అన్వేషించండి

Akhil Akkineni: అఖిల్ షాకింగ్ లుక్ - ఇదంతా అయ్యగారి కొత్త సినిమా కోసమేనా?

Akhil Akkineni: 'ఏజెంట్'తో డిజాస్టర్ చవిచూసిన అక్కినేని వారసుడు అఖిల్.. చాలా రోజుల తర్వాత బయట కనిపించారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో సరికొత్త లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు.

Akhil Akkineni: యూత్ కింగ్ అఖిల్ అక్కినేని చివరగా 'ఏజెంట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఘోర పరాజయం పాలవ్వడంతో అక్కినేని వారసుడు బాగా నిరాశ చెందారు. మూవీ వచ్చి ఏడాది దాటినా, ఇంతవరకూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చెయ్యలేదు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండటం లేదు. బయట కూడా పెద్దగా కనిపించడం లేదు.. పూర్తిగా ఆఫ్ లైన్ లోకి వెళ్ళిపోయారు. అయితే చాలా రోజుల తర్వాత అఖిల్ మీడియా కంటపడ్డారు. దీంతో ఆయన కొత్త లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

అఖిల్ తాజాగా బెంగుళూరు నుంచి తిరిగొస్తూ, హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కెమెరా కళ్లకు చిక్కారు. ఇందులో అతను బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో హలీవుడ్ హీరోను తలపించేలా ఉబర్ కూల్ గా ఉన్నారు. ఇంతకముందు ఎన్నడూ లేని విధంగా గుబురు గడ్డం, కోర మీసాలు, పొడవాటి జుట్టుతో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అయ్యగారి లేటెస్ట్ లుక్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం తమ హీరో నయా లుక్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మేకోవర్ అంతా కచ్ఛితంగా తన కొత్త సినిమా కోసమే అయ్యుండొచ్చని అభిప్రాయ పడుతున్నారు. 

View this post on Instagram
 
A post shared by Sai (@always__about__akkineni)

అఖిల్ తన తదుపరి చిత్రాన్ని అనిల్ కుమార్ అనే డెబ్యూ డైరెక్టర్‌తో చేయనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అతను గతంలో 'సాహో', 'రాధే శ్యామ్' వంటి సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశారు. ఇప్పుడు యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో 'Akhil 6' మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు సమాచారం. ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కే పీరియాడిక్ యాక్షన్ మూవీ అని, దీనికి 'ధీర' అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. ఏప్రిల్ లో బర్త్ డే స్పెషల్ గా ఈ ప్రాజెక్ట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారు అనుకున్నారు కానీ, అలా జరగలేదు. అయితే ఇప్పుడు అఖిల్ ఈ మూవీ కోసమే సరికొత్తగా మేకోవర్ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. 

సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే హీరోలలో అఖిల్ ముందు వరుసలో ఉంటారు. డెబ్యూ మూవీ నుంచీ కష్టపడుతున్నారు కానీ, దానికి తగ్గ రిజల్ట్ రుచి చూడలేకపోతున్నారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంతో రూ. 50 కోట్ల గ్రాస్ రాబట్టి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నారు. కానీ వెంటనే 'ఏజెంట్' రూపంలో ఓ భారీ ఫ్లాప్ వచ్చి పడింది. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి, రింగు రింగుల లాంగ్ హెయిర్ పెంచి మేకోవర్ కోసం బాగా కష్టపడ్డాడు. కానీ ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. మళ్ళీ ఇప్పుడు న్యూ లుక్ తో అక్కినేని వారసుడు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఇదంతా తన కొత్త ప్రాజెక్ట్ కోసమే అయితే, వీలైనంత త్వరగా అధికారికంగా ప్రకటించి సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అఖిల్ వారికి ఎలాంటి అప్డేట్ ను అందిస్తారో వేచి చూడాలి.

Also Read: నాన్న ఒక ఎమోషన్.. తండ్రి సెంటిమెంట్‌తో వచ్చిన అలనాటి చిత్రాలివే - చూస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
Srikakulam Latest News:కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
Abhishek Singhvi Controversy: రాజ్య‌స‌భ‌లో నోట్ల క‌ట్ట‌ల క‌ల‌క‌లం- విచార‌ణ‌కు చైర్మ‌న్ ఆదేశం- సంబంధం లేదన్న కాంగ్రెస్‌ ఎంపీ
రాజ్య‌స‌భ‌లో నోట్ల క‌ట్ట‌ల క‌ల‌క‌లం- విచార‌ణ‌కు చైర్మ‌న్ ఆదేశం- సంబంధం లేదన్న కాంగ్రెస్‌ ఎంపీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
Srikakulam Latest News:కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
Abhishek Singhvi Controversy: రాజ్య‌స‌భ‌లో నోట్ల క‌ట్ట‌ల క‌ల‌క‌లం- విచార‌ణ‌కు చైర్మ‌న్ ఆదేశం- సంబంధం లేదన్న కాంగ్రెస్‌ ఎంపీ
రాజ్య‌స‌భ‌లో నోట్ల క‌ట్ట‌ల క‌ల‌క‌లం- విచార‌ణ‌కు చైర్మ‌న్ ఆదేశం- సంబంధం లేదన్న కాంగ్రెస్‌ ఎంపీ
Devendra Fadnavis First Interview: హిందుత్వ అజెండాతోనే బీజేపీ గెలిచిందా? మొదటి ఇంటర్వ్యూలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చెప్పారు?
హిందుత్వ అజెండాతోనే బీజేపీ గెలిచిందా? మొదటి ఇంటర్వ్యూలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చెప్పారు?
పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు -  సుధామూర్తి ఇంట్రస్టింగ్ సీన్
పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు - సుధామూర్తి ఇంట్రస్టింగ్ సీన్
Rashmika Mandanna : దేవరకొండ ఫ్యామిలీతో మూవీకి వెళ్ళిన రష్మిక... కోడలిగా ఫిక్స్ అయిపోయారా?
దేవరకొండ ఫ్యామిలీతో మూవీకి వెళ్ళిన రష్మిక... కోడలిగా ఫిక్స్ అయిపోయారా?
Allu Arjun: అల్లు అర్జున్‌కు మళ్లీ నేషనల్ అవార్డు... 'పుష్ప 2'కు వచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
అల్లు అర్జున్‌కు మళ్లీ నేషనల్ అవార్డు... 'పుష్ప 2'కు వచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
Embed widget