(Source: ECI/ABP News/ABP Majha)
Actor Siva Balaji Warning: 200 ఛానెల్స్‌పై డీజీపీకి ఫిర్యాదు చేశాం - ట్రోల్స్ చేస్తే సీరియస్ యాక్షన్: శివబాలాజీ మాస్ వార్నింగ్
Siva Balaji : ట్రోలర్స్ కి, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కి యాక్టర్ శివబాలాజీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మా ఇలాంటివన్నీ ఇక సహించేది లేదని, ఏవైనా వీడియోలు ఉంటే ముందే తీసేయాలని ఆయన హెచ్చరించారు.
Actor Siva Balaji Warning To YouTube Troll Channels: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ మధ్యే కాలంలో అది బాగా మితిమీరి పోయింది. హనుమంతు అనే యూట్యూబర్ తండ్రి, కూతురి బంధం మీద చేసిన కామెంట్స్ దానికి నిదర్శనం. దీనిపై ఎంతోమంది సెలబ్రిటీలు స్పందించారు. అయితే, ఇప్పుడు మా మూవీ అసోసియేషన్ దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు ముందుకు వచ్చింది. దాంట్లో భాగంగా డీజీపీని కలిసిన బృందం ఒక వినతి పత్రం అందజేసింది. ట్రోలింగ్ యూట్యూబ్ ఛానెల్స్ ను ఆపేయాలని విజ్ఞప్తి చేసింది. వినతిపత్రం అందించిన తర్వాత యాక్టర్ శివబాలాజీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొంతమంది ట్రోలర్స్ కి మాస్ వార్నింగ్ ఇచ్చారు.
జాగ్రత్త పడండి.. ఎవ్వరినీ వదిలిపెట్టం..
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ట్రోలింగ్ మితిమీరిపోతుందని అన్నారు శివబాలాజీ. పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారని, ఇక నుంచి సహించము అని చెప్పారు ఆయన. "సోషల్ మీడియాలో ఎలా పర్సనల్ గా ట్రోల్ చేస్తున్నారో చూస్తున్నాం. చాలామంది జర్నలిస్ట్ లను, యూట్యూబర్లు కంటెంట్ పెడితే వాళ్లను కూడా ట్రోల్ చేస్తున్నారు. చాలా చీప్ గా ట్రోల్ చేస్తున్నారు. మన ఉద్దేశం ఒకటైతే వాళ్లు ఇంకోలా తీసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న హనుమంతు లాంటి వాళ్లు ఒక చిన్న పాప వీడియోకి అలా చేయడం ఇబ్బందిగా అనిపించింది. అంత దారుణంగా పోల్చడం బాధ అనిపించింది. అంతేకాదు మన సినిమాలు ఇప్పుడు వరల్డ్ వైడ్ వెళ్తున్నాయి. వాటిపైన కూడా వీడియోలు చేస్తున్నారు నెగటీవ్ గా. టీజర్‌లో ఏముంటుంది? కానీ దాన్ని తీసుకుని పోస్ట్ మార్టం చేస్తున్నారు. దాన్ని వెకిలిగా చేయడం, ఎక్కిరివ్వడం లాంటివి చేస్తున్నారు. నవ్వుకోవడం, కమెంట్ చేయడం అలవాటు అయిపోయింది. ఏది తప్పు, ఏది కరెక్ట్ అని తెలుసుకులేకపోతున్నారు. చాలా క్యాజువల్ గా సారి చెప్పి ఇది కామెడీ అంటున్నారు. అది ఒక తప్పు అని తెలియడం లేదు వాళ్లకి. చాలామందిని చూస్తున్నాం. చాలామంది ఛానెల్స్ డౌన్ చేస్తున్నాం. దాదాపు 200 ట్రోలింగ్ ఛానెల్స్ ఉన్నాయి. అవన్నీ డీజీపి గారికి ఇచ్చాం. ఇప్పటి వరకు 25 ఛానెల్స్ టర్మినేట్ చేయబోతున్నాం. చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నాం. అలాంటి లింక్స్ ఏవైనా ఉంటే తీసేసుకోండి. మీ రెవెన్యూ కోసం మిగతా వాళ్లని ఇబ్బంది పెట్టకండి. కచ్చితంగా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. జాగ్రత్త" అని కొన్ని యూట్యూబ్ చానెల్స్, ట్రోలర్స్ కి ఆయన వార్నింగ్ ఇచ్చారు.
మంచు విష్ణు ఆవేదన..
ఇటీవల సోషల్ మీడియాలో హనుమంతు అనే వ్యక్తి తండ్రి, కూతుళ్ల బంధంపై తీవ్ర కామెంట్స్ చేశాడు. దీంతో అది అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దానిపై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా స్పందించారు. ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు మా అసోసియేషన్ మరో ముందు అడుగు వేసి చర్యలు మొదలుపెట్టింది. త్వరలోనే ఒక సైబర్ అసోసియేషన్ ని ప్రారంభించి మరింత స్ట్రిక్ట్ చేస్తామని వెల్లడించారు.
Also Read: సుకుమార్, అల్లు అర్జున్ మధ్య మనస్పర్థలు - ‘పుష్ప 2’పై క్లారిటీ ఇచ్చిన ఐకాన్ స్టార్ మేనేజర్