అన్వేషించండి

Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ నాకు రెండో తల్లి, ఆ దమ్ము నాకుంది - వారికి సాయం చేస్తానంటూ యావర్ కన్నీరు మున్నీరు

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో తన జర్నీ వీడియో చూసుకున్న తర్వాత వెక్కివెక్కి ఏడ్చాడు యావర్. అంతే కాకుండా చూస్తున్న ప్రేక్షకులకు ఒక మాట కూడా ఇచ్చాడు.

Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఇక కంటెస్టెంట్స్ అంతా గొడవలు పడే టాస్కులు అయిపోయాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఫైనల్‌గా ఫినాలే వీక్‌లో టాప్ 6 కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. అందుకే బిగ్ బాస్ హౌజ్‌లో ఈ ఆరుగురి ప్రయాణాన్ని వారి కళ్లకు కట్టినట్టు చూపిస్తూ వారిని ఎమోషనల్ చేస్తున్నారు బిగ్ బాస్. కొన్నిరోజులపాటు టాస్కులను పూర్తిగా పక్కనపెట్టేశారు. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్.. వారి జర్నీ వీడియోలు చూసి ఎమోషనల్ కాగా.. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో యావర్, ప్రశాంత్‌లు కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. యావర్ అయితే వెక్కివెక్కి ఏడుస్తూ బిగ్ బాస్‌కు ధన్యవాదాలు చెప్పుకున్నాడు.

యావర్ ఎమోషనల్ ఓవరాక్షన్..
తన జర్నీ వీడియోలో తన అన్నయ్యను చూడగానే ఏడవడం మొదలుపెట్టాడు యావర్. శివాజీతో తనకు ఉన్న బాండింగ్, ప్రశాంత్‌తో ఫ్రెండ్‌షిప్.. అన్నీ తనను చాలా ఎమోషనల్ చేశాయి. ఇక జర్నీ వీడియో చూసుకున్న తర్వాత ‘‘నాలో చాలా కోపం ఉందని చాలామంది అనుకుంటారు. కానీ చరిత్రను తిరగరాసే దమ్ముంది నాలో’’ అని చాలా ఇంటెన్స్ డైలాగ్ కొట్టాడు యావర్. ఆ తర్వాత ‘‘థాంక్యూ బిగ్ బాస్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ నేషనల్ టీవీలో అందరికీ నేనొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఒకవేళ నేను గెలిస్తే.. అవసరమైనవాళ్లకి ఈ యావర్ హెల్ప్ చేస్తాడు. నేను నిలబడితే నాతో పాటు మరొకరిని నిలబెడతాను. అదే యావర్ అంటే. నేను హైదరాబాద్ బిడ్డ కాదు. నేను కోలకత్తా బిడ్డ కాదు. నేను నీ బిడ్డ’’ అంటూ బిగ్ బాస్‌తో చెప్పుకొచ్చాడు. ‘‘ఎప్పటివరకు నా ఊపిరి ఉంటుందో.. అప్పటివరకు బిగ్ బాస్ పేరు నా మనసుపై నిలిచిపోతుంది. అసలు నేను ఎవరు? అసలు యావర్ ఎవరు? ఒకప్పుడు నేను నథింగ్.. కానీ మీరే నన్ను సంథింగ్ చేశారు’’ అని అన్నాడు. ఆ తర్వాత వెక్కివెక్కి ఏడుస్తూ బిగ్ బాస్‌కు లవ్ యూ చెప్పాడు. అంతే కాకుండా తనను బిగ్ బాస్ నమ్మాడని ఏడ్చాడు. బిగ్ బాస్‌ తనకు రెండో తల్లి అన్నాడు. చెప్పడానికి మాటలు లేవు అంటూ అలాగే ఏడుస్తూ బయటికి వెళ్లిపోయాడు.

పదేపదే రైతుబిడ్డ అని గుర్తుచేసిన ప్రశాంత్..
యావర్ తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లో తన జర్నీ చూసుకోవడానికి వచ్చాడు పల్లవి ప్రశాంత్. తన ఏవీ తాను చూస్తున్నంతసేపు తనలో వేరే మనిషి ప్రవేశించినట్టుగా ఊగిపోతూనే ఉన్నాడు. ఆ తర్వాత తను కూడా యావర్‌లాగా ఎమోషనల్ అయ్యాడు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు, బిగ్ బాస్‌కు రుణపడి ఉంటానని థాంక్యూ చెప్పుకున్నాడు. మళ్లీ మళ్లీ తాను రైతుబిడ్డ అని ఆడియన్స్‌కు గుర్తుచేశాడు. ఆ తర్వాత హౌజ్‌లోకి వెళ్లి తన జర్నీ వీడియో చాలా బాగుందని చెప్తూ.. అసలు వీడియోలో ఎవరెవరు ఉన్నారో చెప్పుకొచ్చాడు. అమర్‌కు, తనకు జరిగిన గొడవలే వీడియోలో ఎక్కువగా ఉన్నాయని అమర్‌తో అన్నాడు. అది విన్న అమర్.. చిన్నపిల్లవాడిలాగా నలుగురి జర్నీ వీడియోల్లో తాను ఉన్నానని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంతే కాకుండా నాలుగు సినిమాల్లో ఉన్నానని మురిసిపోయాడు. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితి చూస్తుంటే.. రైతుబిడ్డకే ఎక్కువ సపోర్ట్ దక్కేలా అనిపిస్తోంది. తనే విన్నర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు బిగ్ బాస్ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ‘బిగ్ బాస్’ ఫినాలే: ఓటింగ్‌లో వారే టాప్, ఆ కంటెస్టెంట్‌‌కు మిడ్ వీక్ ఎలిమినేషన్ గండం

టాప్ హెడ్ లైన్స్

Nikhil Vijayendra Simha: డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget