By: ABP Desam | Updated at : 10 May 2022 02:17 PM (IST)
Image Credit: Disney+Hotstar
‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ షోలో నామినేషన్స్ వాడివేడిగా సాగుతున్నాయి. అయితే, ఈసారి నామినేషన్స్ భిన్నంగా ఉన్నాయి. ప్రతివారం ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరు హౌస్ మేట్స్‌ను మాత్రమే నామినేట్ చేసేవారు. ఈసారి మాత్రం ఒక్కొక్కరు ముగ్గురిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు.
నామినేషన్స్ నేపథ్యంలో ఇప్పుడు ‘బిగ్ బాస్’ హౌస్ హాట్ హాట్‌గా ఉంది. సోమవారం బిందు నటరాజ్, అఖిల్, మిత్రాను నామినేట్ చేసింది. ఈ సందర్భంగా అఖిల్, బిందుల మధ్య వాడీవేడి వాదన జరిగింది. ‘‘నేను ఒకటి మాట్లాడితే తాను ఇంకొకటి అన్ సింక్‌లో మాట్లాడుతుందని అఖిల్ అంటే.. ‘‘నీకు బుర్రలేదు కదా.. ఉంటే నీకు నేను మాట్లాడేది అర్ధమౌతుంది’’ అని బిందు కామెంట్ చేసింది. ఆ తర్వాత ఆమె నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసింది. దీంతో ఎప్పటిలాగానే ఆయన తన నోటికి పని చెప్పాడు.
‘‘బిందు వాళ్ల ఫాదర్ కి చెబుతున్నా.. ఈమెకి జ్ఞానాన్ని నేర్పించండి ప్లీజ్’’ అని అన్నాడు. ‘‘నా తండ్రిని గురించి మాట్లాడొద్దు..’’ అని బిందు సీరియస్‌గానే చెప్పింది. దీంతో నటరాజ్ మాస్టర్ మరింత రెచ్చిపోయారు. ‘‘నేను నీలాగా దొంగమాటలు మాట్లాడను. నీ యాటిట్యూడ్ నువ్వు.. ఒక తెలుగమ్మాయికి ఉండాల్సిన లక్షణమే లేదు’’ అని పర్శనల్ ఎటాక్ చేశఆడు. ‘‘నేను చాలా స్ట్రాంగ్ ఆడాను.. నీలా నేను బెడ్‌పై కూర్చుని కాళ్లు ఊపుతూ కూర్చోలేదు’’ అని బిందుపై ఫైర్ అయ్యాడు. ఆమె అతడి మీదకు వెళ్తూ ‘‘గో..’’ అని అంది. దీంతో మాస్టర్ కూడా ఆమె మీదికి మీదికి వెళ్లడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది.
మంగళవారం నామినేట్ చేసే అవకాశం నటరాజ్ మాస్టర్‌కు లభిచింది. దీనికి సంబంధించిన ప్రోమోను ‘డిస్నీ హాట్ స్టార్’ విడుదల చేసింది. నటరాజ్ బిందు, బాబా మాస్టర్, అరియానాలను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా బిందు, నటరాజ్‌ల మధ్య వాగ్వాదం నెలకొంది. ‘‘నెగటివిటీ కంప్లీట్‌గా ఉన్న ఓన్లీ వన్ పర్శన్ నువ్వు మాత్రమే’’ అని నటరాజ్ వ్యాఖ్యానించాడు. ‘‘నీ సైడ్ నుంచి ఏమి వచ్చింది ఇన్ని రోజులు? పాజిటివిటీనా?’’ అని బిందు మాధవి ఎదురు ప్రశ్నించింది. ‘‘ఇప్పటివరకు బిందు చేసినవన్నీ దొంగ నామినేషన్లే’’ అని కెమేరాల వైపు తిరిగి నటరాజ్ చెప్పాడు. కెమేరాలకు ఎందుకు చెబుతున్నారని బిందు మాధవి అడిగితే.. ‘‘నీ ఫేస్ చూడలేక కెమేరాలకు చెబుతున్నా. నీ కళ్లు ఎక్కడ బయటకు వచ్చేస్తాయో, నరాలన్నీ ఎక్కడ పగిలిపోతాయో అని భయమేసి.. నేను అటగు చూస్తున్నా. ‘‘శూర్పణక నీ టైమ్ ఆసన్నమైంది. ఇదిగో లక్ష్మణ బాణం. ఆడియన్స్ నీ ముక్కు కోస్తారు’’ అని నటరాజ్ కామెంట్ చేశారు. దీంతో బిందు మాధవీ ఏమీ మాట్లాడకుండా దుర్గ మాత పోజులో నటరాజ్‌కు సమాధానం ఇచ్చింది. ఈ ప్రోమో చూసి నెటిజనులు నటరాజ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాస్త ఓవర్‌గా మాట్లాడుతున్నారని అంటున్నారు.
Also Read: తెలుగమ్మాయి లక్షణాలే లేవు - బిందు మాధవిపై మండిపడ్డ నటరాజ్ మాస్టర్
BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?
Monkey Selfie With Abijeet: అభిజీత్‌తో కోతి సెల్ఫీ - ఆ ఫొటో కోతే తీసిందట!
Archana Gautam: ప్రియాంక గాంధీ పీఏపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు, కేసు నమోదు చేసిన పోలీసులు
Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?
Ashu Reddy : అషు రెడ్డి బికినీ రేటు ఎంతో తెలుసా? - ఆ 'విక్టోరియా సీక్రెట్' కొనొచ్చా?
Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి
KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం
Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?