అన్వేషించండి

Jayeshbhai Jordaar: ఆ సీన్‌పై అభ్యంతరం, రణ్‌వీర్, షాలినీ పాండేల ‘జయేష్‌భాయ్ జోర్దార్’పై హైకోర్టులో పిటీషన్

షాలినీ పాండే, రణ్‌వీర్ సింగ్ జంటగా నటిస్తున్న ‘జయేష్‌‌భాయ్ జోర్దార్’ సినిమాపై ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీంతో ఈ సినిమా విడుదలపై సందేహాలు నెలకొన్నాయి.

రణవీర్ సింగ్, షాలినీ పాండే జంటగా నటిస్తున్న ‘జయేష్ భాయ్ జోర్దార్’ చిత్రం చిక్కుల్లో పడింది. ఇటీవల విడుదలైన ‘జయేష్ భాయ్ జోర్దార్’ ట్రైలర్‌లోని ఓ సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ న్యాయవాది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. 

‘జయేష్ భాయ్ జోర్దార్’ సినిమాలో రణ్‌వీర్ సింగ్ భిన్నమైన పాత్ర పోషిస్తున్నాడు. ఆడవాళ్లను హీనంగా చూసే సర్పంచ్ కొడుకుగా రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నాడు. రణ్‌వీర్ భార్యగా షాలినీ పాండే నటించింది. రణ్‌వీర్, షాలినీలకు అప్పటికే ఆడ బిడ్డ పుడుతుంది. దీంతో రెండో బిడ్డ తప్పకుండా మగ బిడ్డే కావాలని రణ్ వీర్ తండ్రి ఆదేశిస్తాడు. ఈ సందర్భంగా ఆలయంలో షాలినీ కడుపులో ఉన్న బిడ్డ, ఆడ పిల్లా లేదా మగ పిల్లా అని తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు. అయితే, అది ఆమె కడుపులో ఆడ బిడ్డ పుడుతుందని సంజ్ఞ చేస్తుంది. 

తండ్రికి భయపడి రణ్‌వీర్.. షాలినీని హాస్పిటల్‌కు తీసుకెళ్లి అల్ట్రాసౌండ్ టెక్నాలజీ ద్వారా తనకు పుట్టబోయే బిడ్డ ఆడ పిల్లా లేదా మగ బిడ్డా అని తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తాడు. ఇందుకు ఓ కోడ్ ఉపయోగిస్తారు. కడుపులో మగ బిడ్డ ఉన్నట్లయితే డాక్టర్ ‘హరే కృష్ణ’ అని చెబితే మగ బిడ్డ, ‘జై మాతాజీ’ అంటే ఆడ బిడ్డ అని అర్థం. ఈ నేపథ్యంలో అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసిన డాక్టర్ ‘జై మతాజీ’ అని అంటుంది. అంటే, కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆడ పిల్ల అని కోడ్ లాంగ్వేజ్‌లో చెబుతుంది. దీంతో తన తండ్రి నుంచి కడుపులో బిడ్డను కాపాడుకొనేందుకు రణ్‌వీర్, షాలినీలు ఇల్లు వదిలిపారిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది తెరపైనే చూడాలి. ఈ చిత్రాన్ని మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. 

అయితే, ట్రైలర్‌లో అల్ట్రాసౌండ్ టెక్నాలజీలో లింగ నిర్ధరణ చేయడంపై అడ్వకేట్ పవన్ ప్రకాష్ పాఠక్ ద్వారా యూత్ ఎగైనెస్ట్ క్రైమ్ అనే ఎన్జీవో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. ప్రసవానికి ముందు లింగనిర్ధారణ వంటి చర్యలను తేలికగా తీసుకోకూడదని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.  ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ, న్యాయమూర్తి నవీన్ చావ్లాతో కూడిన ధర్మాసనం ఈ ట్రైలర్‌ను వీక్షించింది.

Also Read: నాగార్జునకు ముద్దు పెట్టిన అషురెడ్డి - ఏం చెప్పిందో తెలుసా?

ఈ కేసు దాఖలు చేసిన పిటిషనర్ మాట్లాడుతూ.. “అల్ట్రాసౌండ్ క్లినిక్ దృశ్యంలో లింగ నిర్ధరణ అంశాన్ని సెన్సార్ చేయకుండా చూపించారు. ఇది సెక్షన్ 3, 3A, 3B, 4, 6 ప్రకారం ఇది నేరం. PC & PNDT చట్టంలోని సెక్షన్ 22 ఇందుకు అనుమతించదు. అందుకే ఈ పిల్ దాఖలు చేశాం’’ అని తెలిపారు. అయితే, ఈ చిత్రాన్ని సామాజిక కోణంలోనే తెరకెక్కించారు. ఆడ పిల్లలను కాపాడాలనే కాన్సెప్ట్‌తో నూతన దర్శకుడు దివ్యాంగ్ ఠక్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా ట్రైలర్‌లో డిస్‌క్లైమర్‌ను పెట్టామని చిత్ర నిర్మాతల తరపు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం ఈ కేసుపై వాదనలు కొనసాగుతున్నాయి. 

Also Read: చీపురు పుల్లలతో చిరు, చెర్రీ కోసం సర్‌ప్రైజ్ గిఫ్ట్ - ఆ టాలెంట్‌కి రామ్ చరణ్ ఫిదా, ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదం

‘జయేష్ భాయ్ జోర్దార్’ ట్రైలర్: 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
Holidays in January: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Embed widget