Akkineni Akhil: ‘సలార్’ సక్సెస్ పార్టీలో అఖిల్, పార్ట్-2లో అయ్యగారు? చేతికి గాయం ఎలాగైంది?
Salaar Success Party: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’ సూపర్ హిట్ అవ్వడంతో మూవీ టీమ్ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో మూవీ టీమ్‌తో పాటు అఖిల్ కూడా పాల్గొన్నాడు.
Akkineni Akhil at Salaar Success Party: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’ సూపర్ డూపర్ హిట్. ఈ మూవీకి కలెక్షన్స్ కూడా ఒక రేంజ్‌లో వచ్చాయి. అందుకే సినిమా విడుదలయిన ఇన్నిరోజుల తర్వాత మూవీ టీమ్ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేసుకుంది. ఈ సక్సెస్ పార్టీకి ‘సలార్’ టీమ్ అంతా హాజరయ్యింది. ఇతర నటీనటులు ఎవ్వరూ హాజరు కాలేదు. కానీ అక్కినేని అఖిల్ మాత్రం ‘సలార్’కు సంబంధం లేకపోయినా.. ఈ సక్సెస్ పార్టీలో కనువిందు చేశాడు. దీంతో.. అసలు అఖిల్ ఈ పార్టీకి ఎందుకు వచ్చాడు అని ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి అనేక రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.
అఖిల్ ఎందుకు వచ్చాడు..?
‘సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేయడం కోసం బెంగుళూరులో ఒక సక్సెస్ పార్టీ జరిగింది. ఈ మూవీని నిర్మించిన హోంబేల్ ఫిల్మ్స్.. ఈ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేసింది. అందులో ప్రభాస్‌తో పాటు ఇతర మూవీ క్యాస్ట్ అంతా సందడి చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ ఫోటోలు, వీడియోల్లో అక్కినేని అఖిల్ కూడా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ‘సలార్’ సక్సెస్ పార్టీలో మూవీ టీమ్ తప్పా ఇతర నటీనటులు గానీ, సినీ సెలబ్రిటీలు గానీ లేరు. ‘సలార్’కు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి అఖిల్ మాత్రమే ఈ సక్సెస్ పార్టీకి అటెండ్ అయ్యాడు.
An evening to cherish and remember!
— Hombale Films (@hombalefilms) January 16, 2024
Here's the glimpse into the blockbuster success celebration of #Salaar 💥
Smiles, laughter & good vibes all around. https://t.co/ZdgJX7lmlo#SalaarCeaseFire #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms… pic.twitter.com/C6aBonK2oi
అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై లేని క్లారిటీ
అఖిల్.. ‘సలార్’ సక్సెస్ పార్టీలో ఎందుకు ఉన్నాడు అని ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఇంతలోనే తన చేతికి పెద్ద గాయం అయినట్టు నెటిజన్లు గమనించారు. అఖిల్ చేతికి పెద్దకట్టు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు ‘సలార్’ సక్సెస్ పార్టీకి అఖిల్ ఎందుకు వచ్చాడు? తన చేతికి గాయం ఎలా అయ్యింది? ఇలా ఎన్నో ప్రశ్నలు అక్కినేని ఫ్యాన్స్ మైండ్‌లో తిరుగుతున్నాయి. ఇక ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి అఖిల్ కూడా ముందుకు రావడానికి సిద్ధంగా లేడని అర్థమవుతోంది. చివరిగా ఈ హీరో ‘ఏజెంట్’ అనే చిత్రంలో కనిపించి మెప్పించాడు. ప్రస్తుతం తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఎలాంటి క్లారిటీ లేదు.
పార్ట్ 2లో పాత్ర
‘సలార్’ సక్సెస్ పార్టీకి అఖిల్ వచ్చాడంటే.. ఒకవేళ ఈ మూవీ పార్ట్ 2లో అఖిల్ ఉండబోతున్నాడా అని కూడా కొందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఏదైనా నెగిటివ్ రోల్‌లో లేదా ఏదైనా కీలక పాత్రలో కనిపించడానికి అఖిల్ సిద్ధమవుతున్నాడా అని సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. ‘సలార్ పార్ట్ 2’లో అసలు ఈ హీరో లేకపోతే.. మరి వారి సక్సెస్ పార్టీకి ఎందుకు హాజరవుతాడు అంటూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని ఫ్యాన్స్ మధ్య ఇవే చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ నిజంగానే అఖిల్ ‘సలార్ పార్ట్ 2’లో ఒక కీలక పాత్ర పోషిస్తే.. తనకు హిట్ ఖాయమని కూడా ఫ్యాన్స్ అనేసుకుంటున్నారు. మరి ఈ రూమర్స్ అన్నింటికి ఎప్పుడు చెక్ పడుతుందో.. ఈ విషయంపై క్లారిటీ ఎలా వస్తుందో చూడాలి.
Also Read: కనుమ రోజూ కింగ్ జోరు - మూడు రోజుల్లో 'నా సామి రంగ' కలెక్షన్స్ ఎంతంటే?