By: ABP Desam | Updated at : 19 May 2022 07:24 PM (IST)
Edited By: harithac
భార్యాపిల్లలతో ఇమ్రాన్ ఖాన్
బాలీవుడ్లో నటీనటుల్లో విడాకులు పెరిగిపోతున్నాయి. అమీర్ ఖాన్, కిరణ్ రావ్ బాటలోనే అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కూడా నడవబోతున్నట్టు సమాచారం. ఇమ్రాన్ ఖాన్ ప్రేమించి పెళ్లాడిన భార్యకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడని బాలీవుడ్ మీడియా చెబుతోంది. అతను అవంతిక అనే అమ్మాయిని దాదాపు ఎనిమిదేళ్ల పాటూ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ముందే వీరిద్దరూ సహజీవనం సాగించారు. వీరిద్దరి పెళ్లి 2011లో జరిగింది. ఏడేళ్ల పాప కూడా ఉంది. తమ 19 ఏళ్ల బంధానికి ఇమ్రాన్ ఖాన్ స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాడట. గత కొన్ని నెలలుగా భార్యకు దూరంగా నివసిస్తున్నాడు. ఇప్పటికీ మనసు మారలేదని, విడాకులు ఇచ్చేందుకే సిద్ధంగా ఉన్నాడని సమాచారం. ఎంతకీ అతని మనసు మారకపోవడంతో అవంతిక కూడా విడాకులు సిద్దమైందట.
2019 వరకు వారి వివాహ జీవితం బాగానే ఉంది. ఆ ఏడాదే వారి మధ్య దూరం పెరిగి ఇద్దరూ చెరో ఇంట్లో ఉండడం మొదలుపెట్టారు. అప్పట్నించి కుటుంబ సభ్యులు, స్నేహితులు వారిద్దరినీ కలిపేందుకు చాలా ప్రయత్నాలు చేశారట. చివరికి అవంతిక కూడా స్వయానా భర్తతో ఉండే సమస్యలు సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఇమ్రాన్ మాత్రం ఒక్క మెట్టు కూడా దిగడం లేదు. అవంతికతో ఇక కలిసి జీవనం సాగించేది లేదని తేల్చి చెప్పాడట.
ఆమె కారణమా?
ఇమ్రాన్ ఖాన్ దక్షిణా హీరోయిన్ లేఖా వాషింగ్జన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని, ఆమె వల్లే అవంతికకు విడాకులు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని బాలీవుడ్ హంగామా వెబ్ సైట్ చెబుతోంది. లేఖాకు కూడా పెళ్లైంది. ఆమె భర్త పాబ్లో ఛటర్జీకి ఇమ్రాన్ మంచి ఫ్రెండు.
అమీర్ ఖాన్ సహకారంతో సినిమాల్లో అడుగుపెట్టాడు ఇమ్రాన్ ఖాన్. 2008లో జానే తు యా జానే నా సినిమాలో తొలిసారి నటించారు. మొదటి సినిమాలోనే నటనతో మెప్పించాడు. వరుస పెట్టి సినిమాలు చేశాడు. ఢిల్లీ బెల్లీ, ఐ హేట్ లవ్ స్టోరీస్, కిడ్నాప్ వంటి సినిమాల్లో నటించాడు. 2015 తరువాత ఏమైందో తెలియదు కానీ సినిమాలు చేయడం ఆపేశాడు.
Guppedantha Manasu December 7th Episode: కొనసాగుతున్న రిషి మిస్సింగ్ సస్పెన్స్ - వసు అన్వేషణ - రంగంలోకి ముకుల్!
Krishna Mukunda Murari December 7th కృష్ణకు పెళ్లి అయిందన్న షాక్లో మురారి.. భవాని దగ్గర ఏడ్చేసిన ముకుంద!
Prema Entha Madhuram December 7th Episode: అసలు విషయం తెలుసుకున్న జెండే.. జలంధర్ కి నరకం చూపిస్తున్న ఆర్య!
Nindu Noorella Saavasam December 7th Episode: అరుంధతిని వెంటాడుతున్న ఘోర.. అంజలిని చూసి కన్నీళ్
Trinayani Today December 7th Episode అఖండ స్వామి ఇచ్చిన పొడితో తిలోత్తమ గాయత్రీదేవి జాడ కనిపెట్టేస్తుందా!
Revanth Reddy First Signature: ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ పెట్టే తొలి సంతకం ఇదే
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Revath Reddy Schedule Today: నేడే సచివాలయానికి రేవంత్ రెడ్డి - సాయంత్రానికి సీఎంగా బాధ్యతల స్వీకరణ
/body>