Sri Reddy : విష్ణు ప్రియ, అషు రెడ్డి రూటులో శ్రీ రెడ్డి - ఇన్ స్టా గేట్స్ ఓపెన్... ఎంత మంది సబ్‌స్కైబర్స్ అంటే?
Sri Reddy Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి శ్రీరెడ్డి ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ఓపెన్ చేశారు. 2 రోజుల్లోనే ఆమెకు వందల్లో సబ్‌స్క్రైబర్స్ వచ్చారు.

Sri Reddy Open Gate For Insta Subscription : శ్రీరెడ్డి... ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎప్పుడూ తనదైన కామెంట్స్‌తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పాపులర్ అయిన ఆమె... నేను నాన్న అబద్ధం, అరవింద్ 2 సినిమాల్లో నటించారు. క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో తరచూ వార్తల్లో నిలిచారు. అంతే కాకుండా పొలిటికల్ గానూ విమర్శలు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.
ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్
ఓవైపు ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ మీద వివాదం జరుగుతుండగానే... పెయిడ్ సబ్ స్క్రప్షన్ చేసుకునే సెలబ్రిటీలు రోజు రోజుకూ పెరుగుతున్నారు. మొన్న యాంకర్ విష్ణు ప్రియ... నిన్న బిగ్ బాస్ ఫేం అషు రెడ్డి... నేడు శ్రీరెడ్డి. ఇన్ స్టాలో సబ్ స్కిప్షన్ గేట్స్ ఓపెన్ చేశారు. రీసెంట్‌గానే ఇన్ స్టాలో ఆ ఆప్షన్ యాక్టివేట్ చేయగా... ఇన్‌ఫ్లుయెన్సర్స్ క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా శ్రీరెడ్డి కూడా ఈ గ్రూప్‌లో చేరారు. ఆమె ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ యాక్టివేట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
View this post on Instagram
పే చేయాల్సిందే...
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఫోటో షూట్స్, వీడియోలు ఇన్ స్టాలో షేర్ చేస్తుంటారు. ఇక నుంచి ఆ ఫోటోలు చూడాలంటే నెలకు ఇంత అని పే చేయాల్సి ఉంటుంది. శ్రీరెడ్డి కూడా ఆ ఆప్షన్‌ను క్యాష్ చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల్లోనే 520 సబ్ స్క్రైబర్స్ వచ్చినట్లు చెప్పారు. మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
Also Read : రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్! - సర్‌ప్రైజెస్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Also Read : బన్నీ సినిమాకు రెమ్యూనరేషన్ భారీగా పెంచిన అనిరుద్ - 'ప్యారడైజ్' కంటే 6 కోట్లు ఎక్కువ?
పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ఫీచర్ కింద... సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు చూడాలంటే నెలకు రూ.399 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్నే వారు ఆదాయంగా మార్చుకుంటున్నారు. మొన్నటి వరకూ విష్ణు ప్రియకు 1800 మంది సబ్ స్క్రైబర్స్ ఉండగా... ఈ ఆప్షన్ తర్వాత 5 వేలకు పైగా చేరారు. దీని ద్వారా దాదాపు నెలకు రూ.10 లక్షల ఇన్ కం సంపాదిస్తున్నారు. అయితే, అశ్లీల ఫోటోలు, అసభ్యకర వీడియోలు పెడుతున్నారంటూ ఆమెపై పోలీస్ కేసు నమోదైంది. ఈ వివాదం తర్వాత ఆమెకు మరింత మంది సబ్‌స్క్రైబర్స్ పెరిగారు.
ఆ తర్వాత బిగ్ బాస్ ఫేం అషు రెడ్డి కూడా సబ్‌స్క్రిప్షన్ గేట్స్ ఓపెన్ చేశారు. వివాదం అవ్వక ముందు వెయ్యి మంది సబ్‌స్క్రైబర్స్ ఉంటే ఇప్పుడు 8 వేలకు పైగా ఆమె ఖాతాలో చేరారు. దీని ద్వారా నెలకు రూ.30 లక్షల ఆదాయం ఆమెకు వస్తోంది. ఇప్పుడు ఇదే బాటలో శ్రీరెడ్డి చేరగా... మరి ఎలాంటి కంటెంట్ షేర్ చేస్తారో చూడాల్సి ఉంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
ట్రెండింగ్ వార్తలు






















