Actor Raja Ravindra: రవితేజ పెళ్లికి కాళ్లు కడిగింది నేనే.. మా మధ్య గొడవ ఏంటంటే? రాజారవీంద్ర క్లారిటీ
Actor Raja Ravindra: రాజారవీంద్ర.. పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సినిమాల్లో నటించారు. ఎన్నో మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. ఇక ఇప్పుడు హీరోల కాల్ షీట్స్ చూస్తున్నారు.
Actor Raja Ravindra About Clashes with Sunil & Ravi Teja: రాజారవీంద్ర.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశారు . భర్తగా, తండ్రిగా, బావమరిదిగా ఎన్నో వేషాలు వేశారు. విలన్ క్యారెక్టర్లు చేశారు. ఇక కొన్ని రోజులకు అవకాశాలు తక్కువ అయ్యాయి. దీంతొ ఆయన హీరోల కాల్ షిట్లు, షెడ్యూల్స్ చూడటం మొదలుపెట్టారు. ప్రస్తుతం వెంకటేశ్, నిఖిల్, సితార, రాజ్తరుణ్, జయసుధ, నవీన్ చంద్ర మరికొంత మంది కాల్ షీట్స్ చూస్తున్నారు. ఆయన ఈ ఫీల్డ్ లోకి వచ్చిన కొత్తలో రవితేజ కాల్ షీట్స్ చూసేవాళ్లు. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. అలాంటిది ఇప్పుడు ఆయన రవితేజ కాల్ షీట్స్ చూడటం లేదు. అలానే సునీల్‌తో కూడా ఆయనకు గొడవలు ఉన్నాయనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన వాళ్ల మధ్య గొడవ గురించి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే?
చిన్న గ్యాప్ మాత్రమే..
ఈ మధ్య ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజారవీంద్ర ఈ విషయాలు చెప్పారు. "రవితేజ, నేను, సునీల్ ముగ్గురం ఒక ఊరువాళ్లం. అందుకే వాళ్ల డేట్స్ చూడను (నవ్వుతూ). మా మధ్య చాలా చిన్న గొడవలు. కమ్యూనికేషన్ గ్యాప్. అందుకే, వాళ్ల కాల్ షీట్స్ చూడను. అంతేకానీ మేం ఇప్పటికీ క్లోజ్ గానే ఉంటాం. సినిమా ఇండస్ట్రీలో ఒక పదిరోజులు ఎవడైనా లేడంటే.. ఇంకోడు వాడి గురించి ఏదో చెప్పాలని చూస్తాడు. అలాంటి చిన్న చిన్న విషయాల్లో ఇష్యూస్ అయ్యాయి. రవి తేజ నేను ఒకప్పుడు చాలా క్లోజ్ గా ఉండేవాళ్లం. ఆయన పెళ్లికి కాళ్లు కడిగింది నేనే. ఇప్పుడు కూడా అలానే ఉంటాం. వాళ్లు మా ఇంటికి వస్తారు. పిల్లలు కూడా మా ఇంటికి వస్తారు అంతే తప్ప.. పెద్ద పెద్ద గొడవలు, మాట్లాడుకోకపోవడం ఏమీ లేదు" అని క్లారిటీ ఇచ్చారు రాజా రవీంద్ర.
సునీల్ బీజీ అయిపోయాడు..
"సునీల్ హీరోగా మానేసిన తర్వాత.. మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బీజీ అయిపోయాడు. తమిళ్ సినిమాలు కూడా చేస్తున్నాడు. తనకు చాలా కమిట్ మెంట్స్ ఉంటాయి. నేను ఏదైనా షాట్ లో ఉండి.. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా.. సునీల్ కి సపరేట్ మేకప్ మెన్ ఉన్నాడు. కచ్చితంగా అందరూ ఆయనకి చెప్పాల్సిందే. అలాంటప్పుడు నేను చూడటం అవసరం లేదు కదా. అందుకే ఆయన దగ్గర చేయను. అంతే తప్ప.. పెద్ద గొడవలు ఏమీ లేవు. ఎవరి మధ్య ఏం జరిగిందో వాళ్లిద్దరికి మాత్రమే తెలుసు. ఏమీ లేకపోయినా వంద రాస్తారు ఈ రోజుల్లో. అలాంటిది ఏదో ఉంది అన్నప్పుడు కచ్చితంగా చాలానే రాస్తారు కదా?" అని సునీల్, రవితేజతో గొడవ గురించి క్లారిటీ ఇచ్చారు రవీంద్ర.
సినిమాల్లో ఆఫర్లు లేనప్పుడు.. చిరంజీవి తనని ప్రోత్సహించారని అన్నారు రాజరవీంద్ర. "అన్నయ్య సినిమాలు లేవు ఏం చేయాలో అర్థంకావడం లేదు" అని బాధపడితే.. "సినిమా అంటే నీకు ఇష్టం కదా.. ఆ మమకారాన్ని అలా కొనసాగించు సినిమా నిన్ను కచ్చితంగా నిలబెడుతుంది అన్నారు". ఇక క్యారెక్టర్లు రానప్పుడు ఈ కాల్ షీట్స్ చూసే బిజీలో పడి.. క్యారెక్టర్లు రాలేదే అని బాధ కలగలేదు అని చెప్పారు రవీంద్ర. బతకేందుకు ఏదో ఒకటి ఉంది కదా అని ఫీల్ అయ్యానని, ఇప్పుడిక మంచి మంచి క్యారెక్టర్లు మళ్లీ వస్తున్నాయని తన అనుభవాలు చెప్పారు.
Also Read: ‘బిగ్ బాస్ 7 ఉత్సవం’లో కుమారి ఆంటీ - అక్కడ కూడా అదే పని!