Aishwarya Rajinikanth Song: జానీ మాస్టర్ హీరోగా, విడాకుల తర్వాత రజనీకాంత్ కుమార్తె ఫస్ట్ హ్యాపీ మూమెంట్!
Mahesh Babu congratulates Aishwarya Rajinikanth on her directorial comeback: రజనీకాంత్ కుమార్తెకు మహేష్ బాబు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఎందుకు? ఏమిటి? అంటే...
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంది. తామిద్దరం విడాకులు తీసుకుంటున్నామని, వేరు పడుతున్నామని ధనుష్, ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ వేరు పడటానికి కారణం ఏమై ఉంటుందని చాలా మంది చర్చల్లోకి దిగారు. విడాకుల ప్రకటన తర్వాత ఐశ్వర్యకు కరోనా వచ్చింది. కొన్ని రోజుల తర్వాత తగ్గిందనుకోండి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక్కటి కావచ్చనే వార్తలు. ఇవన్నీ పక్కన పెడితే... ఇప్పుడు ఐశ్వర్య పేరు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అదీ వ్యక్తిగత జీవితంతో ముడి పడిన అంశం గురించి కాదు, వృత్తిపరమైన అంశానికి సంబంధించినది.
ఐశ్వర్య దర్శకురాలు అనే సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా నటించిన '3' సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత మరో సినిమా, డాక్యుమెంటరీ తీశారు. కొంత విరామం తర్వాత మళ్ళీ ఐశ్వర్య మెగాఫోన్ పట్టారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ఒక మ్యూజిక్ వీడియోకి దర్శకత్వం వహించారు. 'సంచారి...' అంటూ సాగిన ఆ గీతానికి అంకిత్ తివారి సంగీతం అందించారు. దేవి శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఆలపించారు. తమిళంలో ఈ పాటను అనిరుధ్ రవిచందర్ పాడారు. మలయాళంలో రంజిత్ పాడారు. తెలుగు పాటను అల్లు అర్జున్ విడుదల చేయగా... తమిళ వెర్షన్ పాటను రజనీకాంత్... మలయాళ వెర్షన్ పాటను మోహన్ లాల్ విడుదల చేశారు.
Also Read: 'జేమ్స్' రివ్యూ: పవర్ స్టార్ ఆఖరి సినిమా ఎలా ఉంది?
'సంచారి...' పాట తనకు నచ్చిందని ట్వీట్ చేసిన మహేష్ బాబు, మళ్ళీ మెగాఫోన్ పట్టిన ఐశ్వర్యకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించడం, ఆ పాటను తాను విడుదల చేయడం సంతోషంగా ఉందని రజనీకాంత్ పేర్కొన్నారు.
Also Read: అబ్బాయి బ్రాహ్మిణ్, అమ్మాయి క్రిస్టియన్ - అంటే సుందరానికీ!
Truly means so much that you tweeted mahesh !thank you for the lovely words n support n encouragement…#thankful https://t.co/CL8S8VGwlS
— Aishwaryaa.R.Dhanush (@ash_r_dhanush) March 17, 2022
My best wishes to Aishwarya garu for #Sanchari song. My regards to Jani Master, Sagar and the rest of the cast and crew.https://t.co/ojeJPeealW@ash_r_dhanush@officiallyAnkit@AlwaysJani@verma_shrasti@sagar_singer@DOP_VishnuR@EditorElayaraja
— Allu Arjun (@alluarjun) March 17, 2022
Happy to release #Payani , music single directed by my daughter Aishwarya , who is back to direction after a long gap of 9 years. I Wish you the very best always @ash_r_dhanush .. god bless .. love you .. https://t.co/x7jUP4upId
— Rajinikanth (@rajinikanth) March 17, 2022
Happy to share Aishwarya Rajinikanth's come back to musical direction after 9 years. Her latest single will be released in 4 languages and is titled 'Yatrakkaran' in Malayalam. It is sung by Ranjith. Wish you the best, @ash_r_dhanushhttps://t.co/fea8J9fUxJ
— Mohanlal (@Mohanlal) March 17, 2022