Love Me Movie: 'లవ్ మీ' నుంచి ‘ఆటగదరా శివ’ లిరికల్ సాంగ్... శివ మాయపై కీరవాణి అదిరిపోయే పాట
Love Me Movie: 'లవ్ మీ'.. 'ఇఫ్ యూ డేర్' అనే వెరైటీ క్యాప్షన్ తో వస్తోంది సినిమా. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ద్వారా హారర్ సినిమా అని తెలుస్తుంది. ఇప్పుడు లిరికల్ వీడియో రిలీజ్ చేశారు.
Aatagadhara Shiva Lyrical Video From Love Me : 'బేబీ' ఫేమ్.. వైష్ణవి చైతన్య, ఆశిష్ హీరోగా తెరకెక్కిన సినిమా 'లవ్ మీ'. 'ఇఫ్ యూ డేర్' అనే ట్యాగ్ లైన్ తో వస్తోంది ఈ సినిమా. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్ చూస్తుంటే ఇదో హర్రర్ లవ్ స్టోరీలాగా అనిపిస్తోంది. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక పాటను రిలీజ్ చేశారు టీమ్. ఫస్ట్ లిరికల్ వీడియో శివుని నేపథ్యంలో ఉంది. ‘‘ఆటగదరా శివ..’’ అంటూ రిలీజైన ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
'ఆటగదరా శివ ఈ మాయ'..
టీజర్‌లో 'భయమేసే చోట రొమాన్స్' అనే డైలాగ్ తో స్టార్ట్ అయ్యింది. దెయ్యాన్ని డేట్‌కు పిలుస్తాను అంటాడు హీరో. దీంతో ఈ సినిమా శ్మశానం బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో దానికి రిలేటెడ్ గా 'ఆట గదరా శివ.. నీ మాయ' అంటూ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసింది 'లవ్ మీ' టీమ్. శివుడు శ్మశాన వాసి అంటారు, శివ మాయ అంటుంటారు ఆ యాంగిల్ లో, దానికి రిలేటెడ్‌గా ఈ పాటను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక శివుని మాయపై రాసిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇంతకుముందు శివుని మాయపై వచ్చిన పాటల్లో కల్లా ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది.
అద్భుతమైన మ్యూజిక్, లిరిక్స్..
ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. హారర్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుండగా.. ఈ పాటను కూడా అలానే కంపోజ్ చేశారు. హారర్ ఫీల్ వచ్చే విధంగా అద్భుతమైన మ్యూజిక్ అందించారు కీరవాణి. ఇక చంద్రబోస్ రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. జీవిత సత్యాలను చెప్పే విధంగా ఉన్నాయి. ఈ పాటను సింగర్ మనీషా ఈరబత్తిని పాడారు. ఆమె హస్కీ వాయిస్ తో, వేరియేషన్స్ తో అద్భుతంగా పాడారు. హారర్ ఫీల్ వచ్చే విధంగా ప్రజంట్ చేశారు. ఇక పాట అంతా కూడా పుర్రెలు, శివుని బొమ్మలతో కనిపించింది.
ఇక సినిమా విషయానికొస్తే.. ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఆశిష్. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. భారీ అంచనాల మధ్య యూత్ ఫుల్ ఎంటర్టైనర్ వచ్చిన ‘రౌడీ బాయ్స్’ అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఆశిష్ ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తీసుకుని ఎలాగైన ఓ బిగ్ హిట్ కొట్టాలని ఈసారి సరికొత్త కంటెంట్‌తో సిద్దమయ్యాడు. అదే 'లవ్ మీ' సినిమా. ‘If You Dare’ అనేది ట్యాగ్ లైన్. ఇక షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ ఫేమస్ అయ్యి ఫస్ట్ సినిమాతోనే హిట్ అందుకున్న బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ అరుణ్ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు సొంత బ్యానర్ లో దీన్ని రిలీజ్ చేస్తున్నారు.
Also Read: నచ్చకపోతే సినిమా చూడటం మానేయండి? 'ఆదిపురుష్' ట్రోల్స్ పై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు!