Brahmamudi February 24th: 'బ్రహ్మ' ఆట మొదలైంది- స్వప్న పెళ్లి కాంట్రాక్ట్ కావ్యకి, మరో అమ్మాయితో రాహుల్
స్వప్న, రాజ్ పెళ్లి ఖాయం కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కనకం స్వప్న పెళ్లి చేయడం కోసం ఇంట్లో ఎవరికి తెలియకుండా వడ్డీ వ్యాపారి చంపక్ లాల్ దగ్గరకి వెళ్ళి ఇల్లు తాకట్టు పెడుతుంది. స్వప్న కోసం ఖరీదైన చీరలు తెప్పించడం చూసి కావ్య అంత డబ్బులు ఎక్కడివి అని కావ్య నిలదీస్తుంది. అప్పుడే అప్పు వచ్చి చంపక్ లాల్ ఇంటి దగ్గర కనిపించావ్ అక్కడ ఎందుకు ఉన్నావ్ అని తల్లిని అడుగుతుంది. కావ్య ఎందుకు అతని దగ్గరకి వెళ్ళావ్ అని అడుగుతుంది. ముందు అసలు ఆ చీరలు ఎక్కడివి అని అడిగేసరికి పెద్దమ్మ ఇచ్చిందని అబద్ధం చెప్తుంది. కావ్య ఇంకా ఏదో మాట్లాడబోతుంటే కనకం తప్పించుకుని వెళ్ళిపోతుంది. రాజ్ తమ్ముళ్ళు అందరూ కలిసి పెళ్లికి కావాల్సినవన్నీ రాస్తూ ఉంటారు. కుటుంబం అంతా కలిసి కూర్చుని రాజ్ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. పెళ్లి బాధ్యతలు ఈవెంట్ వాళ్ళకి అప్పగించినట్టు శుభాష్ చెప్తాడు.
Also Read: కథలోకి కొత్త హీరో ఎంట్రీ, దివ్యకి జోడీ రెడీ- రాజ్యలక్ష్మికి శత్రువుగా మారిన తులసి
కనకం చీరలు తెప్పించి అన్ని స్వప్నకి పెట్టి చూసి మురిసిపోతుంది. అప్పుడే కావ్య ఇంటికి రాజ్ తమ్ముడు కృష్ణ వస్తాడు. తనని చూసి కనకం వాళ్ళని చూస్తే ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ వెళ్ళి పలకరిస్తుంది. పంతులు తెచ్చిన లిస్ట్ తీసుకొచ్చి కావ్యకి ఇస్తుంది. రాజ్ కి పెళ్లి కుదురిందని స్వప్న గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. కావ్యని మండపం దగ్గరకి వచ్చి డెకరేట్ చేయాలని అంటాడు. అక్క పెళ్లి కాంట్రాక్ట్ తనకే వచ్చిందని అది చేస్తే దొరికిపోతానని కావ్య మనసులో అనుకుంటుంది. కానీ కృష్ణ మాత్రం కావ్యనే డెకరేట్ చేయాలని బతిమలాడతాడు. అప్పుడే రాజ్ ఫోన్ చేయడంతో పొరపాటున నోరు జారి కళావతి అనేస్తాడు. తన పెళ్లికి ఆ కళావతి దగ్గర నుంచి గుండి సూది తీసుకొచ్చిన ఒప్పుకోను అని రాజ్ అంటాడు. అప్పు పెళ్లి కాంట్రాక్ట్ ఒప్పుకోమని కావ్యకి చెప్తుంది. అన్నయ్య సీరియస్ అవుతున్నాడు కదా వద్దులే అని కృష్ణ చెప్దామని అనుకునేలోపు కావ్య వచ్చి కాంట్రాక్ట్ కి ఒకే చెప్తుంది.
తల్లికి ఎలాగైనా రాహుల్ విషయం చెప్పి పెళ్లి ఆపాలని స్వప్న అనుకుంటుంది. స్వప్న రాహుల్ గురించి చెప్పే టైమ్ కి మీనాక్షి వచ్చి నగలు తీసుకొచ్చి ఇస్తుంది. కాసేపు మీనాక్షి తిక్కతిక్కగా మాట్లాడి పిచ్చిలేపుతుంది. కనకం కూతురి గురించి పట్టించుకోకుండా ఇక అక్కతో ముచ్చట్లు పెట్టేస్తుంది. అమ్మతో ఎప్పుడు చెప్పాలని అనుకున్న కుదరడం లేదని అనుకుంటూ ఉండగా రాజ్ ఫోన్ చేస్తాడు. పెళ్ళికూతురిగా ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురుచూస్తున్నా అని రాజ్ ప్రేమగా చెప్తుంటే స్వప్న మాత్రం తలకొట్టుకుంటుంది. ఫోన్లోనే రాజ్ ని భరించలేకపోయా ఇక జీవితాంతం ఎలా భరించాలని అనుకుని రాహుల్ గురించి ఆలోచిస్తుంది. అక్కడ లవర్ బాయ్ మాత్రం మరొక అమ్మాయిని ఫ్లట్ చేసే పనిలో ఉంటాడు. రాహుల్ కి కాల్ చేస్తుంది కానీ అతను కావాలని లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. లిఫ్ట్ చేయకపోతేనే నా గురించి ఆలోచించి పిచ్చెక్కిపోయి ఎక్కడిరమ్మంటే అక్కడికి వస్తావ్ అని అనుకుంటాడు.