అన్వేషించండి
MAA Elections: చిరు ఓటు నాకే.. మంచు విష్ణు కామెంట్స్..
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఓటు తనకే వేస్తారని.. అధ్యక్ష పదవికి పోటీ చేస్తోన్న మంచు విష్ణు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మంచు విష్ణు కామెంట్స్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఓటు తనకే వేస్తారని.. అధ్యక్ష పదవికి పోటీ చేస్తోన్న మంచు విష్ణు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎన్నడూలేని విధంగా ఈసారి 'మా' ఎలక్షన్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఎలక్షన్స్ కి సంబంధించిన ప్రతి విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక తాజాగా తన ప్యానెల్ ని ప్రకటించిన మంచు విష్ణు ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
'మా' అసోసియేషన్ కి శాశ్వత భవనం లేకపోవడం ఒక్కటే ఇక్కడ సమస్యం కాదని.. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికతే 'మా' భావన నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తానని.. నిర్మాతగా దెబ్బ తిన్నప్పటికీ, అప్పు తీసుకొచ్చి భవనాన్ని నిర్మిస్తానని అన్నారు. అంతేకాదు.. కొత్త నటీనటులు ఎక్కువమంది ఇండస్ట్రీలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటానని.. సీనియర్ నటీనటులకు అన్ని రకాలుగా అందంగా ఉంటానని చెప్పారు. నటీనటుల పిల్లల చదువుల కోసం సాయం అందిస్తానని చెప్పారు.
ఇలా అన్ని విషయాల్లో చాలా క్లారిటీతో ఉన్నానని.. ప్రకాష్ రాజ్ కంటే కూడా తను బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలనని చెప్పారు. అందుకే ఈ పోటీలోకి దిగానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి గారిని కలవలేదని.. నామినేషన్ వేసిన తరువాత మేనిఫెస్టో ప్రకటించి.. చిరంజీవి గారిని కలుస్తానని చెప్పారు. నా విజన్ విన్న తరువాత ఆయన కచ్చితంగా తన ఓటు నాకే వేస్తారనుకుంటున్నా అని కామెంట్స్ చేశారు.
మంచు విష్ణు ప్యానెల్ లో ఎవరెవరు ఏ పదవికి పోటీ పడుతున్నారంటే...
- మంచు విష్ణు - అధ్యక్షుడు
- రఘుబాబు - జనరల్ సెక్రటరీ
- బాబు మోహన్ - ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
- మాదాల రవి - వైస్ ప్రెసిడెంట్
- పృథ్వీరాజ్ బాలిరెడ్డి - వైస్ ప్రెసిడెంట్
- శివబాలాజీ - ట్రెజరర్
- కరాటే కల్యాణి -జాయింట్ సెక్రటరీ
- గౌతమ్ రాజు-జాయింట్ సెక్రటరీ
ఇక మంచు విష్ణు ప్యానెల్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పోటీ పడుతున్నవాళ్లు.. : అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మలక్ పేట్ శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖా, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివనారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వర్ణ మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఎమ్ఆర్సి
Also read: సాయిపల్లవిలాంటి డ్యాన్సర్ ను ఎప్పుడూ చూడలేదు... ట్వీట్ లో మహేష్ ప్రశంసలు, చైతూ రెస్పాన్స్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా





















