Akhanda 2 Trailer: బాలకృష్ణ సర్జికల్ స్ట్రైక్ చేస్తే... యాక్షన్ ప్యాక్డ్ 'అఖండ 2' ట్రైలర్ రిలీజ్... విశ్వరూపం చూశారా?
Akhanda 2 Trailer Review: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తాజా సినిమా 'అఖండ 2'. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది.

Watch Balakrishna's Akhanda 2 Trailer: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'అఖండ 2'. బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో ఆయనకు నాలుగో చిత్రమిది. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' తర్వాత డబుల్ హ్యాట్రిక్ సినిమాకు శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 5న పాన్ ఇండియా రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
బాలకృష్ణ సర్జికల్ స్ట్రైక్ చేస్తే?
''ఇప్పటి వరకు ప్రపంచ పటంలో ఉన్న మా దేశ రూపాన్ని మాత్రమే చూసి ఉంటావ్. ఎప్పుడూ మా దేశ విశ్వరూపాన్ని చూసి ఉండవ్. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే... ఈ ప్రపంచమే నిశ్శబ్దం'' - 'అఖండ 2' ట్రైలర్ ఎండింగ్‌లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఇది. నిజంగా ఆయన నట విశ్వరూపం చూపించారు దర్శకుడు బోయపాటి శ్రీను.
'అఖండ'లో అఘోరగా బాలకృష్ణను కొత్తగా చూపించారు బోయపాటి శ్రీను. ఇప్పుడు ఆ కథను సరిహద్దులు దాటించినట్టు అర్థం అవుతోంది. భక్తితో తోడు భారీ యాక్షన్ కూడా సినిమాలో ఉందని అర్థం అవుతోంది. త్రిశూలంతో శత్రువులను బాలకృష్ణ ఊచకోత కోయడం టీజర్‌లో చూశారు ప్రేక్షకులు. అంతకు మించి అన్నట్టు హిమాలయ పర్వత శ్రేణుల్లో యాక్షన్ చూపించడం మాత్రమే కాదు... 'మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్' అంటూ బాలకృష్ణ త్రిశూలంతో గన్ ఫైరింగ్ చేస్తే షాట్ అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తుందని చెప్పవచ్చు.
'ఈ ప్రపంచంలో మీరు ఏ దేశం వెళ్లినా అక్కడ కనిపించేది మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం. సనాతన హైందవ ధర్మం', 'దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు. దైవం జోలికి వస్తే మేం ఖండిస్తాం', 'హౌ డేర్ టు డిస్టర్బ్ మై గాడ్స్ ఆర్డర్' (నా దేవుడి ఆదేశాలను డిస్టర్బ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం) అని బాలకృష్ణ చెప్పే డైలాగులు విజిల్స్ వేయించేలా ఉన్నాయి. బాలకృష్ణతో పాటు విలన్ రోల్ చేసిన ఆది పినిశెట్టి గెటప్ కూడా బావుంది. కుంభమేళా నేపథ్యంలో తీసిన సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ సైతం ట్రైలర్‌లో టచ్ చేశారు.
Also Read: '12ఏ రైల్వే కాలనీ' రివ్యూ: అల్లరోడికి 'పొలిమేర' అనిల్ హిట్ ఇచ్చారా? హారర్ థ్రిల్లర్ బావుందా?
బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. సంయుక్త కథానాయికగా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.





















