News
News
X

Chiranjeevi: చిరంజీవి బాలీవుడ్ చిత్రాలివే, ఆ సినిమా తర్వాత ఉత్తరాదికి దూరం!

మెగాస్టార్ చిరంజీవి కేవలం తెలుగు సినిమాలే కాదు, బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. కానీ, సక్సెస్ కాలేకపోయారు ఎందుకు?

FOLLOW US: 
టాలీవుడ్ లో తిరుగులేని హీరో చిరంజీవికి ఎందుకో బాలీవుడ్ పెద్దగా అచ్చిరాలేదు . హీరో గా పీక్ స్టేజ్ లో ఉండగానే హిందీలో మూడు సినిమాల్లో నటించారు చిరు. అయితే అవన్నీ రీమేకులే. అవి హిట్ సినిమాలుగా నిలిచాయి కూడా. అయితే చిరంజీవి రేంజ్ బ్లాక్ బస్టర్ లు మాత్రం కాదు. దానికి కారణాలు అనేకం. చిరు చేసిన మూడు సినిమాలూ వాటి ఒరిజినల్ భాషల్లో సంచలనం సృష్టించిన మూవీస్ కావడం విశేషం . 

1) ప్రతిబంద్ 

రిలీజ్: 28 సెప్టెంబర్ 1990

ఒరిజినల్: అంకుశం

కోడి రామకృష్ణ దర్శకత్వంలో డా.రాజశేఖర్ హీరోగా 1989లో వచ్చిన అంకుశం సెన్సేషన్ సృష్టించింది . ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను అంత  పవర్ ఫుల్ గా చూపిన సినిమా అప్పటివరకూ తెలుగులో రాలేదు. రాజశేఖర్ ఆ ఒక్కసినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు . రామిరెడ్డి విలనీ ప్రేక్షకులని భయపెట్టింది  . "స్పాట్ పెడతా" అంటూ రామిరెడ్డి చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. ఎంతో ముచ్చటపడి  ఈ సినిమాను హిందీలో ప్రతిబంద్ గా  రీమేక్ చేశారు చిరంజీవి. గీతా ఆర్ట్స్ పేరుమీద అల్లుఅరవింద్ ప్రొడ్యూస్ చేసిన ‘ప్రతిబంద్’కి తెలుగు డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా జుహీచావ్లా హీరోయిన్ గా నటించారు. తెలుగులో నటించిన రామిరెడ్డి హిందీలోనూ విలన్ గా నటించారు. తెలుగులో లాగానే హిందీలోనూ ఈ సినిమా పెద్ద హిట్ కావడమే కాకుండా నార్త్ ప్రేక్షకులను చిరంజీవిని పరిచయం చేసింది . ఈ సినిమా తరువాత చిరంజీవి నటించిన తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ చేయడం మొదలెట్టారు అక్కడి నిర్మాతలు. రామిరెడ్డి ఈ సినిమాతో హిందీలో పాపులర్ విలన్ లలో ఒకరుగా మారిపోయారు.
 

2) ఆజ్ కా గుండా రాజ్ 

 రిలీజ్ : 10 జూలై  1992

 ఒరిజినల్: గ్యాంగ్ లీడర్ 

 
చిరంజీవి కెరీర్ లో గ్యాంగ్ లీడర్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. యాక్షన్,సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ, సాంగ్స్,ఫైట్స్ ఇలా అన్నీ పక్కాగా కుదిరిన పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మాస్ కమర్షియల్ సినిమాలకు ఒక టెక్స్ట్ బుక్ లాంటిది ఈ సినిమా. విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఏ సినిమాలో రావు గోపాల రావు, ఆనంద్ రాజ్, వల్లభనేని జనార్దన్, మురళీమోహన్ లు నటించగా, తమిళ హీరో శరత్ కుమార్ చిరంజీవికి ఒక అన్నగా కనిపించారు. బప్పీలహరి పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్. ముఖ్యంగా ‘‘వానా వానా వెల్లువాయే’’ పాటను ఆడియన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. ఈ సినిమా సక్సెస్ గురించి విన్న హిందీ ప్రొడ్యూసర్ ఎన్ ఎన్  సిప్పీ హిందీలో రీమేక్ చేశారు. రీమేక్ కింగ్ గా పేరున్న రవిరాజా పినిశెట్టి నే దీనికి కూడా దర్శకుడిగా ఎంచుకున్నారు. హిందీలో గ్లామర్ రోల్స్ లో దూసుకు పోతున్న మీనాక్షి శేషాద్రి హీరోయిన్ కాగా ఆనంద్ మిలింద్ ద్వయం మ్యూజిక్ ఇచ్చారు. అయితే తెలుగులో బప్పీ లహరి ఇచ్చిన మ్యూజిక్ తో పోలిస్తే హిందీ రీమేక్ సాంగ్స్ ఆ స్థాయి హిట్స్ కాలేదు. సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఏకంగా రూ.2.75 కోట్లు వసూల్ చేసింది. ఆరోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. 

3) ది  జెంటిల్ మేన్

రిలీజ్ : 18 నవంబర్ 1994 

ఒరిజినల్  జెంటిల్ మేన్ 

చిరంజీవి చివరిసారిగా నటించిన  స్ట్రయిట్ హిందీ సినిమా ది  జెంటిల్ మెన్. 30 జూలై  1993న తమిళంలో రిలీజ్ అయిన జెంటిల్ మేన్ ఒక చరిత్ర. భారీ చిత్రాల దర్శకుడు శంకర్, యాక్షన్ హీరో అర్జున్, మ్యూజిక్ లెజెండ్ ఏ ఆర్ రెహమాన్ కలిసి అందించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ జెంటిల్ మేన్  సినిమా . ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తెలుగులో డబ్  చేస్తే ఇక్కడా సూపర్ హిట్టే . ఈ సినిమా చూసి ఎంతో  ఎగ్జైట్ అయిన చిరంజీవి దీన్ని హిందీ లో రీమేక్ చెయ్యాలనుకున్నారు  గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన  ఆ సినిమానే ది  జెంటిల్ మేన్ . హిందీ ప్రేక్షకులకు తగ్గట్టుగా చిన్నచిన్న మార్పులతో వచ్చిన ఈ సినిమా కు అను మాలిక్ సంగీతం అందించగా.. కొన్ని ట్యూన్స్ ఏఆర్ రెహ్మాన్ వి వాడుకున్నారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. 

ఆ తరువాత బాలీవుడ్ పై దృష్టి పెట్టని చిరంజీవి

బాలీవుడ్‌లో చేసిన మూడు సినిమాలూ హిట్టే అయినా .. చిరంజీవి స్టార్ డమ్ కు సరిపోయే బ్లాక్ బస్టర్స్ అయితే కావన్నది సాధారణ మెగా ఫ్యాన్ అభిప్రాయం. ఆ పైగా ఇప్పటిలా పాన్ ఇండియా కల్చర్ మొదలుకాలేదు . అక్కడి నిర్మాతల లాబీయింగ్ వేరు. సౌత్ అంటే చిన్నచూపు.. చిరంజీవి అంటే అసూయ వాళ్లలో ఉన్నట్టు అప్పటి చిరు అభిమానులు చెబుతూ ఉంటారు. మరోవైపు సరిగ్గా ఆ సమయంలోనే తెలుగులో చిరంజీవి నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. ఆ ఏడాదే తెలుగులో రిలీజ్ అయిన సొంత సినిమా ముగ్గురు మొనగాళ్లు యావరేజ్ అయితే శ్రీదేవితో కలిసి నటించిన  ఎస్పీ పరశురామ్ భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది . ఆపై ఏడాది రిలీజ్ అయిన ‘అల్లుడా మజాకా’ హిట్ అయినా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వల్ల  తీవ్ర వివాదాస్పదం అయి ఇకపై ఇలాంటి సినిమా చెయ్యను అని స్వయంగా చిరంజీవి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ పరిణామాల వల్ల  చిరంజీవి హిందీ మార్కెట్ పై తన దృష్టిని పెట్టలేదు. చాలా ఏళ్ల తరువాత  లేటెస్ట్ గా రామ్ చరణ్ నిర్మాతగా వచ్చిన మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ సైరా ను హిందీలో కూడా రిలీజ్ చేసారు . అయితే అది కూడా అక్కడ మెగాస్టార్ రేంజ్ హిట్ కాలేదు . దానితో బాలీవుడ్ తమ చిరంజీవికి అచ్చిరాలేదని మరోసారి రుజవైంది అంటుంటారు ఆయన ఫ్యాన్స్.  అయితేనేం ఆయన తనయుడు, సినీరంగ వారసుడు రామ్ చరణ్ మాత్రం తన RRR సినిమాలలోని అల్లూరి సీతారామరాజు పాత్రతో బాలీవుడ్ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు . దీనితో అక్కడ ఆయనకు పెద్ద మార్కెట్ ఏర్పడింది. మొత్తానికి చిరంజీవి కల ఈ విధంగా నెరవేరుతోందని అనుకోవచ్చు. 
Published at : 22 Aug 2022 12:39 AM (IST) Tags: chiranjeevi Chiranjeevi Birthday Chiranjeevi movies kondaveeti donga Kodama Simham Jagadeeka Veerudu Atiloka Sundari

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Puri Jagannadh: పూరి జగన్నాథ్ ను నమ్మి మరో ఛాన్స్ ఇస్తాడా?

Puri Jagannadh: పూరి జగన్నాథ్ ను నమ్మి మరో ఛాన్స్ ఇస్తాడా?

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

Zodiac Signs: జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి

Zodiac Signs:  జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి