Captain Miller: ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్, ఆడియెన్స్ ను అలరించేది ఎప్పుడంటే?
Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ఇప్పటికే ఈ మూవీ తమిళ ప్రేక్షకుల మందుకు రాగా, తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు.
Captain Miller Telugu Release Date: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీని దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ రూపొందించారు. భారీ అంచనాల నడుమ జనవరి 12న తమిళంలో విడుదల అయ్యింది. తెలుగులోనూ ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా, నాలుగు పెద్ద సినిమాలు పోటీ పడటంతో వెనక్కి తగ్గింది. సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. మరో తమిళ చిత్రం ‘అయలాన్’ కూడా తెలుగులో విడుదల కావాల్సి ఉన్నా, వాయిదా పడింది.
ఈ నెల 25న తెలుగులో ‘కెప్టెన్ మిల్లర్’ విడుదల
తాజాగా ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ తెలుగు రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. రిపబ్లిక్ డే కానుకగా ఈ నెల 25న విడుదల చేయబోతున్నారు. ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించి తొలి షో నుంచే మంచి టాక్ లభిస్తోంది. సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు చెప్తున్నారు. ధనుష్ నటన అద్భుతంగా ఉందంటున్నారు. తమిళ సినిమా పరిశ్రమలో రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత అదే స్థాయిలో నటించే సత్తా ఉన్న నటుడు ధనుష్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
#CaptainMiller is set for a grand release in Andhra Pradesh and Telangana by @SureshProdns and @AsianCinemas_ 🔥
— Suresh Productions (@SureshProdns) January 12, 2024
Releasing in theatres on Jan 25th!@dhanushkraja #ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/GuZDej5Q5W
Ultimate and outrageous moment of the movie….. Shivanna having jolly entry which make stronger entry than Jailer…….
— ︻デᏉᎥᏢᎬᏒ═一 (@viperbravo45) January 12, 2024
#CaptainMiller #Dhanush #CaptainMillerFDFS pic.twitter.com/xPTjtaRZhH
డెకాయిట్ గా ఆకట్టుకున్న ధనుష్
‘కెప్టెన్ మిల్లర్’తో దర్శకుడు అరుణ్ తనలోని క్రియేటివిటీని ప్రేక్షకులకు చూపించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. స్టోరీ టెల్లింగ్ లో ఆయన నైపుణ్యం అద్భుతంగా ఉందంటున్నారు. ఈ సినిమా 1930 నాటి కథాంశంతో రూపొందింది. వెనుకబడిన వర్గానికి చెందిన ఓ యువకుడు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరి ‘కెప్టెన్ మిల్లర్’ అనే డెకాయిట్ గా ఎలా మారాడు? అనేది ఈ సినిమాలో చూపించారు. ‘కెప్టెన్ మిల్లర్’గా ధనుష్ కనబర్చిన నటన మరో లెవల్ అంటున్నారు ఆడియెన్స్. ధనుష్ తో పాటు ప్రియాంకా అరుల్ మోహన్ అద్భుతంగా నటించిందంటున్నారు.
Celebration Started in @murugancinema 🥁🔥🔥#CaptainMiller @dhanushkraja pic.twitter.com/vELhprGPKN
— Viswa (@its_ViswaDfan) January 12, 2024
@gvprakash after asuran GV receiveing tremendous response for his BGM & songs in #captainmiller 🔥💆♂️@dhanushkraja pic.twitter.com/aapOkD2I3I
— ꧁•⊹٭𝙷'𝚠𝚘𝚘𝚍𝚊𝚌𝚝𝚘𝚛𝚍𝚑𝚊𝚗𝚞𝚜𝚑٭⊹•꧂ (@sheik____) January 12, 2024
ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, నివేదితా సతీష్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ లో సెంథిల్ త్యాగరాజ్, అరుణ్ త్యాగరాజన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. జనవరి 25న ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగులో విడుదల కానున్న నేపథ్యంలో ధనుష్ అభిమానులతో, మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also: ‘గుంటూరు కారం’లో ఘాటు మిస్సైందా? గురూజీ మడతపెట్టేశారట - ప్రేక్షకుల రివ్యూ ఇది