Rajasekhar Reaction : శ్రీదేవిని పెళ్లి చేసుకోవాల్సింది - జీవిత ప్రపోజ్ చేసేలా నేను చేశా... హీరో రాజశేఖర్ లైఫ్‌లో క్యూట్ మూమెంట్స్
Rajasekhar : సీనియర్ హీరో రాజశేఖర్ తన లవ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అంతే కాకుండా తాను మిస్ అయ్యి బిగ్ హిట్‌గా మారిన మూవీస్ గురించి చెప్పారు.

Actor Rajasekhar Opens Up About His Career Love Movies : యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ (Rajasekhar) రీసెంట్‌గా బైకర్‌తో మంచి సక్సెస్ అందుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ హీరోస్ మూవీస్‌లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. తన సినీ జర్నీలో డాక్టర్ నుంచి యాక్టర్ వరకూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. తాజాగా నటుడు రాజా రవీంద్రతో ఇంటర్వ్యూలో తన ఫస్ట్ క్రష్, మూవీస్ జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
'శ్రీదేవిని చేసుకోవాల్సింది'
తనతో పెళ్లి కోసం అందాల తార శ్రీదేవిని (Sridevi) తన పేరెంట్స్ అడిగినట్లు చెప్పారు రాజశేఖర్. 'నన్ను చాలా మంది ఇంటర్వ్యూల్లో అడుగుతుంటారు. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది అని. జీవిత ప్రపోజ్ చేసేలా నేను చేశాను. మా అమ్మ ఓకే చెప్పిన అమ్మాయి, జీవితను తీసుకుని ఓ టెంపుల్‌కు వెళ్లా. వారిద్దరూ కలిసిన తర్వాత తెలిసింది ఒకే స్కూల్ మేట్స్ అని. శ్రీదేవిని కూడా మా పేరెంట్స్ అడిగారు.
ఈ క్యాస్ట్ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని మా పేరెంట్స్ అంటున్నారని జీవితకు అన్నీ వివరంగా చెప్పా. అప్పుడు ఆమె ఒకటే అంది. 'మీరు వేరే పెళ్లి చేసుకుంటే మీ ఇష్టం. కానీ నేను మాత్రం వేరే పెళ్లి చేసుకోను. మీ కోసమే ఉంటాను.' అని జీవిత అన్నారు. అలా మా ప్రేమ పెళ్లి పీటల వరకూ సాగింది.' అని చెప్పారు.
Also Read : విష్ణు ప్రియ, అషు రెడ్డి రూటులో శ్రీ రెడ్డి - ఇన్ స్టా గేట్స్ ఓపెన్... ఎంత మంది సబ్‌స్కైబర్స్ అంటే?
Also Read : రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్! - సర్‌ప్రైజెస్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
'ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నారు'
తాను యాక్టింగ్ నేర్చుకుంటున్నానని తెలిసి తనను తన తండ్రి ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నారంటూ అప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు రాజశేఖర్. 'నాకు చిన్నప్పటి నుంచి నత్తి ఎక్కువ. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ఇదే విషయంలో నాకు, మా నాన్నకు మధ్య డిస్కషన్ నడిచింది. నువ్వు డాక్టర్ అయితేనే ఇంట్లో ఉండు. యాక్టింగ్ అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోమన్నారు. అలా అంటే నేను బయటకు వెళ్లిపోయా.' అని చెప్పారు.
'ఆ మూవీస్ నేనే చేయాల్సింది'
అర్జున్ 'జెంటిల్ మ్యాన్' (Gentleman), వెంకటేశ్ 'చంటి' (Chanti) మూవీస్ తానే చేయాల్సిందని చెప్పారు రాజశేఖర్. 'చంటి సినిమా ఆ డైరెక్టర్ బాగా చేస్తారు కదా అని అనుకున్నా. సినిమా చూసి నెక్స్ట్ డే హైదరాబాద్ వద్దామని అనుకున్నా. కానీ అలానే వచ్చేశా. అయితే, అప్పటికే వెంకటేశ్ గారు చూసి కొనిపించడమో, కొనుక్కోవడమో జరిగింది. అలా అది మిస్ అయ్యింది. కొన్ని సినిమాల విషయంలో నా మంచితనం నన్ను ముంచేసింది.' అంటూ ఓపెన్ అయ్యారు.
Also Read : బన్నీ సినిమాకు రెమ్యూనరేషన్ భారీగా పెంచిన అనిరుద్ - 'ప్యారడైజ్' కంటే 6 కోట్లు ఎక్కువ?
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు






















