Akhanda 2 Latest News: అఖండ 2 వచ్చింది... డిసెంబర్ 12 బరిలో ఎన్ని ఉన్నాయ్? ఎన్ని వెనక్కి వెళ్ళాయ్?
Decembar 12th Telugu Releases: డిసెంబర్ 5 నుంచి 12కు 'అఖండ 2' రావడం వల్ల... 12న విడుదలకు సిద్ధమైన సినిమాలు కొన్ని వాయిదా పడ్డాయి. కొన్ని మాత్రం వస్తున్నాయి. అవి ఏమిటి?

డిసెంబర్ 5 నుంచి 12కు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజా సినిమా 'అఖండ 2 తాండవం' వాయిదా పడింది. దాంతో 12న థియేటర్లలోకి రావడానికి సిద్ధమైన చిన్న సినిమాలు ఆ రోజు నుంచి వెనక్కి వెళుతున్నాయి. మళ్ళీ ఆయా సినిమాలకు మంచి డేట్ దొరకడం కష్టమేనా!? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అన్నగారు మాత్రం వెనక్కి వెళ్ళలేదు!
కార్తీ, కృతి శెట్టి జంటగా నటించిన 'అన్నగారు వస్తారు' డిసెంబర్ 12న విడుదల కానుంది. నిజానికి ఆ సినిమాను తొలుత డిసెంబర్ 5న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ కుదరలేదు. అప్పటికే పలు వాయిదాలు పడిన అన్నగారు సినిమా అఖండ 2 కోసం డిసెంబర్ 5నుంచి 12కు వెళ్ళింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజు విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు ఆ తేదీకి 'అఖండ 2' వస్తోంది. అయినా కార్తీ సినిమాకు మరో ఆప్షన్ లేదు. వెనక్కి వెళ్లడం లేదు.
జై జై బాలయ్య... జనవరి 1కి 'సైక్ సిద్ధార్థ్'!
నందు హీరోగా నటించిన సినిమా 'సైక్ సిద్ధార్థ్'. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. కొన్ని రోజులుగా నందు అండ్ టీమ్ విపరీతంగా ప్రమోట్ చేస్తోంది. ఓ ఈవెంట్‌లో నందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. సినిమాకు మంచి బజ్ వచ్చింది. విడుదలకు అంతా రెడీ అయ్యింది. కానీ, సినిమా మాత్రం థియేటర్లలోకి రావడం లేదు. 'అఖండ 2'కు దారి ఇస్తూ వెనక్కి వెళ్ళింది. ఓ సందర్భంలో డిసెంబర్ 12కు మాత్రం 'అఖండ 2' రాకూడదని నందు కోరుకున్నారు. అతడి కోరిక ఫలించలేదు. జనవరి 1, 2026న విడుదలకు రెడీ అయ్యిందీ సినిమా.
Rana and Nandu chants Jai Balayya 💥#PsychSiddhartha postponed to January 1st. pic.twitter.com/V36AMkl2gD
— The Cine Gossips (@TheCineGossips) December 10, 2025
రోషన్ 'మోగ్లీ'... జస్ట్ ఒక్క రోజు వెనక్కి!
సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా నటించిన సినిమా 'మోగ్లీ'. దీనికి 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు 'అఖండ 2' కోసం వాయిదా పడింది. బాలకృష్ణ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ముందు తన మూవీ వాయిదా పడిందని దర్శకుడికి క్లారిటీ వచ్చింది. దాంతో ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేశారు. అయితే కాసేపటికి మరొక ట్వీట్ చేశారు. డిసెంబర్ 13న తమ సినిమా విడుదల అవుతుందని పేర్కొన్నారు. ఈషా, డ్రైవ్ వంటి చిన్న సినిమాలు కొన్ని వెనక్కి వెళ్లినట్టు తెలిసింది.
First of all let me clarify my dear brother…
— Sandeep Raj (@SandeepRaaaj) December 10, 2025
I never wanted to cook any sympathy dramas over anyone.
Yesterday morning we recieved a call that we are pushed to February or April in 2026 which made me emotional and tweet about my fate.
But, as the day progressed all the…





















