By: ABP Desam | Updated at : 02 Mar 2023 04:16 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Zee Music Company/You Tube
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'. ఫర్హాద్ సామ్ జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ పత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ‘బిల్లి బిల్లి’ పాటను విడుదల చేశారు. ఈ పాట కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ పార్టీ సాంగ్ ను విడుదల చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ పాట యూట్యూబ్ లో అప్లోడ్ అయినప్పటినుంచి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
గురువారం యూట్యూట్‌లో ‘బిల్లి బిల్లి’ పాటను రిలీజ్ చేశారు. ఇక ఈ పాటలో సల్మాన్ ఖాన్ తో పాటు నటి పూజా హెగ్డే, షహనాజ్ గిల్, భూమికా చావ్లా, విక్టరీ వెంకటేష్, పాలక్ తివారీ, సిద్దార్థ్ నిగమ్, జస్సీ గిల్ ఇతర నటీనటులు కనిపిస్తున్నారు. సుఖ్బీర్ కంపోజ్ చేస్తూ పాడిన ఈ పాట చాలా క్యాచీ గా ఉంది. ఈ పాటలో స్టెప్పులు, అలాగే బ్యాగ్రౌండ్, నటీనటుల వేషధారణలు అన్నీ ఆకట్టుకునేలా కలర్ఫుల్ గా తీర్చిదిద్దారు. సల్మాన్, వెంకటేష్ స్టెప్పులు సరదాగా అనిపిస్తాయి. ఫుల్ పార్టీ మూడ్ తలపించేలా పాటను రూపొందించారు మేకర్స్. ఈ పాట సల్మాన్ అభిమానులకు నచ్చుతుందనే చెప్పొచ్చు.
ఈ ‘కిసి కా భాయ్ కిసి కీ జాన్’ సినిమాను తమిళ నటుడు అజిత్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘వీరమ్’ కు రిమేక్ గా సల్మాన్ ఖాన్ హిందీలో చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలుగులో ‘కాటమరాయుడు’ గా తీశారు. రెండు చోట్లా ఈ సినిమా మంచి ఫలితాన్నే అందించింది. అందుకే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నారట సల్మాన్. అందుకే ఈ సినిమా పై ముందు నుంచీ అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ కు మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడీ ఈ ‘బిల్లి బిల్లి’ పార్టీ పాటకు కూడా మంచి స్పందనే వస్తోంది. అయితే మొదట్లో సల్మాన్ ఖాన్ లాంగ్ హెయిర్ తో కనబడిన ఫోటోలపై కాస్త నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. తర్వాత ఆ కామెంట్లు కూడా తగ్గి మూవీ పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా తర్వాత సల్మాన్ వరుసగా ప్రాజెక్టులు చేయనున్నారు. ఇప్పటికే ‘బజరంగీ బహైజాన్’ సెకండ్ పార్ట్ పై ప్రకటన చేశారు. తర్వాత రాబోయే ప్రాజెక్ట్‌లలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో ‘కిక్ 2’, కత్రినా కైఫ్‌తో ‘టైగర్ 3’ రెడీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది.
NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్
Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన
Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్
Upasana On Ram Charan : నా మార్గదర్శి రామ్ చరణ్ - భర్త గురించి ఉపాసన ఎంత బాగా చెప్పిందో
Samantha Ruth Prabhu : చీకట్లో బతికా, నాగ చైతన్యతో విడాకులపై మరోసారి సమంత కామెంట్
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
Kadiam Srihari: ఎన్నికల్లో నన్ను వాడుకుంటారు, ఈ మీటింగ్‌లకు మాత్రం పిలవరు - ఎమ్మెల్సీ కడియం వ్యాఖ్యలు
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు