Naga Chaitanya: 'బుజ్జి తల్లి' ఆ 2 ప్రాజెక్టులు నాకెంతో ఇష్టం' - శోభితపై నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు
Sobhita Dhulipala Projects: 'తండేల్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు నాగచైతన్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన సతీమణి శోభిత నటించిన ప్రాజెక్టులు 2 తనకు చాలా ఇష్టమైనవని చెప్పారు.

Actor Naga Chaitanyna Comments On Sobhita Dhulipala Projects: నటుడు నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభిత ధూళిపాళ్ల ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 'తండేల్' (Tandel) మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన.. తన సతీమణి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శోభిత తనకు అన్ని విషయాల్లోనూ ఎంతో సపోర్ట్‌గా నిలుస్తోందని అన్నారు. ఆమెను ప్రేమగా బుజ్జితల్లి అని పిలుస్తానని చెప్పారు. శోభిత (Sobhita Dhulipala) నటించిన ప్రాజెక్టుల్లో 'మేడ్ ఇన్ హెవన్', 'మేజర్' తనకెంతో ఇష్టమని అన్నారు. ఆమె నటన బాగుంటుందని చెప్పారు.
ఇంకా ఏమన్నారంటే..?
'శోభిత వాళ్లది వైజాగ్. మా ఇద్దరిదీ కూడా ఆంధ్రా బ్యాక్ గ్రౌండే. మా సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ ఒక్కటే. ఆమె తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. భాష విషయంలో నాకెంతో సాయం చేస్తుంది. నేను ఏదైనా కార్యక్రమాల్లో స్పీచ్ ఇవ్వాల్సి వస్తే.. శోభితనే నాకు హెల్ప్ చేస్తుంటుంది.' అని చైతూ వెల్లడించారు.
కాగా, తన భార్య శోభిత గురించి ఇంతకు ముందు సైతం పలు ఇంటర్వ్యూల్లో నాగ చైతన్య ప్రేమ, ఇష్టాన్నితెలియజేయడం సహా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అన్ని విషయాల్లోనూ ఆమె నిర్ణయం తీసుకుంటానని.. మన సంస్కృతి, సంప్రదాయాలను శోభిత ఫాలో అవుతుందని.. తమ వెడ్డింగ్ సంబంధించి ప్రతిదీ ఆమె డిజైన్ చేసిందేనని చెప్పారు. తమ వివాహ సమయంలో కుటుంబంతో కలిసి ఆనందించిన క్షణాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయని అన్నారు.
తండేల్ మూవీపై..
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, డ్యాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి కాంబోలో వస్తోన్న మూవీ 'తండేల్'. 'లవ్ స్టోరీ' తర్వాత వస్తోన్న ఈ మూవీ ప్రేమకథతో పాటు సర్వైవల్ డ్రామాగా తెరకెక్కింది. ప్రేమకథలకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే 'నాగచైతన్య' సముద్రం నేపథ్యంలో సాగే ప్రేమకథను ఎంచుకుని నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని కార్తికేయ సిరీస్ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేయగా... గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
సాయిపల్లవితో డ్యాన్స్ అంటే..
సాయిపల్లవితో కలిసి రెండోసారి నటించడం సంతోషంగా ఉందన్నారు నాగచైతన్య. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన చిత్ర విశేషాలను పంచుకున్నారు. సాయి పల్లవితో డ్యాన్స్ అంటే అంత సులభం కాదని.. ముఖ్యంగా శివశక్తి పాట తనకు చాలా ఇష్టమని చెప్పారు. '22 మంది మత్స్యకారులు పాక్ సరిహద్దుల్లోకి వెళ్లి అక్కడ జైల్లో బందీలైన ఘటన నాకు ఓ న్యూస్‌లా మాత్రమే తెలుసు. వారి జీవితం నేపథ్యంలో రాసిన ఈ కథ నా దగ్గరికి వాళ్ల ఎమోషన్స్ పూర్తిగా అర్థమయ్యాయి. నిజ జీవితంలో పరిస్థితులతో పోరాడిన ఆ 22 మంది నాకు స్ఫూర్తి. సింహ భాగం సన్నివేశాలు సముద్రం నేపథ్యంలోనే సాగుతాయి. శ్రీకాకుళం యాసలో మాట్లాడేందుకు ప్రత్యేకంగా ట్యూషన్ తీసుకున్నా. ఇదొక మంచి ప్రేమకథగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది.' అని చైతూ పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

