Brahmāstra: 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ కి చిరు వాయిస్ ఓవర్ - ఆయన కాళ్లపై పడ్డ బాలీవుడ్ డైరెక్టర్!
జూన్ 15న 'బ్రహ్మాస్త్ర' సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్నారు.
బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాను 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల కానుంది. సెప్టెంబర్ 9న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. పెళ్లి తరువాత అలియా-రణబీర్ జంట నుంచి విడుదల కాబోయే సినిమా ఇదే.
'బ్రహ్మాస్త్ర'లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున అక్కినేని, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రీతం ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి సాయం చేయబోతున్నారు.
జూన్ 15న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. 'ఆ బ్రహ్మస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు అతనే శివ' అంటూ చిరు వాయిస్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. చిన్న వీడియోను వదిలారు. అందులో దర్శకుడు అయాన్.. మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇచ్చిన తరువాత అతడిపై కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. మొత్తం ఐదు భాషల్లో 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: ఆరోజు 'పంజా' ఈరోజు 'మేజర్' - పవన్ మాటలకు అడివి శేష్ రిప్లై
Also Read: పొట్టి బట్టలు వేసుకోవడంతో తప్పు లేదు కానీ - సాయిపల్లవి కామెంట్స్
Happy to announce that @KChiruTweets garu has lent his voice to Brahmāstra Trailer.
— rajamouli ss (@ssrajamouli) June 13, 2022
Telugu Trailer of Brahmāstra will release on June 15th!https://t.co/Rl70nZkaMR
View this post on Instagram