7/G Brundavan Colony Sequel : '7/G బృందావన కాలనీ' సీక్వెల్‌లో హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ!
తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కించిన '7/G బృందావన కాలనీ' సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ నటిస్తున్నట్లు సమాచారం.
![7/G Brundavan Colony Sequel : '7/G బృందావన కాలనీ' సీక్వెల్‌లో హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ! 7G Brundavan Colony sequel, Is malayalam actress Anaswara Rajan finalized as heroine? 7/G Brundavan Colony Sequel : '7/G బృందావన కాలనీ' సీక్వెల్‌లో హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/26/d880598606f5e144a24f74710fb7aabf1693038930380753_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కోలీవుడ్ అగ్ర దర్శకుడు సెల్వరాఘవన్ (Selvaraghavan) తెరకెక్కించిన '7/G బృందావన కాలనీ' అప్పట్లో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే సరికొత్త ట్రెండ్ ని సృష్టించిన సినిమా ఇది. రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ మూవీలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. 2004లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. సుమారు 20 సంవత్సరాల తర్వాత దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రానికి సీక్వెల్ (7/g Brundavan Colony Sequel)ని తెరకెక్కిస్తుండగా, మరోసారి రవికృష్ణ ఈ సీక్వెల్లో లీడ్ రోల్ చేస్తున్నాడు.
అంతే కాదు... సీక్వెల్ తోనే హీరోగా రవికృష్ణ (Ravi Krishna) మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టబోతున్నాడు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా అనిత పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది సోనియా అగర్వాల్. అయితే సీక్వెల్లో మళ్లీ సోనియా అగర్వాల్ నటిస్తుందని మొదట్లో వార్తలు రాగా.. తాజా సమాచారం ప్రకారం ఆమె స్థానంలో మరో హీరోయిన్ ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఈసారి '7/G బృందావన కాలనీ' సీక్వెల్లో అనిత పాత్రను మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ రీప్లేస్ చేయబోతుందట. నిజానికి ముందుగా ఈ సీక్వెల్లో 'లవ్ టుడే' మూవీ హీరోయిన్ ఇవానా, అతిథి శంకర్ పేర్లను పరిశీలించారు.
కానీ ఈ ఇద్దరు హీరోయిన్లు కాకుండా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ (Anaswara Rajan) కథానాయికగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ పలు హిందీ, తమిళ సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా త్రిష నటించిన 'రాంగీ' చిత్రంలో కూడా నటించింది. అలాగే హిందీలో 'యారియాన్ 2' లో తన నటనతో మెప్పించింది. ఇక ఇప్పుడు '7/G బృందావన కాలనీ' సీక్వెల్లో హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సీక్వెల్లో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోందనే విషయం తెలియడంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.
కాగా ఈ సీక్వెల్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలుకానున్నట్లు సమాచారం. శ్రీ సూర్య మూవీస్ ఏం రత్నం నిర్మించిన '7/G బృందావన కాలనీ' చిత్రం రవికృష్ణ, సోనియా అగర్వాల్ ఇద్దరి కెరియర్స్ లో మైల్ స్టోన్ మూవీ గా నిలిచిపోయింది. ఈ చిత్రంలో చంద్రమోహన్, సుధా, విజయన్, మనోరమ, సుమన్ శెట్టి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న క్రమంలో '7/G బృందావన కాలనీ' సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సెప్టెంబర్ 22 న ఈ మూవీ థియేటర్స్ లో రీ రిలీజ్ కాబోతోంది. మరి రీ రిలీజ్ లో ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రేయేట్ చేస్తుందో చూడాలి.
Also Read : 'బిగ్ బాస్ సీజన్ 7' కంటెస్టెంట్స్ వీళ్లేనా? లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)