అన్వేషించండి

Actress Suhasini: నేను హీరోయిన్ కావడం శ్రీదేవికి ఇష్టం లేదు, రజనీకాంత్ సినిమాలు తిరస్కరించా: సుహాసిని

హీరోయిన్ కావాలని ఏనాడు కోరుకోలేదని చెప్పారు నటి సుహాసిని. సినిమాటోగ్రఫీ మీద ఉన్న ఇష్టంతో కోర్సు కూడా పూర్తి చేసినట్లు చెప్పారు. సినిమాటోగ్రాఫర్ గా ఛాన్సులు రాక, యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టానన్నారు.

Actress Suhasini About Sridevi: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటీమణి సుహాసిని మణిరత్నం. విశ్వ నటుడు కమల్‌ హాసన్‌ అన్న కూతురిగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టటారు. స్టార్‌ కిడ్‌ గానే సుహాసిని సినిమాలు చేశారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించారు. 1980,90లలో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా సినిమాలు చేస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ చెక్కు చెదరని అందం, అభినయంతో ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తున్నారు.

నాకు హీరోయిన్ కావాలని లేదు- సుహాసిని

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాసిని తన ఇష్టాఇష్టాల గురించి కీలక విషయాలను వెల్లడించారు. తనకు హీరోయిన్ కావడం కంటే, సినిమాటోగ్రాఫర్ కావాలనే ఆశ ఉండేదని చెప్పారు. కానీ, టెక్నికల్ వైపు అవకాశాలు రాక యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టినట్టు చెప్పారు. “నేను నటించి తొలి సినిమాకే నాకు బెస్ట్ ఫీమేల్ లీడ్ విభాగంలో స్టేట్ అవార్డు వచ్చింది. అప్పటికే నేను సినిమాటోగ్రఫీ మీద ఇష్టంతో కోర్సులో చేరాను. తొలి సినిమా రిలీజ్ అయ్యాక, వెళ్లి సినిమాటోగ్రఫీ కోర్సు కంప్లీట్ చేశాను. కోర్సు పూర్తి అయినప్పటికీ, ఎవరూ సినిమాటోగ్రఫీ చేయమని పిలవలేదు. హీరోయిన్ గా చేయాలని చాలా మంది అడిగారు. నాకు సినిమాటోగ్రఫీ మీద ఉన్న ఇష్టంతో ఒకటి, రెండు రజనీకాంత్ సినిమాలను కూడా వద్దు అన్నాను. మంచి సినిమాటోగ్రాఫర్ కావాలనే కోరికే ఉండేది. చివరకు నన్ను సినిమాటోగ్రాఫర్ గా పిలవరని అర్థం అయ్యింది. హీరోయిన్ గా అవకాశాలు రావడంతో యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టాను” అని చెప్పారు.

నేను హీరోయిన్ కావడం శ్రీదేవికి ఇష్టం లేదు- సుహాసిని

దివంగత నటి శ్రీదేవి తల్లి తనను హీరోయిన్ అవుతావని చెప్పిందన్నారు సుహాసిని. నేను హీరోయిన్ కావడం శ్రీదేవికి ఇష్టం లేదని వెల్లడించారు. “నేను నటించిన తొలి సినిమా చూడకుండానే దివంగత నటి శ్రీదేవి మదర్ నన్ను హీరోయిన్ అవుతావు అన్నారు. అనడం కాదు, నువ్వు హీరోయినే అన్నారు. అప్పుడు శ్రీదేవి తనతో వద్దని చెప్పింది. వద్దమ్మా.. వద్దు. మేమంతా హీరోయిన్లుగా ఉన్నాం. సినిమాటోగ్రాఫర్ గా ఒక్క ఆడపిల్ల వచ్చింది. ఆమెను అలాగే ఉండనివ్వు. హీరోయిన్ గా ఎందుకు? అని శ్రీదేవి అన్నది. అయినా, ఆమె మదర్ మాత్రం నువ్వు హీరోయినే అన్నారు. ఆమె చెప్పిందే నిజం అయ్యింది” అని గుర్తు చేసుకున్నారు.

ఇక ఇప్పటి తరం హీరోయిన్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని సుహాసిని తెలిపారు. “మేమంత తెలివైన వాళ్లం కాదు. నటన మాత్రమే తెలుసు. మిగతా విషయాలు తెలియవు. ఇప్పటి హీరోయిన్లు చాలా తెలివైన వాళ్లు. స్కిన్‌ కేర్‌, బాడీ లాంగ్వేజ్‌, డ్రస్సింగ్‌ గురించి వాళ్లకు బాగా తెలుసు.  ప్రేక్షకులు ఏది మెచ్చుకుంటున్నారో తెలుసు. మాకు ఇవేమి తెలిసేవి కాదు” అని చెప్పుకొచ్చారు. 1988లో ప్రముఖ డైరెక్టర్ మణిరత్నంను సుహాసిని పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ గా ఆమె కెరీర్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే వీరి పెళ్లి అయ్యింది.  

Read Also: కమల్ ‘గుణ’ పాటకు భలే క్రేజ్ - ‘తమిళనాట ‘మంజుమ్మెల్ బాయ్స్’ సంచలనం, ఇంతకీ ఆ సాంగ్‌కు.. సినిమాకు లింకేమిటీ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget