By: ABP Desam | Updated at : 30 Jul 2023 02:31 PM (IST)
Samantha: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఆమె ప్రస్తుతం ఇండోనేషియా బాలిలో విహారయాత్రల్లో గడుపుతూ విశ్రాంతి తీసుకుంటోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. సమంత అప్డేట్ లు చేస్తూ ఆమె ఫ్యాన్స్ సంబరపడుతుంటే కొంతమంది మాత్రం ఆమెను ట్రోల్ చేస్తూ వస్తున్నారు. సమంత ఎలాంటి పోస్ట్ పెట్టినా దాంట్లో ఏదొక పెడర్థం తీస్తూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.
అది ట్రీట్మెంట్ లో భాగమా లేక వెకేషనా అంటూ ట్రోలింగ్..
సమంత గత కొంత కాలంగా అటు సినిమా ఇటు వ్యక్తిగత జీవిత సమస్యలతో సతమవుతూ ఉంది. అందుకే కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ తీసుకొని మానసిక ప్రశాంత కోసం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది. అందుకే ఆమె తన చేతిలో ఉన్న ‘ఖుషీ’, ‘సిటాడెల్’ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. తర్వాత వెంటనే కొన్నాళ్లు సినిమాలకు బై చెప్పేసింది. ముందుగా ఆధ్యాత్మిక యాత్రల్లో పాల్గొన్న సమంత ఇప్పుడు ఇండోనేషియా బాలిలోని విహార యాత్రల్లో మునిగి తేలుతుంది. అక్కడ ఆమె సరదాగా గడిపిన క్షణాలను ఫోటోలు, వీడియోల రూపంతో అభిమానులతో పంచుకుంటుంది. అప్పుడప్పుడు కొన్ని స్టంట్ లు కూడా చేసి వాటిని కూడా షేర్ చేస్తోంది. అయితే రీసెంట్ గా సమంత నాలుగు డిగ్రీల చల్లటి నీటిలో ఆరు నిమిషాల పాటు ఐస్ బాత్ చేసింది. ఆ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోను చూసి సామ్ ఫ్యాన్స్ ఆమెను పొగుడుతుంటే మరికొంత మంది నెటిజన్స్ మాత్ర ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇది మయోసైటిస్ కు వైద్యం కోసమా లేదా వెకేషనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె అలా ఐస్ బాత్ చేయడం ట్రీట్మెంట్ లో భాగమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో సామ్ అభిమానులు ఫైర్ అవుతూ ‘ప్రతీ దాన్ని అలా నెగిటవ్ గా చూడకండి. ఆమె అక్కడ సంతోషంగా గడుపుతుంటే ఇలా ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
త్వరలో అమెరికాకు సమంత?
సమంత గత కొన్ని నెలలుగా మయోసైటిస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని నెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. సుధీర్ఘకాలం పాటు దానికి ట్రీట్మెంట్ తీసుకుంది. అయినా ఇప్పటికీ తనను ఆ వ్యాధి వేధిస్తోందట. అందుకే మయోసైటిస్ కు మెరుగైన చికిత్స కోసం సమంత త్వరలో అమెరికా వెళ్లనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే సమంత మళ్లీ ఎప్పుడు సినిమాల్లోకి వస్తుంది అనే విషయం చెప్పలేదు. సమంత సినిమాల్లో లేకపోయినా ఇలా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు విశేషాలను తెలియజేస్తూ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటుంది సమంత.
విడుదలకు రెడీగా ‘ఖుషీ’..
‘ఖుషీ’ సినిమా అటు సమంతతో పాటు విజయ్ దేవరకొండకు కూడా చాలా కీలకం. ఎందుకంటే ‘శాకుంతలం’ తో సామ్ ‘లైగర్’ తో విజయ్ కు ఘోర పరాజయాలు చవిచూశారు. ఈ సినిమాల తర్వాత దర్శకుడు శివ నిర్వాణతో ఈ ‘ఖుషీ’ సినిమా చేశారు. ప్రస్తుతం ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. పాటలు కూడా బాగుండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. సెప్టెంబర్ 1 న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీతో సమంత, విజయ్ లకు ఎలాంటి అందుతుందో చూడాలి.
Also Read: వెంకీ అట్లూరి - దుల్కర్ సల్మాన్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్ - ఆకట్టుకుంటున్న పోస్టర్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
త్రివిక్రమ్ చేతుల మీదుగా పులగం చిన్నారాయణ రచించిన 'జై విఠలాచార్య' పుస్తకావిష్కరణ
Ghost Trailer : 'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ - గ్యాంగ్‌స్టర్‌గా శివన్న విధ్వంసం
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'
/body>