50 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రైన ప్రభుదేవ - కీలక నిర్ణయం
50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయ్యాడు ప్రభుదేవా. రెండో భార్యతో తొలి సంతానాన్ని పొందాడు. వీరిద్దరూ 2020 కరోనా సమయంలో గోప్యంగా వివాహం చేసుకున్నారు.
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన మూడేళ్ల క్రితం హిమానీ సింగ్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల ఆయన భార్య హిమానీ సింగ్ పాపకు జన్మనిచ్చింది. ప్రభుదేవా కు ఇప్పటికే ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. కాగా ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత పాపకు తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన మొదటి భార్యతో విడాకుల తర్వాత ప్రభుదేవా ప్రముఖ సినీ నటి నయనతారతో రిలేషన్షిప్ లో ఉన్నాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత వాళ్లు బ్రేకప్ చెప్పుకున్నారు. కొన్నాళ్లు సింగిల్ గానే ఉన్న ప్రభుదేవా ఫిజియోథెరపిస్ట్ అయిన హిమానీ సింగ్ తో డేటింగ్ చేశాడు. తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచారు. తాజాగా హిమానీ పాపకు జన్మనిచ్చిన విషయాన్ని ప్రభుదేవా స్వయంగా ప్రకటించడంతో ఈ వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
అవును నేను తండ్రి అయ్యాను: ప్రభుదేవా
తన భార్య హిమానీ సింగ్ పాపకు జన్మిచ్చిన విషయాన్ని ప్రభుదేవా ఓ ఇంటర్వ్యూలో చోప్పుకొచ్చాడు. తాను ఈ వయసులో మరోసారి తండ్రిని అయ్యానని, చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఇప్పుడు తాను పరిపూర్ణమైన వ్యక్తిని అయ్యాయననే ఫీలింగ్ కలుగుతోందని సంతోషం వ్యక్తం చేశాడు. ఇప్పుడు తాను తన కూతురితో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నానని అందుకే తన పని భారం కూడా తగ్గించుకుంటున్నట్లు చెప్పాడు. ఇప్పటికే తాను చాలా పని చేస్తున్నానని, ఎప్పుడూ అదే థ్యాస లో ఉంటున్నానని ఇప్పుడు తన కుటుంబంతో ఆనందంగా గడపాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు ప్రభుదేవా.
మొదటి భార్యతో విడాకులు, నయనతారతో బ్రేకప్..
ప్రభుదేవా 1995 లో రమ్లత్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా ముగ్గురు అబ్బాయిలు సంతానం కలిగింది. అయితే పెద్ద కొడుకు 2008 క్యాన్సర్ బారిన పడి చనిపోయాడు. తర్వాత కొన్నాళ్లకు వారి భార్యాభర్తల మధ్య వివాదాలు మొదలైయ్యాయి. అప్పటికే ప్రభుదేవా నయనతారతో రిలేషన్షిప్ లో ఉన్నాడనే వార్తలు కూడా వచ్చాయి. ప్రభుదేవా, నయనతారల రిలేషన్షిప్ కు వ్యతిరేకంగా రమ్లత్ కోర్టుకెక్కింది. నయనతారకు వ్యతిరేకంగా తమిళ సంస్కృతికి చెందిన కొన్ని మహిళా సంఘాలు నిరసనలు చేశాయి. మరోవైపు రమ్లత్ కూడా నయనతారను పెళ్లి చేసుకుంటే నిరాహార దీక్ష చేస్తానని బెదిరించింది. అయితే ఈ వివాదాల మధ్య త్వరలో పెళ్లి చేసుకుంటారనుకున్నఈ జంట 2012 లో ఉన్నట్టుండి బ్రేకప్ చెప్పుకున్నారు.
ట్రీట్మెంట్ కోసం వెళ్లి..
ప్రభుదేవా తన రెండో భార్య అయిన ఫిజియోథెరపిస్ట్ ను రహస్యంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన వెన్ను నొప్పిక సంబంధించిన వైద్యం కోసం ఆస్ఫిటల్ కు వెళ్లాడు. అక్కడే హిమానీతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట 2020 కోవిడ్ సమయంలో హిమానీ సింగ్ ను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో వీరిద్దరూ కలసి బయట కనిపించారు. ఇప్పుడు ఈ జంట ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ప్రభుదేవా స్వయంగా వెల్లడించాడు.