Ira Khan Bikini Birthday: బికినీతో ‘బర్త్ డే’ - అమీర్ ఖాన్ కూతురుపై దారుణమైన ట్రోల్స్, ఆ సింగర్ మద్దతు!

అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తన తండ్రి సమక్షంలోనే స్విమ్మింగ్ పూల్ డ్రెస్ ధరించి పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోవడంపై నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.

FOLLOW US: 

టుడు అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ పుట్టిన రోజు ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయంగా మారింది. నిండు దుస్తుల్లో కాకుండా టు పీస్ బికిని ధరించి కేక్ కట్ చేసినందుకు నెటిజనులు ఆమెను దారుణమైన కామెంట్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. తండ్రి అమీర్ ఖాన్ ఉన్నప్పుడే బికినీ వేసుకుని అవేం పనులు అని తిట్టిపోస్తున్నారు. 

ఈ కామెంట్స్‌పై గాయని సోనా మహాపాత్ర స్పందించింది. ‘‘ఇరా ఖాన్ దుస్తుల ఎంపికపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమీర్ ఖాన్ అన్న మాటలను దీనికి లింక్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఆమె వయస్సు 25 ఏళ్లు. స్వేచ్ఛగా ఆలోచించే వయస్సు ఉన్న మహిళ ఆమె. ఆమెకు ఏం చేయాలో అది చేస్తుంది. ఇందుకు ఆమె తండ్రి అనుమతి అవసరం లేదు’’ అని తెలిపింది. వాస్తావానికి అది పూల్ పార్టీ. దీంతో ఆమె ఆ సమయంలో బికినీ ధరించింది. ఆమీర్ ఖాన్ కూడా స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి.. ఆ వేడుకలో పాల్గొన్నట్లు ఆ ఫొట్లో క్లియర్‌గా కనిపిస్తోంది. కానీ, నెటిజనులు మాత్రం గతంలో అమీర్ ఖాన్ చేసిన కామెంట్లను దృష్టిలో పెట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. 

Also Read: ‘నువ్వు శూర్పణక, ఆడియన్స్ నీ ముక్కు కోస్తారు’ బిందుపై నటరాజ్ ఫైర్, ఓవరైంది మాస్టర్!

అమీర్ ఖాన్ ఒకప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ‘‘ఒక వ్యక్తిగా, పౌరుడిగా ఈ దేశంలో ఏం జరుగుతుందనేది పేపర్లలో చదువుతున్నాం. అనేక సంఘటనలు నన్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నేను కిరణ్‌(భార్య)తో మాట్లాడుతున్నప్పుడు.. ఆమె ‘మనం భారతదేశం నుండి వెళ్లిపోవాలా?’ అని చెప్పింది. ఆమె తన బిడ్డ గురించి భయపడుతుంది. మన చుట్టూ వాతావరణం ఎలా ఉండబోతుందోనని ఆందోళనకు గురవ్వుతోంది. రోజూ వార్త పత్రికలను తెరవాలంటేనే ఆమె భయపడుతోంది’’ అని అమీర్ ఖాన్ అన్నారు. ఈ నేపథ్యంలో.. నాటి ఆమీర్ కామెంట్లను గుర్తు చేస్తూ నెటిజనులు, ఇండియాలో కాబట్టి మీరు ఇంత స్వేచ్ఛగా వస్త్రాలు ధరిస్తున్నారు. అదే మరే ముస్లిం దేశంలోనైనా ఇంత స్వేచ్ఛ ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు.

Also Read: ఆ సీన్‌పై అభ్యంతరం, రణ్‌వీర్, షాలినీ పాండేల ‘జయేష్‌భాయ్ జోర్దార్’పై హైకోర్టులో పిటీషన్

View this post on Instagram
 
A post shared by Ira Khan (@khan.ira)

View this post on Instagram
 
A post shared by SONA (@sonamohapatra)

Published at : 10 May 2022 07:49 PM (IST) Tags: Ira Khan Aamir Khan Daughter Aamir Khan Daughter in Bikini Ira Khan Birthday

సంబంధిత కథనాలు

Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?

Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?

Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?

Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?

Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత

Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత

BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?

BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?

Balakrishna: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే

Balakrishna: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక

IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక