అన్వేషించండి

Actress Aksha: సినిమాటోగ్రాఫ‌ర్‌ను పెళ్లి చేసుకున్న 'కందిరీగ' హీరోయిన్, ఫొటోలు వైర‌ల్

Actress Aksha: తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన‌ ఒక‌ప్ప‌టి టాలీవుడ్ హీరోయిన్, ముంబై బ్యూటీ అక్ష వివాహం బంధంలోకి అడుగుపెట్టింది. సినిమాటోగ్రాఫ‌ర్ ని ఆమె పెళ్లి చేసుకుంది.

Actress Aksha Ties The Knot With Kaushal Shah: కుర్ర‌కారును త‌మ అందాల‌తో అల‌రించిన హీరోయిన్లు ఒక్కొక్క‌రుగా వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. మ‌న‌సుకు న‌చ్చిన వాడితో మూడుముళ్ల బంధంతో ఒక‌టైపోతున్నారు. ఎన్నో తెలుగు సినిమాల్లో న‌టించిన ముంబై బ్యూటీ అక్ష సినిమాటోగ్రాఫ‌ర్ ని పెళ్లి చేసుకుంది. గ‌త కొద్దికాలంగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్ద‌రు వివాహ బంధంతో ఒక‌ట‌య్యారు. వాళ్ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

ప్రార్థ‌న‌లు ఫ‌లించిన‌ప్పుడు.. హృద‌యాలు ఒక‌ట‌వుతాయి.. 

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అక్ష ఆ త‌ర్వా త తెలుగులో ఎన్నో సినిమాల్లో న‌టించింది. 2017 నుంచి ఆమె టాలీవుడ్ లో క‌నిపించ‌లేదు. ఆ త‌ర్వాత హిందీలో వెబ్ సిరీస్ లు తీయ‌డం మొద‌లు పెట్టింది. ఆ స‌మ‌యంలోనే సినిమాటోగ్రాఫ‌ర్ కౌష‌ల్ తో  ప‌రిచ‌యం ఏర్ప‌డింది ఆమెకి. ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మార‌డంతో ఇద్ద‌రు పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 26న వీళ్ల పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. దానికి సంబంధించి ఫొటోల‌ను షేర్ చేశారు అక్ష‌. "ప్రార్థ‌న‌లు ఫ‌లించిన‌ప్పుడు.. హృద‌యాలు ఒక‌ట‌వుతాయి. దేవుడు, మా త‌ల్లిదండ్రులు,  నామేలు కోరే వారి స‌మ‌క్షంలో, వాళ్ల‌ ఆశిస్సుల‌తో మేం ఒక‌ట‌య్యాం" అంటూ ఫొటోలు పోస్ట్ చేసింది అక్ష‌. ఇప్పుడు ఆఫొటోలు వైర‌ల్ గా మారాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aksha Pardasany (@akshapardasany)

 

తెలుగులో హిట్ సినిమాలు.. 

త‌న 8వ త‌ర‌గ‌తిలోనే మోడ‌లింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అక్ష‌. ఇక ఆ త‌ర్వాత 2004లో 'ముసాఫిర్' అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. 'రైడ్', 'అది నువ్వే', 'కందిరీగ‌', 'శ‌త్రువు', 'ర‌య్ ర‌య్', 'బెంగాల్ టైగ‌ర్', 'డిక్టేట‌ర్', 'మెంట‌ల్ పోలీస్', 'రాధా' త‌దిత‌ర తెలుగు చిత్రాల్లో న‌టించింది. తెలుగుతో పాటు తమిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో కూడా న‌టించింది అక్ష‌. ఈమె ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 75 యాడ్స్ లో కూడా న‌టించారు. 2017 త‌ర్వాత ఆమె తెలుగు తెర‌పై క‌నిపించ‌లేదు. సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గిపోవ‌డంతో వెబ్ సిరీస్ చేయ‌డం మొద‌లుపెట్టింది. 'జ‌మ‌త్ర‌', 'కాట్మాండూ క‌నెక్ష‌న్', 'రూపుచ‌క్క‌ర్' లాంటి వెబ్ సిరీస్ చేసింది. ఇక ఆ టైంలోనే కౌష‌ల్ తో ఆమెకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్ ల‌తో బిజీగా ఉంది అక్ష‌. 

గోవాలో గ్రాండ్ వెడ్డింగ్... 

డెస్టినేష‌న్ వెడ్డింగ్ అంటేనే గ్రాండ్ వెడ్డింగ్ అని అర్థం. ఎన్నో స్పెష‌ల్స్ ఉంటాయి వాళ్ల పెళ్లిలో. అలా అక్ష‌,  కౌష‌ల్ పెళ్లి కూడా గ్రాండ్ గా జ‌రిగింది. కొద్దిమంది బంధువులు, స‌న్నిహితులు మ‌ధ్య ఈ తంతు నిర్వ‌హించారు. అయితే, కౌష‌ల్ సినిమాటోగ్రాఫ‌ర్ కావ‌డంతో పెళ్లిని చాలా సినిమాటిక్ గా డిజైన్ చేశాడు. దానికి సంబంధించిన స్పెష‌ల్ వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పెళ్లికొడుకు ఎంట్రీ చాలా ఫ‌న్నీగా జ‌రిగింది. సినిమాటోగ్రాఫ‌ర్ కావ‌డంతో కెమెరా క్రేన్ తో ఎంట్రీ ఇచ్చాడు పెళ్లికొడుకు. దీంతో ఆ వీడియోలు నెట్టింట్లో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. "కెమెరా మెన్ అనిపించుకున్నావు బ్రో " అంటూ కామెంట్లు పెడుతున్నారు చాలామంది.

Also Read: ఓం భీమ్ బుష్' టీజ‌ర్ రిలీజ్ - 100 ప‌ర్సంట్ ఫ‌న్!

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget