Sai Durgha Tej: అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్
సిగ్గు ఉండాలి... చిన్న పిల్లల మీద అలాంటి కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు? సోషల్ మీడియాను తగలబెట్టేస్తా అంటూ ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్ ఫైర్ అయ్యారు.
Sai Durgha Tej comments on Social Media | సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ గత కొన్ని రోజుల కిందట చైల్డ్ అబ్యూస్ మీద తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఏబీపీ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో పాల్గొన్న సాయి దుర్గ తేజ్ ఆ విషయం మీద తను అలా ఎందుకు రియాక్ట్ అయ్యారనే విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఏబీపీ సమ్మిట్ లో తన ఆవేశానికి గల కారణాలు, సమస్య పరిష్కారానికి ఆయన ఆలోచిస్తున్న అంశాలపై ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో సాయి దుర్గ కీలక విషయాలు షేర్ చేసుకున్నారు.
1. సడన్ గా మీరు సాయి ధరమ్ తేజ్ అనే పేరుని సాయి దుర్గ తేజ్ అని ఎందుకు మార్చుకున్నారు? చాలామందికి ఈ విషయంలో క్లారిటీ లేదు?
సాయి దుర్గ తేజ్ : 2021లో నాకు యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ పుట్టాను. కాబట్టి మా అమ్మ పేరు నాతో ఉండాలని కోరుకుని, సాయి దుర్గ తేజ్ గా నాపేరు మార్చుకున్నాను.
2. ఇటీవల మీ పేరు రెండు విషయాల్లో చాలా ఎక్కువగా వినిపించింది. అందులో మెయిన్ గా ప్రణీత్ హనుమంతు ఇష్యూ... ఎందుకు దానిపై ఆ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు? చూడగానే సడన్ గా పెట్టిన పోస్టా అది? లేదంటే మొదటి నుంచి అలాంటి ఇష్యూలపై మీరు పోరాడుతూ వస్తున్నారా?
సాయి దుర్గ తేజ్ : నిజం చెప్పాలంటే నేను 24 గంటలు టైం ఇచ్చాను. అప్పటిదాకా ఏ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ గాని, ఏ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ కు సంబంధించిన సంస్థ కాని మాట్లాడలేదు. అది ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బందిగా ఉంది. ఒక్కసారి మీరు చదవండి... (అని తన ఫోన్ ను తేజ్ చూపించగా... బూతులున్నాయి అందులో). దానిపై 150 మంది నవ్వుతూ రియాక్ట్ అయ్యారు. అసలు నవ్వే జోకేనా అది? ఏ తండ్రి అయినా ఇలాంటివి చూస్తే నలిగిపోతాడు. నా బాధంతా ఏంటంటే వీళ్ళు జోకులు వేస్తున్నారు... అది కూడా నాలుగేళ్ల బిడ్డ మీద. అక్కడ ఏ పాప ఉన్నా సరే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. మొత్తం సోషల్ మీడియాను తగలబెట్టేస్తాను. అది చాలా పెద్ద తప్పు. ఆల్రెడీ ఆర్టిస్టులను, నటీనటులను వద్దు అన్నా గాని బూతులు తిడుతున్నారు. నాలుగేళ్ల పాప మీద అలాంటి బూతులు ఏంటి ? తప్పు కదా.. నేను చేసింది తప్పైతే అందరికీ సారీ చెప్తాను.
సింపుల్ గా చెప్పాలంటే రష్యా - ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు మన తెలుగు స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. వాళ్లు వెనక్కి వచ్చేంతవరకు మనకు మనసు ఆగలేదు. అలాగే ఇజ్రాయిల్ - పాలస్తీనా గొడవలో పిల్లలు చనిపోవడంతో గుండె తరుక్కుపోయింది. అలాంటిది సోషల్ మీడియాలో చిన్న బిడ్డపై ఎవరో ఇంత అసహ్యంగా కామెంట్ పెట్టడం ఏంటి?
3. పర్వర్షన్ రీజన్ ఏమనుకుంటున్నారు?
సాయి దుర్గ తేజ్ : పర్సన్స్ మైండ్ సెట్. అది మారాలి. మా మీద ఎలాగూ కామెంట్ చేస్తున్నారు. మేము పెద్దవాళ్ళం కాబట్టి పడుతున్నాము. పిల్లల మీద ఏంటి సర్? ఫ్రీ టు స్పీక్ అంటే ఇదా? సిగ్గుండాలి అలా మాట్లాడడానికి.
4. దీనికి ఫుల్స్టాప్ పెట్టాలంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
సాయి దుర్గ తేజ్ : ఇలాంటి పని చేసే వారిని గవర్నమెంట్ కఠినంగా శిక్షించాలి. నటీనటులను బూతులు తిడుతున్నారు. అంకుల్, ఆంటీ అంటూ సంబోధిస్తారు. వాళ్ళు పడే కష్టాన్ని గుర్తించరు. కానీ ఏదైనా తప్పు చేస్తే మాత్రం చేశారంటూ నిందిస్తారు.
5. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఛేంజ్ ఏమైనా కనిపించిందా?
సాయి దుర్గ తేజ్ : అది సరిపోదు... ఇంకా మార్పు రావాలి. మనుషులు వాళ్లకు వాళ్లే రియలైజ్ అవ్వాలి.
6. పవన్ కళ్యాణ్ గారు ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇలాంటి ఇష్యులపై ఏదైనా యాక్ట్ తీసుకొచ్చే ఆలోచన ఉందా?
సాయి దుర్గ తేజ్ : కళ్యాణ్ గారిని ఇందులో ఇంకా ఇన్వాల్వ్ చేయలేదు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాతో మాట్లాడుతున్నాము. ఇలాంటి వాటిపై చిన్న స్థాయిలో కాదు పెద్ద స్థాయిలో వెళ్లాలి కాబట్టి టైం పడుతుంది. కానీ నేనేం చేయగలనో అది కచ్చితంగా చేస్తాను.
Also Read: SDT 18 Update : SDT 18 నుంచి సాలిడ్ అప్డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పేసిన మేకర్స్
7. పవన్ కళ్యాణ్ గెలవగానే వెళ్లి హగ్ చేసుకోవడం మెగా ఫాన్స్ ని ఎమోషనల్ అయ్యేలా చేసింది. అంటే ఎలక్షన్స్ కు సంబంధించి మొదటి నుంచి అంత ఎమోషనల్ బాండింగ్ ఉందా?
సాయి దుర్గ తేజ్ : ఇది ఎలక్షన్స్ సంబంధించింది కాదు. నా చిన్నప్పుడు టెన్నిస్ లో ఇలాగే ఓ టోర్నమెంట్లో ఓడిపోయాను. ఆ టైంలో బాధగా ఇంట్లో ఉంటే మామయ్య వచ్చి డోంట్ గివప్... ఎలాగైనా గెలుస్తావు ఫైట్ చెయ్ అంటూ సపోర్ట్ చేయగా, నేను గేమ్ గెలిచాను. అదే విషయాన్ని మామయ్యతో చెప్తే నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆయన కూడా అంతే.. ఫస్ట్ ఎలక్షన్ లో ఓడిపోయారు. తర్వాత గెలిచాడు కాబట్టి నా చైల్డ్ హుడ్ మెమొరీ రీ క్రియేట్ అయ్యింది.