Little Hearts Success Meet : రూపాయ్ పెడితే 10 రూపాయల ఎంటర్టైన్మెంట్ అందిస్తా - గాల్లో తేలినట్టుందన్న 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ మౌళి
Mouli Tanuj: 'లిటిల్ హార్ట్స్' మూవీని ఇంతటి సక్సెస్ చేసిన ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు మూవీ టీం. తాజాగా సక్సెస్ మీట్‌లో హీరో మౌళి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Mouli Tanuj About Little Hearts Movie In Success Meet: యంగ్ హీరో మౌళి తనూజ్, శివాని నాగారం జంటగా నటించిన లేటెస్ట్ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ 'లిటిల్ హార్ట్స్' మంచి సక్సెస్ అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. తాజాగా మూవీ టీం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో హీరో మౌళి తనూజ్ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
ఎంత సపోర్ట్... ఆడియన్స్‌కు థాంక్స్
ఈ సినిమాకు టీం మొత్తం చాలా కష్టపడ్డామని... మంచి సినిమాకు ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు థాంక్స్ అని చెప్పారు మౌళి. 'ఆడియన్స్ పిచ్చోళ్లా మీరు. ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా?' అంటూ ప్రశ్నించారు. 'ఇంతటి సక్సెస్ మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మంచి సినిమా చేశామని తెలుసు. ఫస్ట్ వీక్ కొంతమంది చూస్తారు. మౌత్ టాక్‌తో రెండో వీక్ బాగుంటుంది అనుకున్నాం. చాలా గట్టిగా ప్రమోషన్స్ చేసినా థియేటర్స్‌కు జనాలు వస్తారా రారా అనేది తెలీదు. చాలా భయపడ్డాం.
ప్రీమియర్స్, ఫస్ట్ డే థియేటర్స్ అన్నీ నిండిపోయాయి. ఫస్ట్ డే మా మూవీ రూ.2.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది బడ్జెట్ కంటే ఎక్కువ. పిచ్చోళ్లం అయిపోయాం. మమ్మల్ని నమ్మి థియేటర్‌కు వచ్చిన ప్రతీ ఆడియన్‌కు థాంక్స్. ఇంత ప్రేమను ఎందుకు చూపిస్తున్నారో నాకే అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలియదు.' అని చెప్పారు.
10 రూపాయల ఎంటర్టైన్మెంట్ అందిస్తా
ఎవరైనా 'లిటిల్ హార్ట్స్' బాగా లేదని కామెంట్స్ చేస్తే వాళ్లను తిడుతూ నెటిజన్లు రిప్లై ఇస్తున్నారని చెప్పారు మౌళి. 'ఇంతటి ప్రేమ, అభిమానం చూపిస్తోన్న ఆడియన్స్‌కు చాలా థాంక్స్. నా ఫేవరెట్ హీరో నాని నుంచి మొదలుకొని ఇండస్ట్రీ పెద్దలంతా మా సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అందరి ప్రశంసలతో నేను ఇంకా గాల్లోనే ఉన్నా. 100 శాతం ఈ సక్సెస్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నా. ఇలాగే కష్టపడతా. మంచి స్క్రిప్ట్స్, మంచి సినిమాలతోనే వస్తా. మీరు అలాగే నమ్మ థియేటర్‌కు రండి. కచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తా. రూపాయికి 10 రూపాయల వర్త్ కంటెంట్ తీసుకొస్తా. దర్శక నిర్మాతలు గర్వపడేలా పని చేస్తా.' అని అన్నారు.
ఆడియన్స్ మెచ్చే సినిమాలనే తీయాలని ప్రయత్నిస్తున్నామని... అయితే, అన్నిసార్లు ఆ ప్రయత్నాలు ఫలించవని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు చెప్పారు. 'ఈ మూవీకి వచ్చే ప్రతీ రూపాయి నాకు రూ.కోటితో సమానం. ఫస్ట్ టైం బన్నీ వర్క్స్ నుంచి మూవీ వచ్చింది. ఈ స్టోరీపై అంత నమ్మకంతో ఈటీవీ విన్ చిత్ర నిర్మాణంలో భాగమయ్యారు. ఈ మూవీతో నాపై నాకు నమ్మకం కలిగింది.' అని అన్నారు. సాయిమార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సింజిత్ ఎర్రమల్లి మ్యూజిక్ అందించారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది.






















