అన్వేషించండి
Advertisement
Chiranjeevi: రైతులకు చిరు సెల్యూట్.. ప్రజలను మొక్కలు నాటమంటూ రిక్వెస్ట్..
తన పెరట్లో నాటిన ఆనపకాయ విత్తనం.. పెద్ద పాదుగా మారి, ఇప్పుడు ఆనపకాయలు కాసినట్లుగా తెలిపారు చిరంజీవి.
'పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే, మట్టి నుంచి పంట పండించి, మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి! అలా ఉండేలా మనమే చూసుకోవాలి. వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి నా సెల్యూట్' అంటూ ఓ వీడియోను షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.
తన పెరట్లో నాటిన ఆనపకాయ విత్తనం.. పెద్ద పాదుగా మారి, ఇప్పుడు ఆనపకాయలు కాసినట్లుగా తెలిపారు చిరంజీవి. వాటిని కోసి కూర వండబోతున్నట్లు చాలా ఎగ్జైటింగ్ గా చెప్పారు చిరు. ఒక రైతు తన పంట చేతికి వచ్చాక ఎంత ఆనందిస్తాడో.. అందులో కొంత ఆనందం ఈరోజు పొందుతున్నానంటూ చిరు తను షేర్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రకృతి ఎంత గొప్పది అంటే.. మనం సరదాగా ఒక విత్తనం భూమిలో నాటితే, అది మనకు కడుపునింపే ప్రయత్నం చేస్తుందని చెప్పారు చిరు.
కాబట్టి మీరు కూడా మీ ఇళ్లలో చిన్న ప్రయత్నం చేయండి. చిన్న తొట్టె ఉన్నా చాలంటూ అభిమానులను రిక్వెస్ట్ చేశారు. మనం బజారులో కొనుక్కుని వచ్చే కాయగూరల కంటే.. మన చేతితో పండించిన కూరగాయలు ఎంతో రుచిగా ఉంటాయని.. ఇది సైకలాజికల్ ఫీలింగో.. ఏదో తెలియదని అన్నారు. ప్రస్తుతం చిరు షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' సినిమాలో నటిస్తున్నారు చిరు. దీంతోపాటు 'భోళా శంకర్' సినిమా కూడా సెట్స్ పై ఉంది. రీసెంట్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా ఓకే చేశారు చిరంజీవి.
View this post on Instagram
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
వరంగల్
విజయవాడ
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement