అన్వేషించండి

Chiranjeevi: టాలీవుడ్ నిజంగా కష్టాల్లో ఉందా? చిరు వ్యాఖ్యలపై భిన్న వాదనలు.. భారీ పారితోషకాలు ఎందుకు?

చిరంజీవి చెబుతున్నట్లుగా టాలీవుడ్ నిజంగా కష్టాల్లో ఉందా? మరి, పెద్ద హీరోలు తమ భారీ పారితోషకాలను తగ్గించుకుని నిర్మాతలకు ఎందుకు సహకరించడం లేదు?

‘‘సినిమావాళ్లు కష్టాల్లో ఉన్నారు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒడ్డున పడేసే జీవోలు విడుదల చేయాలి’’  అంటూ ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ‘టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్‌’గా నిలిచాయి. అయితే నిజంగానే సినిమావాళ్లు కష్టాల్లో ఉన్నారా? ప్రభుత్వాలు వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. కరోనా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడిన మాట వాస్తవమే అయితే. ఓటీటీ అనే ప్రత్యామ్నాయం రావడంతో కొత్త టాలెంట్‌కు సరైన వేదిక దొరికింది. చిన్నా చితకా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు తెరుచుకుంటాయా, కలెక్షన్లు ఎప్పుడు మొదలవుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో చిరుపై ట్రోలింగ్ మొదలైంది. 

చిరంజీవి చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ అంతా కష్టాల్లో ఉందా అంటే అనుమానమే. కరోనా తర్వాత జూనియర్ ఆర్టిస్ట్‌లు, ఇతర చిన్నా చితకా నటీనటులు కష్టాలు పడిన మాట వాస్తవమే. సినిమాల షూటింగులు ఆగిపోవడంతో చాలా వరకు అవకాశాలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు పరిస్థితి చక్కబడినా సినిమాల రిలీజులకు పూర్తి స్థాయిలో అనుకూల పరిస్థితులు లేవు. అటు తెలంగాణలో థియేటర్లు తెరచుకున్నా హౌస్ ఫుల్ కావడంలేదు. ఏపీలో సగం సీటింగ్‌కే పరిమితి ఉంది. అందులోనూ సెకండ్ షో లకు అనుమతులు లేకపోవడంతో థియేటర్లలోకి వచ్చేందుకు అందరూ వెనకడుగేస్తున్నారు. ఈ దశలో థియేటర్లలోకి వచ్చిన తొలి పెద్ద సినిమాగా ‘సీటీమార్’ పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఇప్పుడు ‘లవ్ స్టోరీ’ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ‘లవ్ స్టోరీ’కి వచ్చే రెస్పాన్స్ చూసి మిగతా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ జర్నీకి సిద్ధమవుతాయని తెలుస్తోంది. 

చిరంజీవి ఆచార్య సినిమా సహా పలు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వరుసగా వాయిదాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడాలని అనుకూలంగా జీవోలు విడుదల చేయాలని బహిరంగ వేదికలపైనే చిరంజీవి ప్రస్తావించడం సంచలనంగా మారింది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. చిరంజీవి ‘ఆచార్య’ సినిమాకు నిర్మాత కావడం వల్లే ఆయన ఇంత టెన్షన్ పడుతున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నిర్మాత కావడం వల్లే చిరంజీవి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్ కోరుతున్నారని అంటున్నారు. 

రెమ్యునరేషన్ ఎందుకు పెంచారు..?: కరోనా కష్టకాలంలో నిర్మాతలకు సహకరించాలని, థియేటర్ ఓనర్లకు లాభాలు చేకూర్చాలని అంటున్న పెద్ద హీరోలు తమ రెమ్యునరేషన్ ఎందుకు పెంచారనేది సమాధానం లేని ప్రశ్నగా మిగులుతోంది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే సమయంలో పవన్ కల్యాణ్ భారీగా తన పారితోషికం పెంచేశారు. వకీల్ సాబ్ కోసం ఆయన 50 కోట్ల రూపాయలు తీసుకున్నారట. దీంతో నిర్మాత దిల్ రాజు ఇతర విషయాల్లో ఖర్చు మిగుల్చుకున్నారు. చిరంజీవి సహా ఇతర స్టార్ హీరోలు తమ పారితోషికం తగ్గించుకుంటే నిర్మాతలు సేఫ్ సైడ్ ఉన్నట్టే. మరి ఆ దిశగా చిరంజీవి ఎందుకు ఆలోచించట్లేదు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

టికెట్ల రేట్లు ఎందుకు పెంచాలి..?: ప్రస్తుతం ఏపీలో టికెట్ల రేట్లపై ప్రభుత్వం సీలింగ్ విధించింది. ప్రభుత్వం తరపున ఆన్ లైన్ వేదికగా టికెట్లు అమ్మేందుకు ఓ ఆన్ లైన్ వేదిక తీసుకొస్తున్నారు. ఇది ఇండస్ట్రీకి నష్టం కలిగిస్తుందని టాలీవుడ్ ప్రముఖులు భావిస్తున్నారు. అయితే ప్రేక్షకుల వాదన మరోలా ఉంది. సినిమాలకు భారీగా ఖర్చు పెట్టడం ఎందుకు..? టికెట్ రేట్లు పెంచాలని అడగటం ఎందుకు..? అని నిలదీస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వచ్చే భారీ బడ్జెట్ సినిమాల్లో సగం ఖర్చు హీరోల రెమ్యునరేషన్‌కే సరిపోతోంది. దీన్ని నిలువరించాలని డిమాండ్లు వినపడుతున్నాయి. మరోవైపు పేద ప్రజలకు, రైతులకు కరెంటు బిల్లుల్లో రాయితీ ఇవ్వాలి కానీ, పక్కా వ్యాపారంగా నడిచే థియేటర్ల బిజినెస్ కి రాయితీ ఎందుకివ్వాలని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యలతో మరోసారి తెలుగు ఇండస్ట్రీలో ఖర్చుల తగ్గింపు అనే విషయం తెరపైకి వచ్చింది. ప్రభుత్వాలు ఇండస్ట్రీకి సాయం చేయాల్సిన విషయాన్ని పక్కనపెట్టి, హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవాలనే డిమాండ్ మొదలైంది. అలా చేస్తేనే ఇండస్ట్రీ బాగుపడుతుందని, ప్రభుత్వాలు ఆదుకోడానికి ఇండస్ట్రీలో నిరుపేద నిర్మాతలెవరూ లేరని అంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget