అన్వేషించండి

BSS10 Movie First Look Title: బెల్లంకొండ కొత్త సినిమా టైటిల్ ఇదే - దున్నపోతు డైలాగ్ వైరల్ అయ్యేలా ఉందిగా  

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సాగర్ కె చంద్రతో ఆయన చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. టైటిల్ కూడా ఈ రోజు వెల్లడించారు.

కమర్షియల్ అంశాలతో కూడిన ఎంటర్టైనర్ సినిమాలు చేసి యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) విజయాలు అందుకున్నారు. మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. అయితే హిందీలో ప్రభాస్ 'ఛత్రపతి' రీమేక్ చేయడం వల్ల తెలుగు తెరకు మూడు సంవత్సరాల విరామం వచ్చింది. ఇప్పుడు సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ రోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ వెల్లడించారు. 

'టైసన్ నాయుడు'గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్
Tyson Naidu Movie: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు 'టైసన్ నాయుడు' టైటిల్ ఖరారు చేశారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 10వ చిత్రమిది. ఇందులో ఆయన పోలీస్ రోల్ చేస్తున్నారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' తర్వాత సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలతో ఆయన సినిమా రూపొందించినట్లు గ్లింప్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. ''సార్... బాగా బలిసిన దున్నపోతు రంకెలు వేస్తూ మీ ముందుకు వచ్చింది. మీరు గాల్లో ఎగురుతూ ఒక బ్లైండ్ క్లిక్ ఇచ్చారు. అప్పుడు ఏం జరుగుతుంది?'' అని ఒకరు ప్రశ్నిస్తే... ''దున్నపోతు చచ్చిపోతుంది'' అని ట్రైనింగ్ ఇస్తున్న వ్యక్తి సమాధానం చెబుతారు. ఆ డైలాగ్ వైరల్ అయ్యేలా ఉంది. పంజాబ్, సిక్కుల నేపథ్యంలో సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. 

Also Readమహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్... నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో, అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సాగర్ కె చంద్ర 'టైసన్ నాయుడు' సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విజయ్, వెంకట్, రియల్ సతీష్ మాస్టర్లు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

Also Read: ఆ ఓటీటీలో, టీవీలో 'నా సామి రంగ'... డీల్ సెట్ చేసిన కింగ్ నాగార్జున

 

ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: విజయ్ - వెంకట్ - 'రియల్' సతీష్, కళా దర్శకుడు: అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్, ఛాయాగ్రహణం: ముకేశ్ గణేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరీష్ కట్టా, సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థ: 14 రీల్స్ ప్లస్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట, రచన, దర్శకత్వం: సాగర్ కె చంద్ర.

టాప్ హెడ్ లైన్స్

Sreemukhi: శ్రీముఖి ఇగో హర్ట్ అయితే అంతే... 'బిగ్ బాస్'లో పొగరుబోతు ప్రవర్తన - నెట్టింట విమర్శలు
శ్రీముఖి ఇగో హర్ట్ అయితే అంతే... 'బిగ్ బాస్'లో పొగరుబోతు ప్రవర్తన - నెట్టింట విమర్శలు
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
Bigg Boss 10 Telugu: అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ
అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget