Bigg Boss 5 Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?
ఈ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను సేవ్ చేయడం కోసం బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రాసెస్ ను రద్దు చేస్తున్నారట. డేంజర్ జోన్ లో మాత్రం లోబో ఉన్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 5 ఈ వారంతో ఎనిమిది వారాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వాళ్లేవరంటే.. సిరి, శ్రీరామ్, లోబో, రవి, షణ్ముఖ్, మానస్. వీరందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఎవరిని ఎలిమినేట్ చేస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతోంది. గత వారమేమో.. యానీ మాస్టర్ ఎలిమినేట్ అవుతుందనుకుంటే.. ప్రియాను ఎలిమినేట్ చేసి షాకిచ్చాడు బిగ్ బాస్. ఈసారి కూడా అలాంటి సర్ప్రైజ్ ఉంటుందా అని అనుకున్నారు.
Also Read: 'బయటకొస్తే నీకుంటాది..' షణ్ముఖ్ కి వార్నింగ్ ఇచ్చిన సన్నీ
ఇక ఈ వారం అందరికంటే ఎక్కువ ఓట్లు షణ్ముఖ్ కి రాగా.. తక్కువ ఓట్లు లోబోకి వచ్చాయి. ఈ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్ లో ఉండడంతో.. వారిని సేవ్ చేయడం కోసం బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రాసెస్ ను రద్దు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్ పక్కా ఉంటుందట. డేంజర్ జోన్ లో ఉన్న లోబో ఆదివారం నాడు ఎలిమినేట్ కావడం ఖాయమని సమాచారం.
నిజానికి కొన్ని రోజుల క్రితమే లోబో ఎలిమినేట్ అయిపోయినట్లు స్టేజ్ పైకి పిలిచి.. అతడిని సీక్రెట్ రూమ్ లోకి పంపించారు బిగ్ బాస్. సీక్రెట్ రూమ్ నుంచి బయటకొచ్చిన తరువాత నుంచి లోబోలో కాస్త ఫైర్ కనిపించింది. అయినప్పటికీ.. అతడి ఈ వీక్ ఎలిమినేట్ అవ్వక తప్పడం లేదు.
ఇక కొన్ని రోజులుగా బిగ్ బాస్ షోలో గొడవల మీద గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వారం షణ్ముఖ్ కెప్టెన్ గా అవ్వడంతో.. జెస్సీ సంచాలక్ గా సరిగ్గా వ్యవహరించలేదని సన్నీ మండిపడ్డాడు. అతడిని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎంపిక చేసి జైల్లో పెట్టగా.. అక్కడ నుంచి కూడా హౌస్ మేట్స్ తో గొడవ పెట్టుకుంటూ కనిపించాడు సన్నీ.
Also Read: అమ్మో, అమలాపాల్.. నీ అందాల విందు చూస్తే కుర్రకారు గుండె గుబేల్
Also Read: పెళ్లాం లేచిపోతే.... పెళ్లి కొడుక్కి వచ్చే కష్టాలు ఏంటి?
Also Read: ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్! - పునీత్ మరణంపై అనుష్క స్పందన
Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి
Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి