Black Panther Director Arrested: బ్యాంక్ దోపిడీ అనుమానంతో ప్రముఖ దర్శకుడు అరెస్ట్
బ్యాంకు దోచుకోవడానికి వచ్చాడనే సందేహంతో పోలీసులు ఓ ప్రముఖ దర్శకుడిని అరెస్టు చేశారు. తాజా విడుదల చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Ryan Coogler | బ్యాంక్ దోపిడీ చేయడానికి వచ్చాడనే అనుమానంతో పోలీసులు ఓ ప్రముఖ దర్శకుడిని అరెస్టు చేయడం చర్చనీయమైంది. పోలీసుల బాడీక్యామ్‌లో రికార్డైన అరెస్టు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘బ్లాక్ పాంథర్’ (Black Panther) సినిమా దర్శకుడు ర్యాన్ కూగ్లర్(Ryan Coogler) జనవరి 7న అట్లాంటాలోని బ్యాంక్ ఆఫ్ అమెరికాకు డబ్బులు డ్రా చేయడానికి వెళ్లాడు. టెల్లెర్ కౌంటర్ వద్ద నిలుచున్న ర్యాన్‌ను పోలీసులు దోపిడీ దొంగగా అనుమానించారు. అతడి చేతులను వెనక్కి పెట్టి సంకెళ్లు వేసి అరెస్టు చేశారు. అయితే, ఇందులో అతడి తప్పేమీ లేదని తెలుసుకున్న తర్వాత వదిలిపెట్టారు.
బ్యాంక్‌లో నగదు డ్రా చేస్తున్నప్పుడు ర్యాన్ ఐడీ, అకౌంట్‌తో మ్యా్చ్ కాలేదని టెల్లార్ చెప్పిందని పోలీసులు తెలిపారు. దీంతో అతడి అనుమానం కలిగి అరెస్టు చేశామన్నారు. అన్నీ పరిశీలించి, బ్యాంక్ సిబ్బందితో మాట్లాడిన తర్వాత అది ర్యాన్ అకౌంటేనని నిర్ధరించుకున్నారు. ఆ వెంటనే విడిచిపెట్టారు. ర్యాన్ ఆ రోజు పెద్ద అమౌంట్‌ను విత్ డ్రా చేయడానికి ప్రయత్నించడం కూడా ఈ అనుమానానికి దారి తీసింది.
ఇదంతా పోలీసుల బాడీక్యామ్‌లో రికార్డైంది. ర్యాన్ ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయకుండా పోలీసులకు సహకరించడమే కాకుండా, వారు అడిగిన ప్రశ్నలకు కూల్‌గా సమాధానం ఇవ్వడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఈ ఘటనపై ర్యాన్ ఓ ప్రకటన కూడా విడుదల చేశాడు. ‘‘ఎప్పుడూ ఇలా జరగకూడదు’’ అని పేర్కొన్నాడు. ర్యాన్‌ను అరెస్టు చేస్తున్న వీడియో చూసి ఆయన అభిమానులు షాకయ్యారు. నెటిజనులంతా ఆయనపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన పోలీసులతో వ్యవహరించిన తీరును ప్రశంసిస్తున్నారు.
Also Read: ‘రాధే శ్యామ్’ రివ్యూ: విక్రమాదిత్య మెప్పించాడా?
వీడియో:
Police bodycam shows Black Panther director Ryan Coogler's arrest after he was mistaken for a bank robberhttps://t.co/i3JkLWREEl pic.twitter.com/ceFUtu1lsF
— BBC News (World) (@BBCWorld) March 11, 2022
అమెరికాలోని ఓక్లాండ్‌కు చెందిన ర్యాన్ కూగ్లర్ 2013లో ‘Fruitvale Station’ చిత్రంతో హాలీవుడ్‌కు పరిచయమయ్యారు. 2015లో ‘Creed’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2018లో ‘Black Panther’ సినిమాతో మార్వెల్ సూపర్ హీరో చిత్రాల్లో భాగస్వామి అయ్యారు. ఆయన దర్శకత్వం వహించిన ‘Black Panther: Wakanda Forever’ చిత్రం ఈ ఏడాది నవంబరులో విడుదల కానుంది.
Also Read: సూర్య ఈటి - ఎవరికీ తలవంచడు మూవీ రివ్యూ: తమిళ ప్రేక్షకుల కోసమేనా? తెలుగు గురించి ఆలోచించరా?