Devara Glimpse : 'దేవర' గ్లింప్స్‌పై ఆసక్తికర అప్‌డేట్ - రన్ టైమ్ ఎంతో తెలుసా?
Devara : దేవర గ్లింప్స్ ని సుమారు 72 సెకన్ల నిడివితో కట్ చేశారట కొరటాల శివ. జనవరి 8 న గ్లింప్స్ రిలీజ్ కాబోతోంది.
NTR's Devara Glimpse Latest Update : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' సినిమాపై ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆచార్య తో డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ దేవర ప్రాజెక్ట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్‌తో పాటూ బలమైన కథని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాడు. ఈ సినిమా కోసం కెన్నీ బెట్స్ లాంటి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ మూవీతో తెలుగు వెండితెరకి హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాపై ఆడియన్స్ లో ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచేందుకు జనవరి 8న 'దేవర' గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ సైతం ’దేవర’ గ్లింప్స్ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ గ్లింప్స్ కి సంబంధించి ఓ అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే, ’దేవర’ గ్లింప్స్ ని 72 సెకండ్ల నిడివితో కట్ చేశారట కొరటాల శివ. ఈ 72 సెకండ్ల గ్లింప్స్ లో విజువల్స్ అందరినీ అబ్బురుపరిచే విధంగా ఉంటాయని అంటున్నారు. ‘దేవర’ సినిమాలో ఎక్కువ శాతం గ్రాఫిక్స్, VFX, CG వర్క్ ఉండబోతోంది. టెక్నికల్ పరంగా కూడా ఎక్కడా మిస్టేక్ జరగకూడదని అన్నీ సరిగ్గా చెక్ చేసాకే గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నారు.
ఈ గ్లింప్స్ వీడియోతో సినిమా ఎంత గ్రాండ్ స్కెల్ లో ఉండబోతోందో చెప్పబోతున్నారట మూవీ టీమ్. మరోవైపు దేవర గురించి రీసెంట్ గా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ హాలీవుడ్ మూవీ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ను తలదన్నేలా ‘దేవర’ సినిమా ఉంటుందంటూ సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచేశాడు. డెవిల్ ప్రమోషన్స్ లో దేవర గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.." ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటి వరకు చూసి ఉండరు. సినిమాలో 30 ఫీట్ల లోతున అండర్ వాటర్ సీక్వెన్స్ షూట్ చేశాం. ఇలాంటి సీక్వెన్స్ ఇంతకు ముందు ఏ సినిమాలో చూసి ఉండరు. ఈ సీక్వెన్స్ కోసం ఏకంగా 8 నెలల పాటు పరిశోధన చేశాం. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అనేది హాలీవుడ్ మూవీ. 'దేవర' సినిమా దాన్ని మించి ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. అందులో దేవర పార్ట్-1 వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది.
Also Read : 'గుంటూరు కారం' ట్రైలర్ వచ్చేస్తోంది - గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎప్పుడంటే?