పడిపోయిన 'ఆదిపురుష్' కలెక్షన్స్ - ఒక్క రోజులో మరీ అంత తక్కువా?
'ఆదిపురుష్' కలెక్షన్స బాగా పడిపోయాయి. ముందుతో పోలిస్తే ఇవి 75 శాతం పడిపోయినట్టు తెలుస్తోంది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా ఈ సినిమా రూ.375 కోట్ల కలెక్షన్లు రాబట్టడం చెప్పుకోదగిన విషయం.
Adipurush- Box Office Collections Day 4 : ప్రభాస్, కృతి సనన్‌ల పౌరాణిక ఇతిహాసం చిత్రం 'ఆదిపురుష్(Adipurush)' ప్రారంభ వారాంతం తర్వాత కలెక్షన్లు కుప్పకూలిపోయాయి. తీవ్ర వివాదాల మధ్య కలెక్షన్లు బోర్డు అంతటా పడిపోయాయి.
'రామాయణం(Ramayanam)' ఆధారంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆదిపురుష్' బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. భారీ రికార్డ్-బ్రేకింగ్ వారాంతం తర్వాత, 'ఆదిపురుష్' మొదటి సోమవారం కలెక్షన్లు బాగా పడిపోయాయి, ఈ కలెక్షన్లు 75 శాతం దిగువకు చేరుకున్నాయి. ఈ సినిమా హిందీ కలెక్షన్లు రూ. 8-9 కోట్ల రేంజ్‌లో ఉన్నాయని బాక్సాఫీస్ ఇండియా నివేదించింది. ఇక 'ఆదిపురుష్' విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.375 కోట్ల గ్రాస్ ను రాబట్టిందంటూ టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాయి. అంటే ఈ చిత్రం సోమవారం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 35 కోట్లు మాత్రమే రాబట్టింది. శుక్రవారం రూ.140 కోట్లు, శని, ఆదివారాల్లో ఒక్కో రోజు రూ.100 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు.
'ఆదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్ రూ. 375 కోట్లకు చేరుకుందని టీ సిరీస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రేక్షకులు సినిమాపై కురిపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని స్పష్టం చేసింది. తాజా లెక్కల ప్రకారం, ప్రారంభ అంచనాల ప్రకారం, ఆదిపురుష్ దేశీయ బాక్సాఫీస్ కలెక్షన్లు సోమవారం బాగా పడిపోయాయి. ఓం రౌత్-దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ ఫిల్మ్.. మొదటి సోమవారం దాదాపు రూ. 20 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఈ చిత్రం విడుదల రోజున రూ.86.75 కోట్లు, శనివారం రూ.65.25 కోట్లు, ఆదివారం రూ.69.10 కోట్లు, సోమవారం దాదాపు రూ.20 కోట్లు వసూలు చేసింది.
View this post on Instagram
బాక్సాఫీస్ వద్ద 'ఆదిపురుష్' పతనానికి చిత్రంపై నెగెటివ్ రివ్యూలు, డైలాగ్‌లు, నాసిరకం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. వీటిపై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలతో పాటు, ట్రోలింగ్ కూడా బాగానే జరుగుతోంది. దీంతో చాలా మంది ముందుగానే బుక్ చేసుకున్న టిక్కెట్లను సైతం రద్దు చేసుకున్నారు. వారు రద్దు చేసిన ముందస్తు బుకింగ్‌ల స్క్రీన్‌షాట్‌లను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. క్యాన్సిల్ చేసిన అడ్వాన్స్ బుకింగ్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన ఓ యూజర్.. “ఆదిపురుష్‌ని చూడటానికి చాలా సంతోషించాను. కానీ డైలాగ్‌లు మొత్తం మూడ్‌ను పాడు చేశాయి. కాబట్టి మొదటి రోజు, మొదటి షో టిక్కెట్‌ను రద్దు చేశాను" అని పేర్కొన్నాడు.
We are grateful for your love and devotion ❤️ Jai Shri Ram! 🙏
— T-Series (@TSeries) June 20, 2023
Book your tickets on: https://t.co/2jcFFjFeI4#Adipurush now in cinemas near you! ✨ #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage… pic.twitter.com/E1g8zTbUOe
ఇతర హిందీ సినిమాలతో పాటు వివాదాస్పద డైలాగ్‌ల కారణంగా నేపాల్‌లోని ఖాట్మండు, పోఖారా ప్రాంతాల్లోనూ 'ఆదిపురుష్' పై నిషేధం కొనసాగుతోంది.
Read Also : Sr NTR Birth Anniversary : చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆ ఘనత ఎన్టీఆర్‌దే - రాజేంద్ర ప్రసాద్