Telusu Kada Teaser: టిల్లు భాయ్ సిద్ధూ 'తెలుసు కదా' టీజర్ వచ్చేసింది - ట్రయాంగిల్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందో తెలుసా?
Telusu Kada Teaser Out: యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'తెలుసు కదా' మూవీ టీజర్ వచ్చేసింది. ఈ దీపావళికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Siddu Jonnalagadda's Telusu Kada Movie Teaser Out Now: యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ ట్రయాంగిల్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'తెలుసు కదా'. ఫేమస్ స్టైలిస్ట్ నీరజ కోన డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ
ఈ మూవీ ట్రయాంగిల్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. సిద్ధు సరసన రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా చేస్తున్నారు. వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లకు పసుపు రాసే సీన్‌తోనే టీజర్ ప్రారంభం కాగా... ట్రయాంగిల్ లవ్ స్టోరీలో హీరోకి ఎవరు దగ్గరవుతారో అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. 'ఇది చాలా నేచరల్‌గా జరగాల్సిన పని. నాకు రాసి పెట్టున్న అమ్మాయి ఎవరో తనంతట తానే నా లైఫ్‌లోకి రావాలి.' అనే సిద్ధు డైలాగ్‌తో హీరోయిన్ల ఎంట్రీ అదిరిపోయింది. వీరిద్దరూ అక్కా చెల్లెళ్లా లేక ఫ్రెండ్సా అనేది తెలియాల్సి ఉంది.
'నీకు బాగా ఇష్టం కదా ఇలా ఇద్దరిద్దరి మధ్యలో దూరడం' అంటూ వైవా హర్ష అడగడం ఇరువురు ముద్దుగుమ్మల నడుమ హీరో ఎలా నెట్టుకొచ్చాడో అనేదే మూవీ స్టోరీ అని తెలుస్తోంది. 'అసలేం నడుస్తుందిరా మైండ్‌లో' అంటూ వైవా హర్ష ప్రశ్నించగా... నీకు 'తెలుసు కదా?' అంటూ సిద్ధు చెప్పడం ఆసక్తిని పెంచేసింది. ఇద్దరితో లవ్, రొమాన్స్ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఏం జరిగిందో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే?
Love has never been more confusing and entertaining ❤🔥#TelusuKadaTeaser out now!
— People Media Factory (@peoplemediafcy) September 11, 2025
▶️ https://t.co/eqEteHSSPc#TelusuKada #LoveU2❤🔥
In cinemas worldwide from October 17th!
STAR BOY #SiddhuJonnalagadda @NeerajaKona #RaashiiKhanna @SrinidhiShetty7 @MusicThaman… pic.twitter.com/zCVLeKb8G8
Also Read: భార్య సురేఖను చూసి స్టెప్ మర్చిపోయిన చిరంజీవి - ఎంతటి మెగాస్టార్ అయినా...
చాలా రోజుల తర్వాత సిద్ధు లవ్ ఎంటర్‌టైనర్‌తో అలరించబోతున్నారు. తెలుగు, తమిళంతో పాటు కన్నడ భాషల్లో మూవీ ఈ దీపావళికి అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గత కొంతకాలంగా సిద్ధు ఖాతాలో సరైన హట్ పడలేదు. టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీస్‌తో మంచి సక్సెస్ అందుకున్న ఆయన రీసెంట్‌గా 'జాక్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు తాజాగా రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు.





















