Anjali New Movie: లేడీ ఓరియెంటెడ్ మూవీలో అంజలి - కొత్త సినిమాలో డిఫరెంట్ రోల్
Anjali: ప్రముఖ హీరోయిన్ అంజలి లేడీ ఓరియెంటెడ్ మూవీతో రాబోతున్నారు. సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు చిత్రాల దర్శకుడు రాజశేఖర్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

Actress Anjali New Lady Oriented Movie Started: హీరోయిన్ అంజలి కొత్త మూవీ ప్రారంభమైంది. ఆమె ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుంది. 9 క్రియేషన్స్ నిర్మాణంలో హైదరాబాద్‌లోని మూవీ ఆఫీస్‌లో పూజా కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా జరిగాయి.
ఈ మూవీకి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించనుండగా... రాజచంద్రశేఖర్ రెడ్డి కందుల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నికల్ టీం, ఇతర అప్డేట్స్ ఇవ్వనున్నట్లు టీం వెల్లడించింది. డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గతంలో సుడిగాలి సుధీర్‌తో 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'గాలోడు' మూవీస్ తెరకెక్కించారు. ఈ మూవీస్ కమర్షియల్‌గా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు అంజలితో వుమెన్ ఓరియెంటెడ్ జానర్‌లో మూవీ తీస్తుండడంతో ఆయన కెరీర్‌లోనే స్పెషల్ కానుంది. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సి.రాంప్రసాద్ కలర్ ఫుల్ విజువల్స్ అందించనున్నారు.

Also Read: శివుని జటల నుంచి ప్రళయం వస్తే అధర్మం అంతమే - ఆసక్తికరంగా 'జటాధర' టీజర్
డిఫరెంట్ రోల్
ఈసారి డిఫరెంట్ రోల్‌లో అంజలి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోటో మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీతో తెలుగింటి అమ్మాయిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత బలుపు, మసాలా, గీతాంజలి, శంకరాభరణం, నియంత, సరైనోడు, చిత్రాంగద, వకీల్ సాబ్, గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. రీసెంట్‌గా గేమ్ ఛేంజర్‌లో తల్లి, భార్య పాత్రలో కీలక పాత్ర పోషించారు. తమిళంలో మదగజరాజలోనూ నటించారు. ఈసారి కాస్ జానర్ మార్చి కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ మూవీలో అంజలి నటించనున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.





















