అన్వేషించండి

Keerthy Suresh Wedding: బాయ్‌ఫ్రెండ్‌తో కీర్తి సురేష్ పెళ్లి... ముహూర్తం ఖరారు, గోవాలో ఏడు అడుగులు వేసేది ఎప్పుడంటే?

Keerthy Suresh Fiance Name: జాతీయ పురస్కార గ్రహీత, మహానటి కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యారు. త్వరలో ఓ ఇంటి కోడలు కానున్నారు. ఆమె చేసుకోబోయేది ఎవర్ని? పెళ్లి ఎప్పుడు అంటే?

Keerthy Suresh Ka Boyfriend Kaun Hai?: కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఆవిడ ఎవరితో ఏడు అడుగులు వేయబోతుంది? ఆమెకు కాబోయే భర్త ఎవరు? అని ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలు సైతం ఆరా తీస్తున్నారు. అందుకు కారణం ఏమిటంటే? త్వరలో మహానటి ఓ ఇంటి కోడలు కానున్నారు.

కీర్తిని పెళ్లి చేసుకుంటున్నది ఎవరో తెలుసా?
Keerthy Suresh Wedding Date: కీర్తి సురేష్ పెళ్లి ముహూర్తం ఖరారు అయ్యింది. ఓ నెల తిరక్కుండా ఆమె మెడలో మూడు ముళ్లు పడనున్నాయి. డిసెంబర్ 11న గోవాలో వివాహం జరగనుంది.

ఆంటోనీ తట్టిల్ (Antony Thattil)... కీర్తి సురేష్‌కు కాబోయే భర్త. ఆయన దుబాయ్ బేస్డ్ బిజినెస్ మ్యాన్. కొన్నాళ్లుగా ఆంటోనీ, కీర్తి ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ తమ తమ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు. గోవాలో బంధు మిత్రులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకోవాలని కీర్తి, ఆంటోనీ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం శుభలేఖలు ఇవ్వడం, షాపింగ్ చేయడం వంటి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారట.
Keerthy Suresh Wedding: బాయ్‌ఫ్రెండ్‌తో కీర్తి సురేష్ పెళ్లి... ముహూర్తం ఖరారు, గోవాలో ఏడు అడుగులు వేసేది ఎప్పుడంటే?

కీర్తి పెళ్లి గురించి గత ఏడాది హంగామా!
కీర్తి సురేష్ పెళ్లి గురించి వార్తలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. తన స్నేహితుడు ఒకరికి గత ఏడాది పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే... అతనితో పెళ్లి అని వరుస కథనాలు వచ్చాయి. అప్పట్లో ఆ వార్తలను కీర్తి సురేష్ ఖండించారు. సమయం వచ్చినప్పుడు తన జీవితంలోని మిస్టరీ మ్యాన్ ఎవరో చెబుతానని ఆమె తెలిపారు. కీర్తి సురేష్ బర్త్ డే విషెష్ చెప్పినది ఫర్హాన్ అనే వ్యక్తికి. ఇప్పుడు ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతున్నది ఆంటోనీతో. అదీ సంగతి!

Also ReadPushpa 2 Trailer Launch Highlights - పాట్నా ప్రజల ప్రేమకు ఐకాన్ స్టార్ ఫిదా... బన్నీ స్పీచ్ to 2 లక్షల మంది జనాలు, పోలీస్ సెక్యూరిటీ - 'పుష్ప 2' ట్రైలర్ లాంఛ్ హైలైట్స్

బాలనటిగా ఇండస్ట్రీకి వచ్చిన కీర్తి సురేష్!
సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ బాలనటిగా అడుగు పెట్టారు. సినిమా కుటుంబంలో ఆమె జన్మించారు. కీర్తి సురేష్ తండ్రి జి సురేష్ కుమార్ మలయాళంలో నిర్మాత. ఆమె తల్లి మేనక ఒకప్పటి హీరోయిన్. బాలనటిగా మూడు సినిమాలు చేసిన కీర్తి సురేష్... 2013లో 'గీతాంజలి'తో మెయిన్ లీడ్ కింద సిల్వర్ స్క్రీన్ మీద మళ్లీ అడుగు పెట్టారు. 

Keerthy Suresh Telugu Movies: 'నేను శైలజ'తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రామ్ పోతినేని సినిమా ఆమెకు విజయం అందివ్వడంతో పాటు పేరు తీసుకు వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', మహేష్ బాబు 'సర్కారు వారి పాట'తో పాటు యంగ్ హీరోలతోనూ సినిమాలు చేశారు. సావిత్రి బయోపిక్ 'మహానటి' ఆమెకు జాతీయ అవార్డు తెచ్చింది. ప్రస్తుతం 'రివాల్వర్ రీటా', హిందీలో వరుణ్ ధావన్ 'బేబీ జాన్' సినిమాల్లో కీర్తి సురేష్ నటిస్తున్నారు. విజయ్, సమంతల 'తెరి' (తెలుగులో 'పోలీస్'గా డబ్బింగ్ అయ్యింది) రీమేక్ ఆ సినిమా. 'బేబీ జాన్'తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతోంది.

Also Read: నాగ చైతన్య ఒకలా, శోభిత మరోలా... శుభ లేఖలు పంచుతున్న అక్కినేని, ధూళిపాళ ఫ్యామిలీలు, ఆ రెండూ చూశారా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget