News
News
X

Alluri: 'అల్లూరి' సినిమాలో బర్నింగ్ ఇష్యూ - కావాలనే రివీల్ చేయలేదా?

'అల్లూరి' సినిమా ట్రైలర్ చూస్తుంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ పోలీస్ కథలా అనిపిస్తోంది.

FOLLOW US: 

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ సినిమా 'అల్లూరి' (Alluri). నిజాయితీకి మారు పేరు... అనేది ఉపశీర్షిక. ఇదొక ఫిక్షనల్ పోలీస్ ఆఫీసర్ బయోపిక్. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. 

నిజానికి ట్రైలర్ చూస్తుంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ పోలీస్ కథలా అనిపిస్తోంది. అయితే కావాలనే సినిమాలో మెయిన్ పాయింట్ ను రివీల్ చేయలేదని అంటున్నారు చిత్రనిర్మాతలు. సినిమాలో ఇప్పటివరకు వెల్లడించని ఒక పాయింట్ ఉందని.. అది కచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్. 

శ్రీవిష్ణు కూడా ఈ పాయింట్ ను నమ్మే సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు శ్రీవిష్ణు తన కెరీర్ లో నటించిన సినిమాలన్నీ వైవిధ్యంతో కూడుకున్నవే. మరి 'అల్లూరి' సినిమాతో ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి..!

'అల్లూరి' కోసం అల్లు అర్జున్:

ఇప్పుడు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. అయితే ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నారు. ఈ విషయాన్ని శ్రీ విష్ణు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అల్లూరి కోసం అల్లు అర్జున్ అంటూ ఓ పోస్ట్ ను షేర్ చేశారు. ఈ మధ్యకాలంలో బన్నీ చాలా సినిమా ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్తూ.. తన సపోర్ట్ అందిస్తున్నారు. ఇప్పుడు శ్రీ విష్ణుని ఎంకరేజ్ చేయడానికి గెస్ట్ గా వెళ్లబోతున్నారు. 

అల్లు అర్జున్ గెస్ట్ అంటే.. ఇక ఆ ఈవెంట్ మొత్తం ఫ్యాన్స్ తో నిండిపోవడం ఖాయం. సెప్టెంబర్ 18న ఈ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకుడు. ఈ సినిమాలో నిజాయతీ గల పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజు పాత్రలో శ్రీ విష్ణు కనిపించనున్నారు.

శ్రీ విష్ణు సరసన కయ్యదు లోహర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సుమన్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూధన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృథ్వీ రాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, 'వెన్నెల' రామారావు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి  ఛాయాగ్రహణం : రాజ్ తోట, కూర్పు : ధర్మేంద్ర కాకరాల, కళ : విఠల్, ఫైట్స్ : రామ్ క్రిషన్, సాహిత్యం : రాంబాబు గోసాల, సమర్పణ : బెక్కెం బబిత, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : నాగార్జున వడ్డే, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ ('ఫిదా' ఫేమ్). 

Also read: కొట్టుకున్నవారికి దక్కని కెప్టెన్సీ - జాలితో అతడిని ‘కెప్టెన్’ చేసేశారు, హౌస్ లో హీరో సుధీర్, కృతి శెట్టి

Also read: నేను ఎప్పటికీ తల్లి కాలేను, పెంచుకున్న పాప చనిపోయింది: ‘కార్తీక దీపం’ కీర్తి భట్ కన్నీటి గాథ

Published at : 17 Sep 2022 03:17 PM (IST) Tags: Allu Arjun Sree Vishnu Alluri Alluri Movie

సంబంధిత కథనాలు

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bigg Boss: బిగ్ బాస్ షోలో అశ్లీలత - ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు!

Bigg Boss: బిగ్ బాస్ షోలో అశ్లీలత - ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

Megastar Chiranjeevi: మరో రీమేక్‌పై చిరు ఫోకస్ - డైరెక్టర్ ఫైనల్ అయినట్లేనా?

Megastar Chiranjeevi: మరో రీమేక్‌పై చిరు ఫోకస్ - డైరెక్టర్ ఫైనల్ అయినట్లేనా?

Masooda Release Date : మూడు భాషల్లో సంగీత హారర్ డ్రామా 'మసూద' - విడుదలకు అంతా రెడీ

Masooda Release Date : మూడు భాషల్లో సంగీత హారర్ డ్రామా 'మసూద' - విడుదలకు అంతా రెడీ

టాప్ స్టోరీస్

Revant Vs KTR : తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Revant Vs KTR :  తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?