అన్వేషించండి

Chiranjeevi Guinness World Record: గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్‌‌లో చిరంజీవి - అభినందనలు తెలిపిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

Guinness World Record @ Chiru : మెగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్‌ అవార్డు 45 ఏళ్ల సినీ కెరీర్లో 24 వేలకు పైగా డాన్స్ మూవ్‌మెంట్స్‌ అమిర్ చేతుల మీదగా అవార్డు సీఎంల అభినందనలు

Guinness World Record @ Chiru: మెగాస్టార్ చిరంజీవి.. తన 45 ఏళ్ల కెరీర్‌లో 24 వేల డాన్స్ మూవ్‌మెంట్స్ చేసినందుకు.. ఆయనకు గిన్నీస్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్‌ నటుడు అమిర్‌ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డును మెగాస్టార్ అందుకున్నారు. చిరంజీకి ఈ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

డాన్స్‌పై ఉన్న ఇష్టమే తనను ఇక్కడి వరకూ తీసుకొచ్చిందన్న మెగాస్టార్‌:

            మెగాస్టార్ చిరంజీవి తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో .. 156 సినిమాల్లో 537 పాటల్లో దాదాపు 24 వేలకు పైగా వివిధ డాన్స్ మూవ్‌మెంట్స్ చేశారు. ఇందుకు గానూ గిన్నీస్‌ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఆయనకు చోటు దక్కింది. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో.. అమిర్‌ఖాన్ చేతుల మీదగా గిన్నీస్ బుక్ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవికి ఈ రికార్డు ను అందించారు. చిన్న నాటి నుంచి తనకు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమన్న చిరంజీవి.. చిన్నతనంలో రేడియోలో పాటలు వింటూ డాన్స్ చేసేవాడినని చెప్పారు. ఆ తర్వాత ఎన్‌సీసీలో చేరిన తర్వాత.. రాత్రిళ్లు భోజనం ప్లేట్‌తో దరువేస్తూ డాన్స్ చేసేవాడినని నాటి రోజులను చిరంజీవి జ్ఞాపకం చేసుకున్నారు.

డాన్స్ చేస్తూ పడి కాలుకు దెబ్బతగిలితే.. ఆ తర్వాత వేసిన స్టెప్పులునాగిని డాన్స్‌గా మారాయని చిరంజీవి చెప్పారు. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో తనను సావిత్రి, రోజారమణి, నరసింహరాజు ప్రోత్సహించారని.. వారి ప్రోద్బలంతోనే ప్రాణం ఖరీదు సినిమాలో డైరెక్టర్‌ క్రాంతికుమార్ నా కోసం ఓ డ్యూయెట్ పెట్టీ స్టెప్పులు వేయించడంతో తన ప్రయాణం ఇక్కడి వరకూ వచ్చిందన్నారు. పునాదిరాళ్లు సినిమాతో నా డ్యాన్స్ ప్రధాన ఆకర్షణగా మారిందన్నారు. నిర్మాత అశ్వనీదత్‌ అల్లు అరవింద్ ప్రతి సినిమాలో ఆరు పాటలు ఉండేలా చూసే వాళ్లని వారితో పాటు తనతో పనిచేసిన దర్శక నిర్మాతలకు, హీరోయిన్లకు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్లకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.

చిరంజీవికి నేను అభిమానిని: అమీర్‌ఖాన్‌

            ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన అమీర్‌ఖాన్‌కు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమిర్‌.. తాను చిరంజీవికీపెద్ద అభిమానిని అని తెలిపారు. ఆయన ఈ కార్యక్రమానికి రావాలని రిక్వెస్ట్ చేస్తే.. తాను ఆర్డర్ వేయండన్నానని చిరుపై తన అభిమానాన్ని అమిర్ గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ప్రతి పాటకు ప్రాణం పెట్టి డ్యాన్స్ వేస్తారని, ఆయన తన సోదర సమానులని అమిర్‌ అన్నారు.  ఈ కార్యక్రమంలో అశ్వనీదత్‌, రాఘవేంద్రరావుతో పాటు తెలుగు చిత్రపరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు.

చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు:

            గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన చిరంజీవికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇది తెలుగు వారి గర్వించదగ్గ అంశంగా పేర్కొన్నారు. చిరంజీవికి గిన్నీస్‌ బుక్‌లో చోటు లభించడం పట్ల శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. చిరంజీవి తన గ్రేస్‌తో తెలుగు సినిమాను మరో ఎత్తులకు తీసుకెళ్లడంతో తిరుగులేని కృషి చేశారని అన్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anantapur Court: వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 
వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 
SC Verdict: చైల్డ్‌ పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కింద నేరమే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు:
చైల్డ్‌ పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కింద నేరమే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు:
Telangana News: తెలంగాణలో ప్రతి కుటుంబాని, ప్రతి వ్యక్తికి డిజిటల్ కార్డులు- వాటి ద్వారానే సంక్షేమ పథకాలు అందజేత!
తెలంగాణలో ప్రతి కుటుంబాని, ప్రతి వ్యక్తికి డిజిటల్ కార్డులు- వాటి ద్వారానే సంక్షేమ పథకాలు అందజేత!
Andhra Pradesh: రాజకీయ అష్టదిగ్బంధనంలో వైఎస్‌ జగన్- వైసీపీ అధినేతకు ఊపిరి తీసుకోనివ్వని సవాళ్లు
రాజకీయ అష్టదిగ్బంధనంలో వైఎస్‌ జగన్- వైసీపీ అధినేతకు ఊపిరి తీసుకోనివ్వని సవాళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Three Medical Students Washed Away | అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో విషాదం | ABP DesamChiranjeevi Guinness Book of Records | గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి మెగాస్టార్ చిరంజీవి | ABPRishabh Pant Funny Banter Bangladesh | Ind vs Ban టెస్టులో బంగ్లా పులులకు పంత్ ట్రోలింగ్ తాకిడి |ABPInd vs Ban First Test Result | బంగ్లా పులులను పరుగులుపెట్టించిన చెన్నై చిరుత | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anantapur Court: వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 
వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 
SC Verdict: చైల్డ్‌ పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కింద నేరమే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు:
చైల్డ్‌ పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కింద నేరమే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు:
Telangana News: తెలంగాణలో ప్రతి కుటుంబాని, ప్రతి వ్యక్తికి డిజిటల్ కార్డులు- వాటి ద్వారానే సంక్షేమ పథకాలు అందజేత!
తెలంగాణలో ప్రతి కుటుంబాని, ప్రతి వ్యక్తికి డిజిటల్ కార్డులు- వాటి ద్వారానే సంక్షేమ పథకాలు అందజేత!
Andhra Pradesh: రాజకీయ అష్టదిగ్బంధనంలో వైఎస్‌ జగన్- వైసీపీ అధినేతకు ఊపిరి తీసుకోనివ్వని సవాళ్లు
రాజకీయ అష్టదిగ్బంధనంలో వైఎస్‌ జగన్- వైసీపీ అధినేతకు ఊపిరి తీసుకోనివ్వని సవాళ్లు
US Indians : అమెరికాలో ఉద్యోగం పోతే 60 రోజులే గడువు -  లేఆఫ్‌లతో విలవిల్లాడిపోతున్న ఇండియన్స్ - వెనక్కి రాక తప్పదా ?
అమెరికాలో ఉద్యోగం పోతే 60 రోజులే గడువు - లేఆఫ్‌లతో విలవిల్లాడిపోతున్న ఇండియన్స్ - వెనక్కి రాక తప్పదా ?
EY employee Death : కార్పొరేట్ ప్రపంచాన్ని కదిలిస్తున్న EY ఉద్యోగిని మృతి అంశం - వర్క్ ప్లేస్, కల్చర్‌లో సమూల మార్పులు తప్పవా ?
కార్పొరేట్ ప్రపంచాన్ని కదిలిస్తున్న EY ఉద్యోగిని మృతి అంశం - వర్క్ ప్లేస్, కల్చర్‌లో సమూల మార్పులు తప్పవా ?
Garikipati Narasimha Rao: కర్ణుడు, అశ్వత్థామ హీరోలు... కృష్ణుడ, భీముడు విలన్లా? - ‘కల్కి 2898 ఏడీ’పై గరికపాటి సెన్సేషనల్ కామెంట్స్
కర్ణుడు, అశ్వత్థామ హీరోలు... కృష్ణుడ, భీముడు విలన్లా? - ‘కల్కి 2898 ఏడీ’పై గరికపాటి సెన్సేషనల్ కామెంట్స్
Tirupati Laddu Row: ఆలయాలను భక్తులు నడపాలి, ప్రభుత్వాలు కాదు- లడ్డూ వివాదంపై సద్గురు జగ్గీ వాసుదేవ్ సంచలన కామెంట్స్
ఆలయాలను భక్తులు నడపాలి, ప్రభుత్వాలు కాదు- లడ్డూ వివాదంపై సద్గురు జగ్గీ వాసుదేవ్ సంచలన కామెంట్స్
Embed widget