(Source: ECI/ABP News/ABP Majha)
Adipurush - Sri Rama Navami : సీతారాములు వచ్చేశారోచ్ - ప్రభాస్ అభిమానులకు శ్రీరామ నవమి కానుక
Prabhas Adipurush New Poster : శ్రీరాముని పాత్రలో ప్రభాస్ నటించిన చిత్రం 'ఆదిపురుష్'. శ్రీరామ నవమి సందర్భంగా రెబల్ స్టార్ అభిమానులకు ఆ చిత్ర బృందం ఓ కానుక ఇచ్చింది.
రామాయణం (Ramayana) ఆధారంగా రూపొందిన సినిమా 'ఆదిపురుష్' (Adipurush Movie). శ్రీరాముడిపై తీసిన సినిమా అప్డేట్ ఇవ్వడానికి శ్రీరామ నవమి కంటే మంచి సందర్భం ఏం ఉంటుంది? ఈ రోజు రామ నవమి సందర్భంగా 'ఆదిపురుష్' చిత్ర బృందం కొత్త పోస్టర్ విడుదల చేసింది.
సీతా సమేత శ్రీరాముడితో లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్న పోస్టర్ విడుదల చేశారు. ''మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్'' అని ఈ పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా ప్రభాస్ పేర్కొన్నారు.
'ఆదిపురుష్' సినిమాలో ప్రభు శ్రీరామ్ పాత్రలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించారు. ఆయనకు జోడీగా సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon) కనిపించనున్నారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ చేశారు. అజయ్ దేవగణ్ హీరోగా హిందీ హిట్ 'తానాజీ' తీసిన ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు.
కొత్తగా... సరికొత్తగా ప్రచారం షురూ!
శ్రీరామ నవమి సందర్భంగా నేటి నుంచి మళ్ళీ 'ఆదిపురుష్' ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. దీని కంటే ముందు దర్శకుడు ఓం రౌత్, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ వైష్ణో దేవి (Vaishno Devi Temple) ఆలయానికి వెళ్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
Also Read : బోయపాటి సినిమాలో భారీ బుల్ ఫైట్ - ఇరగదీసిన రామ్
View this post on Instagram
జూన్ 16వ తేదీ నుంచి థియేటర్లలో ఆది పురుషుడిగా ప్రభాస్ సందడి మొదలు కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శ్రీరాముడి అంటే హిందువులలో ఉన్న భక్తి, ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని భారీ సంఖ్యలో షోస్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదీ సంగతి! టీ సిరీస్ భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ (Rajesh Nair)తో కలిసి యూవీ క్రియేషన్స్ సంస్థ సినిమాను విడుదల చేస్తోంది.
రికార్డు స్థాయిలో రిలీజుకు సన్నాహాలు!?
వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో షోలు వేసేలా 'ఆదిపురుష్' టీమ్ ప్లాన్ చేసిందట ఇండియా మొత్తం మీద సుమారు 9,500 అని చెప్పాలి. అందులో ఆరున్నర వేలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు! మిగతావి మల్టీప్లెక్స్ స్క్రీన్‌లు. వాటిలో వీలైనన్ని స్క్రీన్లలో 'ఆదిపురుష్' సినిమా ప్రదర్శించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి.
సాధారణంగా ఒక్కో థియేటర్‌లో రోజుకు నాలుగు ఆటలు ప్రదరిస్తారు. ఇప్పుడు మార్నింగ్ షోలకు అనుమతులు వస్తుండటంతో ఐదు షోలు వేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో... రోజుకు 40,000 షోస్ వేయొచ్చు. వెయ్యి , పదిహేను వందల థియేటర్లు వేరే సినిమాలకు వదిలేసినా... ఎనిమిది వేల థియేటర్లలో 'ఆదిపురుష్' విడుదల చేస్తే? కొన్ని థియేటర్లలో నాలుగు షోలు, కొన్ని థియేటర్లలో ఐదు షోలు వేస్తే? రోజుకు సుమారు 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఇన్‌సైడ్ టాక్.
Also Read : కేజీయఫ్‌ని కొట్టేలా దసరా - నాని కెరీర్ బెస్ట్ - శ్రీకాంత్‌కి 100 మార్కులు - దసరా ట్విట్టర్ రివ్యూ!
హిందూ సంస్కృతి, శ్రీరాముని గొప్పతనం గురించి వివరించే సినిమా కావడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అండ కూడా 'ఆదిపురుష్'కు ఉండవచ్చని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా. అందులో నిజం ఎంత? అనేది పక్కన పెడితే... హిందూ దేవుళ్ళు, పురాణాలపై రూపొందుతున్న సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. అందుకు నిఖిల్ 'కార్తికేయ 2'ను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.