Ajith Kumar: వెనిస్‌లో అజిత్‌కు 'జెంటల్మన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు... వైఫ్ శాలిని హార్ట్ టచింగ్ లెటర్
తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన అజిత్ కుమార్ కు 'జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు వచ్చింది. ఇటలీని వెనిస్‌లో అందుకోవడానికి ఆయన వెళ్లారు.

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar), ఆయన భార్య శాలిని ఇటీవల ఇటలీలోని వెనిస్‌లో ఉన్నారు. అక్కడ 2025 సంవత్సరానికి ఆయన 'జెంటిల్మెన్ డ్రైవర్' అవార్డును అందుకున్నారు. వెనిస్‌లో తన భర్త పక్కన నిలబడటం గౌరవంగా భావిస్తున్నానని శాలిని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలోని కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ... "వెనిస్‌లో నా భర్త పక్కన నిలబడటం గౌరవంగా ఉంది. ఎందుకంటే... రేసింగ్ డ్రైవర్ దివంగత ఫిలిప్ చారియోల్ గౌరవార్థం 'జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డును అందుకున్నారు" అని శాలిని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా GT రేసింగ్‌లో అగ్రగామిగా పరిగణించబడే SRO మోటార్‌స్పోర్ట్స్ గ్రూప్ ఈ అవార్డును అందజేసింది.
ఈ సంవత్సరం (2025లో) కార్ రేసర్ కావాలనే తన కలను సాకారం చేసుకున్నారు అజిత్ కుమార్. ఆయనకు ఇది తగిన గుర్తింపుగా భావిస్తున్నారు. నాలుగు డిమాండింగ్ అంతర్జాతీయ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని అనేక ప్రశంసలు గెలుచుకోవడం ద్వారా దేశానికి గర్వకారణంగా నిలిచారు అజిత్ కుమార్. ఆయన సొంతంగా జట్టును కలిగి ఉండటంతోనే ఆగకుండా తన జట్టులోని ఇతర సభ్యులతో పాటు రేసుల్లో కూడా పాల్గొన్నారు.
అజిత్ కుమార్ మాట్లాడుతూ... "ఈ అద్భుతమైన సంవత్సరం నుండి మనం లెక్కలేనన్ని కథలు రాయవచ్చు. కాని అది మరొక రోజు కోసం. ప్రతి ల్యాప్‌తో, ప్రతి సవాలుతో మనం మరింత బలపడటమే ముఖ్యం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే" అని పేర్కొన్నారు. ప్రతి రేసు వారాంతానికి ముందు లెక్కలేనన్ని గంటల ప్రాక్టీస్ చేయడంతో పాటు ఆయనకు ఎదురుదెబ్బలు తగిలాయని, అయినా సరే సంకల్పంతో ముందడుగు వేశారని అజిత్ బృందం వెల్లడించింది.
Also Read: పూజతో 'స్పిరిట్' షూటింగ్ షురూ... మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా - ప్రభాస్ ఎక్కడ?
View this post on Instagram
అజిత్ కుమార్ రేసింగ్ తొలి సంవత్సరం చాలా మొదటి సంవత్సరాలతో నిండిపోయిందని బృందం పేర్కొంది. అజిత్ కుమార్ రేసింగ్ బహుళ యూరోపియన్, మిడిల్ ఈస్టర్న్ ఎండ్యూరెన్స్ సిరీస్‌లలో పూర్తి సమయం రేసులో పాల్గొన్న మొదటి భారతీయ జట్టుగా అవతరించింది. అలాగే, ఈ సంవత్సరం జట్టు మొదటి అంతర్జాతీయ పోడియంను కూడా సాధించింది. అజిత్ కుమార్ రేసింగ్ మొదటి సీజన్ ముగిసినప్పుడు... పోటీ పడిన జట్టుగా కాకుండా అభివృద్ధి చెందిన జట్టుగా నిలిచిందని చెప్పవచ్చు. ''మమ్మల్ని వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరి సహాయం లేకుండా మేము ఇది చేయలేకపోయాము. ఈ సీజన్ కష్టపడి పని చేయడం, వినయంతో నిర్మించబడింది. మేము నేర్చుకున్న ప్రతి దాన్ని మరింత దృష్టితో, అంకిత భావంతో వచ్చే అధ్యాయానికి తీసుకువెళతాము" అని జట్టు యజమాని అజిత్ కుమార్ అన్నారు.
Also Read: 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? హీరోయిన్లు, ఆర్టిస్టులకు అందులో సగం కూడా ఇవ్వలేదు





















