Vidya Balan Birthday: హీటెక్కించాలన్నా, హార్ట్ ని టచ్ చేయాలన్నా సరిలేరు ఆమెకెవ్వరు
క్యారెక్టర్ ఏదైనా ఆమె నటన ముందు దాసోహం. డీ గ్లామర్ గా కనిపించాలన్నా, థియేటర్ ను హీటెక్కించాలన్నా సరిలేరు ఆమెకెవ్వరు. ఈ రోజు విద్యాబాలన్ బర్త్ డే సందర్భంగా ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ..
కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ..వాటికి న్యాయం చేస్తూ దూసుకుపోతోంది విద్యాబాలన్... ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ. వయసుతో సంబంధం లేకుండా ఆమె చేసిన క్యారెక్టర్స్ విమర్శకులను ఫిదా చేస్తాయ్. జనవరి1, 1979లో ముంబైలో ఓ తమిళ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచీ నటి అవ్వాలనుకున్న విద్యా..షబానా ఆజ్మీ, మాధురిని ఇన్సిపిరేషన్ తీసుకుంది. ముంబై విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ తర్వాత కొన్ని యాడ్స్ , మ్యూజిక్ వీడియోల్లో నటించింది. 16 ఏళ్ల వయస్సులో ఏక్తా కపూర్ షో ''హమ్ పాంచ్''లో రాధికాగా తన కెరీర్‌ని ప్రారంభించింది విద్యా. 2003లో బెంగాలీ నాటకం 'భలో తేకో'తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
Also Read: ఆందోళనలో 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్... సినిమా మళ్లీ వాయిదా పడిందా!?
'పరిణీత'తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తొలిసినిమాకే ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత అత్యధిక వసూళ్లు చేసిన 'లగే రహో మున్నా భాయ్' లో హీరోయిన్ గా నటిచింది. ఆ తర్వాత హే బేబీ , కిస్మత్ కనెక్షన్ మంచి రిజల్ట్ ఇవ్వలేదు. ఇంకా ''పా'', ''ఇష్కియా'', ''నో వన్ కిల్డ్ జెస్సికా'' లో నటించింది. అయితే 2011లో వచ్చిన సిల్క్ స్మిత బయోపిక్ ''ది డర్టీ పిక్చర్'' తో విద్యా పేరు మారుమోగిపోయింది. 'డర్టీ పిక్చర్'తో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారింది. లకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా విద్యాబాలన్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.
Also Read: షన్ముఖ్‌కు షాకిచ్చిన దీప్తి.. బ్రేకప్ చెప్పేస్తూ ఇన్‌స్టా పోస్ట్!
ఆ తర్వాత 2012లో కహాని తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'కహానీ 2, దుర్గా రాణి సింగ్' (2016), తుమ్హారీ సులు (2017), మిషన్ మంగళ్ (2019), శకుంతల, బేగం జాన్ చిత్రాల్లో నటించింది. జాతీయ చలన చిత్ర అవార్డు, ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకుంది. 2014లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. విద్యా... ఇండియన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌లో సభ్యురాలు, రేడియో షో నిర్వహిస్తోంది.
Also Read: 'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని 2012లో వివాహం చేసుకున్న విద్యా... సాధారణంగా ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు కానీ తన విజయం వెనుక సిద్ధార్థ్ ఉన్నాడంటూ గర్వంగా చెప్పుకుంటుంది.విద్యా బాలన్‌కి చీరలంటే చాలా ఇష్టం. సినిమాల్లో ఎలాంటి డ్రస్‌లు వేసినా.. బయట మాత్రం ఎప్పుడూ చీరల్లో నిండుగా కనిపిస్తూ ఉంటుంది విద్యా. ఆమె చీరకట్టుకు ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. అంతేకాదు సింప్లిసిటీ హీరోయిన్‌గా ఆమెకు పేరుంది. ఇక విద్యాబాలన్‌కి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. తీరిక సమయం దొరికితే పుస్తకాలు చదివేందుకు ఆసక్తి చూపుతుంటుంది.
Also Read: 'అర్జున ఫల్గుణ' రివ్యూ: అర్జునుడు బలయ్యాడా? బతికాడా?
Also Read: బాలకృష్ణతో సినిమా ప్రకటించిన దర్శకుడు... స్క్రిప్ట్ రెడీ!
Also Read: అజిత్ అలా చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది.. రాజమౌళి వ్యాఖ్యలు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి