశం. ఈ కేసుతో ఆమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పడటం ఖాయం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సాయి పల్లవి ఏం చెప్పింది? ఆర్బీఐ కేసు ఎందుకు పెట్టింది? అనే విషయాలపై జోరుగా చర్చ నడుస్తోంది.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి.. తాను ఓ వెబ్ సైట్ ద్వారా పని చేయకుండా సంపాదిస్తున్నానని, రోజుకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు నా అకౌంట్‌లో పడిపోతూ ఉంటాయని చెప్పిందట. దాన్ని ఆధారంగా చేసుకుని ఆర్బీఐ చర్యలు తీసుకుంటోందనే వార్త వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈ వార్తను సదరు ఛానెల్ టెలీకాస్ట్ చేయలేదని, ఇదీ ఆమె చెప్పిన విషయం అంటూ.. ఏకంగా ఓ నేషనల్ న్యూస్ పేపర్‌లో రాసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా హల్ చల్ చేస్తోంది. అయితే, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. సోషల్ మీడియాలో ఓ ఫేక్ ప్రమోటెడ్ పోస్టు ఈ అవాస్తవ ప్రచారానికి కారణం అయ్యింది. వాస్తవానికి ఆమె పేరుతో ఓ ఫేక్ వెబ్ సైట్ ఈ వార్తను రాసింది. అదీ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లోగో. ఇది నిజం అనుకుని చాలా మంది సోషల్ మీడియాలో ఆ వార్తను ప్రచారం చేశారు. అయితే, ఆ వార్తలన్నీ కేవలం ఫేక్ ప్రచారాలుగా నిపుణులు తేల్చారు. ఇలాంటి వార్తలు చూసి మోసపోకూడదని అభిప్రాయపడుతున్నారు.
ఫేక్ ప్రమోటెడ్ పోస్టులతో జాగ్రత్త!
ఇలాంటి ఫేక్, ప్రమోటెడ్ పోస్టులను క్లిక్ చేయడం ద్వారా బ్యాంక్ పాస్ వర్డ్స్, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు సైబర్ నేరస్తుల చేతికి చిక్కే అవకాశం ఉంటుందని సైబర్ నిపుణులు చెప్తున్నారు. ఈ డీటైల్స్ వారికి వెళ్లగానే ఖాతాల్లోని డబ్బులు ఖాళీ కావడం ఖాయం. అందుకే ఇలాంటి ఫేక్ పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే సైబర్ నేరస్తుల వలలో చిక్కి ఉన్నదంతా కోల్పోవడం పక్కా అంటున్నారు.
Read Also: ఆ సీన్స్ చెయ్యడానికి రెడీ - ఫస్ట్ లిప్‌లాక్ అతడికే అంటున్న బజ్జీ పాప!