(Source: ECI/ABP News/ABP Majha)
'బిగ్ బాస్ సీజన్ 7' కంటెస్టెంట్స్ వీళ్లేనా? లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
బుల్లితెర ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్ సీజన్ 7' కంటెస్టెంట్స్ కి సంబంధించి తాజాగా ఫైనల్ లిస్ట్ వచ్చింది. సీజన్ సెవెన్ లో ఫైనల్ అయిన కంటెస్టెంట్ల పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన తెలుగులో ఇప్పటివరకు 6 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే ఏడవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఏడవ సీజన్ కు సంబంధించి విడుదలైన ప్రోమోలు షోపై మరింత ఆసక్తి కలిగించాయి. ఈసారి 'బిగ్ బాస్ సీజన్ 7' లో సరికొత్త రూల్స్ , టాస్క్ లతో మరింత ఆసక్తికరంగా ఎవరూ ఊహించిన విధంగా ఉంటుందని నాగార్జున ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఈ షో కోసం బుల్లితెర ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గత కొద్ది రోజులుగా ఈసారి సీజన్లో ఎవరెవరు పాటిస్పేట్ చేస్తున్నారనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్లు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈసారి సీజన్ సెవెన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. ఇక ఇందులో ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నారునేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ లిస్టులో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు అమర్ దీప్. ఇతను 'జానకి కలగనలేదు' అనే సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న నీతోనే డాన్స్ షోలో తన కాబోయే భార్య తేజస్వినితో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాడు. నిజానికి ఈ ఇద్దరూ జోడిగా బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారని మొదట్లో వార్తలు వినిపించాయి.
కానీ తాజా సమాచారం ప్రకారం అమర్దీప్ ఒక్కడే బిగ్ బాస్ హౌస్ లోకి పెడుతున్నారు. ఇక ఆ తర్వాత సీరియల్ నటి శోభా శెట్టి. 'కార్తీకదీపం' సీరియల్ తో ఈమె ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ సెవెన్ కంటెస్టెంట్ గా శోభా శెట్టి ఫైనల్ అయింది. ఇక ఆ తర్వాత 'మొగలిరేకులు' సీరియల్ ఫేమ్ సాగర్, 'జానకి కలగనలేదు' సీరియల్ ఆర్టిస్ట్ ప్రియాంక జైన్, మరో సీరియల్ నటి పూజా మూర్తి, అంజలి పవన్, డాన్స్ మాస్టర్ ఆట సందీప్, యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాస్టార్ట్స్ నుంచి ప్రముఖ యూట్యూబర్ అనిల్ జీల, సీతల్ గౌతమన్ , పల్లవి ప్రశాంత్, రంగస్థలం మహేష్, జబర్దస్త్ నుండి.. బుల్లెట్ భాస్కర్, రియాజ్, తేజ.. టీవీ9 యాంకర్ ప్రత్యూష, ఆకాశవీధిలో హీరో గౌతమ్ కృష్ణ, యాక్టర్ క్రాంతి, సింగర్ దామిని, అన్షు, మోడల్ యవార్.. ఈ 20 మంది కంటెస్టెంట్స్ సీజన్ సెవెన్ లో ఫైనలిస్టులుగా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.
ఈ 20 మందితో పాటు మరో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫైనలిస్టుల్లో షకీలా, హీరో అబ్బాస్, హీరోయిన్ ఫర్జానా వంటి సెలబ్రిటీల పేర్లు లేకపోవడం గమనార్హం. ఇక సెప్టెంబర్ 1, 2 తేదీల్లో షూటింగ్ జరుపుకొని సెప్టెంబర్ 3వ తేదీ ఆదివారం రోజున 'బిగ్ బాస్ సీజన్ 7' స్టార్ మా లో టెలికాస్ట్ కానుంది. ఈ ప్రారంభ ఎపిసోడ్ ని నిర్వాహకులు గత సీజన్ల కన్నా మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు సమాచారం.
Also Read : మలైకా టీ షర్ట్ పై బ్రేకప్ కోట్ - అర్జున్ కపూర్ తో బ్రేకప్ పై హింట్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial