అన్వేషించండి

నేనెక్కడికి పారిపోలేదు - డ్రగ్స్ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు: హీరో నవదీప్

హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో హీరో నవదీప్ కి కూడా సంబంధం ఉందని, అతను కూడా డ్రగ్స్ తీసుకున్నాడని ఇప్పటికే మీడియాలో వార్తలు వినిపిస్తుండగా, నవదీప్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే ముగ్గురు నైజీరియాన్ లతో పాటు ఒక సినీ నిర్మాత, ఒక మాజీ ఎంపీ కుమారుడు సైతం అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జరిపిన ఆపరేషన్ లో భాగంగా వీళ్లంతా పట్టుబడ్డారు. ఈ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ ‘‘సినీ హీరో నవదీప్ పబ్‌కు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందని, అతను కూడా డ్రగ్స్ తీసుకున్నాడు’’ అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.

ఇదే విషయం మీద కమిషనర్ సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. "ప్రస్తుతానికి నవదీప్ కానీ అతని కుటుంబం కాని అందుబాటులో లేదని, ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకుని కుటుంబంతో సహా పరారయ్యారు’’ అని తెలిపారు. ఈ విషయంపై హీరో నవదీప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు నవదీప్ ట్వీట్ చేస్తూ.. "అది  నేను కాదు జెంటిల్మెన్, నేను ్కడే ఉన్నాను. దయచేసి క్లారిటీ తెచ్చుకోండి, థాంక్స్" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత నవదీప్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాదులోని ఉన్నానని, డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. తాను కూడా ప్రెస్ మీట్ చూశానని కమిషనర్ హీరో నవదీప్ అని ఎక్కడా మెన్షన్ చేయలేదని, అతను వేరే నవదీప్ అయి ఉంటాడని పేర్కొన్నాడు.

నవదీప్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల నవదీప్ లీడ్ రోల్ లో నటించిన 'న్యూసెన్స్' అనే వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ బిందు మాధవి ఈ వెబ్ సిరీస్ లో మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో ప్రసారమైంది. త్వరలోనే  సీజన్ 2 కూడా రాబోతోంది.

ఈ వెబ్ సిరీస్ తో పాటు 'లవ్ మౌళి' అనే సినిమాలో నటిస్తున్నారు నవదీప్. ఈ సినిమాలో నవదీప్ మేకోవర్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది  అవనీంద్ర అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15 స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మేరకు ఆ రోజు సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే 'The Anthem Of Love Mouli' అనే పేరుతో సాంగ్  ప్రోమోని విడుదల చేశారు. గోవింద్ వసంత కంపోజ్ చేసిన ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు .

Also Read : 'జవాన్' డైరెక్టర్ అట్లీ నన్ను మోసం చేశాడు: ప్రియమణి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Vishwambhara OTT Deal : మెగాస్టార్ విశ్వంభర ఓటీటీ డీల్ ఫిక్స్! - సంక్రాంతి రేసులో మూవీ?... మరి 'కాకా' ఏం చేస్తారో?
మెగాస్టార్ విశ్వంభర ఓటీటీ డీల్ ఫిక్స్! - సంక్రాంతి రేసులో మూవీ?... మరి 'కాకా' ఏం చేస్తారో?
Nayan Mahasakthi Teaser : అమ్మవారిగా నయనతార - ఈసారి ఉగ్రరూపమేనా?... ఇంట్రెస్టింగ్ అండ్ గ్రిప్పింగ్‌గా మహాశక్తి టీజర్
అమ్మవారిగా నయనతార - ఈసారి ఉగ్రరూపమేనా?... ఇంట్రెస్టింగ్ అండ్ గ్రిప్పింగ్‌గా మహాశక్తి టీజర్
Bigg Boss Telugu 10 : టాప్ ట్రెండింగ్‌లో బిగ్ బాస్ తెలుగు 10 - టాలీవుడ్ ఎంటర్టైన్మెంట్‌లో ఫస్ట్ ప్లేస్
టాప్ ట్రెండింగ్‌లో బిగ్ బాస్ తెలుగు 10 - టాలీవుడ్ ఎంటర్టైన్మెంట్‌లో ఫస్ట్ ప్లేస్
This Week OTT Movies : వినాయక చవితి స్పెషల్ వీక్... ఒకే రోజు 10 మూవీస్ స్ట్రీమింగ్ - ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే
వినాయక చవితి స్పెషల్ వీక్... ఒకే రోజు 10 మూవీస్ స్ట్రీమింగ్ - ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Andhra Pradesh Rains: ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
Kagaznagar Crime News: ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అత్యాచారం, కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత- నిందితుడి అరెస్ట్
ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అత్యాచారం, కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత- నిందితుడి అరెస్ట్
Buses To Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
Embed widget